ల్యాప్‌టాప్‌ల‌కు చిన్న‌పాటి రంధ్రం లాంటి స్లాట్ ఎందుకు ఉంటుందో తెలుసా..?

నేడు మ‌న‌కు ఎంత అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో త‌యారైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చినా ల్యాప్ టాప్ లు మాత్రం ఇప్ప‌టికీ ఆద‌ర‌ణ‌ను కోల్పోలేదు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌తో కాని ప‌నులు ల్యాప్‌టాప్‌ల‌తో అవుతున్నాయి క‌దా..! అందుక‌ని వాటి ప‌ట్ల యూజ‌ర్లు ఇప్ప‌టికీ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే ల్యాప్‌టాప్‌ను వాడుతున్న ఏ యూజ‌ర్‌కైనా దాని గురించి ఎక్కువగానే తెలుస్తుంది. దానికి ఉండే పోర్టులు, అందులో ఉండే ఫీచ‌ర్లు అన్నీ తెలుస్తాయి. కానీ కొంద‌రు ల్యాప్‌టాప్ యూజ‌ర్ల‌కు మాత్రం తెలియని విష‌యం ఒక‌టుంది. అదేమిటంటే… దానికి ఉండే ఓ ప్ర‌త్యేక‌మైన పోర్టే… అయితే నిజానికి చూసేందుకు అది ఓ స్లాట్ లా ఉన్నా… అది ల్యాప్‌టాప్‌కు ఉన్న స్లాట్ల‌లా ప‌నిచేయ‌దు. దాంతో వేరే ఉప‌యోగం ఉంది.

laptop-lock

ఇటీవ‌లి కాలంలో వ‌స్తున్న ల్యాప్‌టాప్‌ల‌కు వెనుక లేదా ప‌క్క‌ల‌కు ఓ స్లాట్ ఉంటుంది గ‌మ‌నించారా..? అయితే అది నిజానికి స్లాట్ కాదు. అది ల్యాప్‌టాప్ సెక్యూరిటీ కోసం ఉంచిన ఓ లాక్‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ల్యాప్‌టాప్‌ను లాక్ చేసుకునేందుకు అది ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని మొద‌ట కెన్సింగ్‌ట‌న్ అనే కంపెనీ త‌యారు చేసింది. అందుకే ఆ లాక్‌ను కెన్సింగ్‌ట‌న్ లాక్ అని పిలుస్తారు. దానికి బైక్‌ను పోలిన ఓ వైర్ లాక్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. ఈ వైర్ లాక్ మ‌న‌కు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతోంది.

ల్యాప్‌టాప్ లాక్‌లు రూ.100 మొద‌లు రూ.వేయి వర‌కు యూజ‌ర్లకు ల‌భ్య‌మ‌వుతున్నాయి. అయితే ఏ లాక్‌ను కొన్నా దాన్ని మాత్రం ల్యాప్‌టాప్ సెక్యూరిటీ కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. దానికి ఉండే చిన్న‌పాటి పిడిని ల్యాప్‌టాప్‌కు ఉన్న లాక్ స్లాట్‌లో అమ‌ర్చాలి. అనంత‌రం రెండో చివ‌ర‌ను వేరే స్థిరంగా ఉండే ఏదైనా పోల్ లేదా కంప్యూట‌ర్ టేబుల్‌కు ఉండే కాళ్ల‌కు అమర్చాల్సి ఉంటుంది. దీంతో ల్యాప్‌టాప్ లాక్ అయిపోతుంది. ఇక దాన్ని ఎవ‌రూ తీసుకెళ్లేందుకు అవ‌కాశం ఉండ‌దు. అలా ల్యాప్‌టాప్‌ను యూజ‌ర్లు ర‌క్షించుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top