కూతురు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న మీనా…ఎందుకో తెలుసా.?

మీనా తెలుగు ఇండస్ట్రీలోకి చిన్నతనంలోనే వచ్చిన పెద్ద పెద్ద నటులతో నటించి మంచి పేరు సంపాదించుకుంది. సీతా రామయ్యాగారి మనుమరాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా 1975 సెప్టెంబర్ 16న చెన్నైలో జన్మించింది. మీనా ను నటిగా చూడాలని కలలు కన్నా ఆమె తల్లి ఒకనాటి తమిళ హీరోయిన్. తన కూతురిని కూడా హీరోయిన్ గా చూసుకోవాలని మీనా తల్లి రాజమల్లిక కలలు కన్నారు. సినిమా ఇండస్ట్రీలో పరిచయాలున్న రాజమల్లిక జెమని గణేషన్ ను ఓ పార్టీలో కలిసినప్పుడు మీనా ను చూసి మంచి భవిష్యత్ ఉంది అని ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇక రాజమల్లిక మరో అడుగు వేసి నిర్మాత ఎంఎం రత్నం దగ్గరకు తీసుకెళ్లగా ఆయన మరో ఆఫర్ ఇచ్చారు.


అలా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మీనా తెలుగులో చంటి, సుందరకాండ,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం,అల్లరి మొగుడు చిత్రాలతో టాప్ హీరోయిన్ అయింది. 1991 నుంచి 2000 వరకు తెలుగులో అగ్రకథానాయికగా వెలుగొందింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోంది.
2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనికా అనే పాప పుట్టింది. మీనా తనలాగే తన కూతురు కూడా సినీ ఇండస్ట్రీలో రాణించాలని కలలు కనేది. ఇక మీనా కూతుకు నైనికా విజయ్ చిత్రాంలో బాలనటిగా నటించింది. ఆతర్వాత సిద్ధికీ డైరెక్షన్ చేసిన భాస్కర్ ఓరు రాస్కెల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మీనాకు ఎప్పటి నుంచో విజయ్, సిద్దిఖీ చిత్రాలలో నటించాలని కోరికగా ఉండేదట. కానీ ఆ కోరిక ఇప్పటికి తీరలేదు. కానీ తన కూతురు నైనికా వారి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించినందుకు మీనా ఇప్పుడు చాలా సంతోషంగా ఉందట. తన కోరిక తీర్చిన కూతురిని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందట.

Comments

comments

Share this post

scroll to top