దోమ‌లు ఎలాంటి వారిని ఎక్కువ‌గా కుడ‌తాయో తెలుసా..?

దోమలు… మనిషి అనేవాడు క‌న‌బ‌డితే చాలు… కుట్టి కుట్టి మ‌రీ ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. ర‌క్తాన్ని పీలుస్తూ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను, జ్వ‌రాల‌ను వ్యాపింపజేస్తాయి. ఈ క్ర‌మంలో దోమ‌ల బారి నుంచి త‌ట్టుకునేందుకు అధిక శాతం మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను కూడా పాటిస్తుంటారు. అయితే మీకు తెలుసా..? దోమ‌లు ఎవ‌రిని ప‌డితే వారిని కుట్ట‌వ‌ట‌. అవి కేవ‌లం ప‌లు ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలు, అంశాలు ఉన్న‌వారినే కుడ‌తాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే ఇంత‌కీ దోమ‌లు ఎలాంటి వారిని ఎక్కువ కుడ‌తాయి..? అనేగా మీరు అడ‌గ‌బోయేది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

mosquito-biting

బ్ల‌డ్ గ్రూప్‌…
ఏ, బీ, ఏబీ, ఓ అని బ్ల‌డ్ గ్రూపులు ఉంటాయి తెలుసు క‌దా. అయితే ఈ గ్రూపుల్లో ఓ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారిని దోమ‌లు ఎక్కువ‌గా కుడ‌తాయ‌ట‌. ఆ త‌రువాత లిస్ట్‌లోకి వ‌రుస‌గా బి గ్రూప్‌, ఎ గ్రూప్‌, ఏబీ గ్రూప్ వ్య‌క్తులు వ‌స్తారు. వీరు త‌మ ఒంట్లోంచి పంపే సిగ్న‌ల్స్‌ను బ‌ట్టి దోమ‌లు వ‌చ్చి కుడ‌తాయ‌ట‌.

blood-groups

భారీకాయుల‌ను…
భారీ శ‌రీరం ఉన్న‌వారిని కూడా దోమ‌లు కుడ‌తాయ‌ట‌. వారి నుంచి పెద్ద మొత్తంలో విడుద‌ల‌య్యే కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను దోమ‌లు ఇట్టే క‌నిపెడ‌తాయ‌ట‌. దీంతో అలాంటి వారు 50 మీట‌ర్ల దూరంలో ఉన్నా దోమ‌లు ఇట్టే ప‌సిగ‌ట్టి వారిని కుడ‌తాయ‌ట‌.

big-body

చెమ‌ట ఎక్కువ‌గా వ‌చ్చేవారిని…
మ‌న‌కు వ‌చ్చే చెమ‌ట‌ను కూడా దోమ‌లు క‌నిపెడ‌తాయ‌ట‌. చెమ‌ట పోసిందంటే చాలు వాటికి వాస‌న తెలిసిపోతుంది. దీంతో అవి వ‌చ్చి మ‌న‌ల్ని కుట్టేస్తాయి.

కొవ్వు ఎక్కువ‌గా ఉన్న‌వారిని…
చ‌ర్మం కింద కొవ్వు ఎక్కువ‌గా ఉన్న‌వారిని దోమ‌లు కుడ‌తాయి. ఆ కొవ్వును దోమ‌లు గుర్తిస్తాయ‌ట‌. అందుకే అలాంటి వ్య‌క్తుల‌ను దోమ‌లు ఎక్కువ‌గా కుడ‌తాయి.

beer-drinking

బీర్‌…
ఇక చివ‌రిగా బీర్ తాగేవారిని. అవును, బీర్ తాగేవారిని కూడా దోమ‌లు ఇట్టే గుర్తిస్తాయ‌ట‌. వారి శ‌రీరం నుంచి వచ్చే వాస‌న‌ను దోమ‌లు ప‌సిగ‌ట్టి వారిని కుడ‌తాయ‌ట‌.

Comments

comments

Share this post

scroll to top