శ్రీ‌కృష్ణుడికి 16వేల మంది భార్య‌లు ఎందుకు ఉండేవారో తెలుసా..?

శ్రీ‌కృష్ణుడికి 16వేల మంది భార్య‌లు అని అంద‌రికీ తెలిసిందే. వారిని గోపిక‌లు అని కూడా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అయితే 16వేల మంది కాదు, నిజానికి ఆ సంఖ్య ఎంతంటే 16,108 మంది. అవును ఆ సంఖ్య క‌రెక్టే. హిందూ పురాణాల్లో దీని గురించి ప్ర‌స్తావ‌న ఉంది. అయితే ఆ 16,108 మందిని శ్రీ‌కృష్ణుడు ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలుసా..? అంత మంది భార్య‌లు ఆయ‌న‌కు ఎందుకు ఉన్నారు..? ఆయ‌న‌కు ఆ అవ‌స‌రం ఎందుకొచ్చింది..? అంటే… ఆ విష‌యాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ‌కృష్ణుడికి నిజానికి 8 మంది భార్య‌లే. వారి పేర్లు రుక్మిణి, స‌త్య‌భామ‌, జాంబ‌వ‌తి, న‌గ్న‌జితి, కాళింది, మిత్ర‌వింద‌, భ‌ద్ర‌, లక్ష్మ‌ణ‌. వీరినే ఆయ‌న వ‌రించి పెళ్లి చేసుకున్నాడు. అయితే మరి ఆ 16,100 మంది ఆయ‌నకు ఎలా భార్య‌లు అయ్యారు..? అంటే దాని వెనుక ఓ క‌థ ఉంది. అదేమిటంటే… శ్రీ‌కృష్ణుడు న‌ర‌కాసురున్ని వ‌ధిస్తాడు క‌దా. అయితే నిజానికి న‌ర‌కాసురుడు కామాంధుడు. 16,100 మంది స్త్రీల‌ను తెచ్చి అంతఃపురంలో బందీల‌ను చేసుకుని వారిని నిత్యం చిత్ర‌హింస‌ల‌కు గురి చేసేవాడు.

ఆ 16,100 మందిని న‌ర‌కాసురుడు త‌న శృంగారానికి బానిస‌లుగా చేసుకున్నాడు. వారికి న‌ర‌కం చూపించేవాడు. ఈ క్ర‌మంలో అత‌ను కృష్ణుడి చేతిలో చ‌నిపోగానే వారికి స్వేచ్ఛ ల‌భిస్తుంది. కానీ వారు తిరిగి సొంత స్థ‌లాల‌కు వెళ్ల‌లేక‌పోతారు. ఎందుకంటే ప‌రాయి పురుషుడి ఆధీనంలో వారు అప్ప‌టివ‌రకు ఉన్నారు కాబ‌ట్టి వారిని ఎవ‌రూ స్వీక‌రించ‌లేదు. వారికి వివాహాలు కాలేదు. దీంతో కృష్ణుడు ఏం చేశాడంటే వారంద‌రినీ త‌న భార్య‌లుగా ప్ర‌క‌టించి రాణి హోదాల‌ను ఇచ్చాడు. అలా ఆయ‌న‌కు మొత్తం 16,108 మంది భార్య‌లు అయ్యారు. అదీ… ఆయ‌న‌కు అంత మంది భార్య‌లు ఉండ‌డం వెనుక అస‌లు క‌థ‌..!

Comments

comments

Share this post

scroll to top