జ‌య‌ల‌లిత మృత‌దేహాన్ని ద‌హనం చేయ‌కుండా, ఖ‌న‌నం ఎందుకు చేస్తున్నారో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మ‌త విశ్వాసాల‌ను పాటించే ప్ర‌జ‌లు ఉన్నారు. అందుకు అనుగుణంగానే వారి విశ్వాసాల ప్ర‌కారం ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా వ్య‌క్తి చ‌నిపోతే అంత్య‌క్రియ‌లు చేస్తారు. అందులో ప్ర‌ధాన‌మైన‌వి రెండు. ఒక‌టి మృత‌దేహాన్ని కాల్చ‌డం. రెండు పూడ్చ‌డం. ఈ రెండింటిలో ఏదో ఒక ప‌ద్ధ‌తిలో చ‌నిపోయిన వ్య‌క్తి దేహానికి అంతిమ క్రియ‌లు నిర్వ‌హిస్తారు. అయితే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌ను ఆమె సాంప్ర‌దాయం ప్ర‌కారం నిజానికి ద‌హ‌నం చేయాలి. కానీ ఆమెను ఆ ప‌ద్ధ‌తిలో కాకుండా ఖ‌న‌నం చేస్తున్నారు. అంటే ఆమె దేహాన్ని పూడ్చి పెడుతున్నారు. ఎందుకో తెలుసా..?

jayas-body-buried

త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత బ్రాహ్మ‌ణ కుటుంబానికి చెందుతారు. ఆమె అయ్యంగార్ నామాన్ని నిత్యం నుదుటిపై ధ‌రిస్తారు. ఈ క్ర‌మంలో ఆమె వ‌ర్గానికి చెందిన విశ్వాసాల‌కు అనుగుణంగా అయితే ఆమె మృత‌దేహాన్ని ద‌హ‌నం చేయాలి. అలా కాకుండా ఏఐఏడీఎంకే పార్టీ వ‌ర్గాలు ఆమె మృత దేహాన్ని పూడ్చి పెట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఎందుకంటే… గ‌తంలో మృతి చెందిన చాలా మంది త‌మిళ‌నాడు నాయ‌కుల‌ను పూడ్చే పెట్టారు. అలా చేయ‌డం వ‌ల్ల వారి అభిమానుల‌కు ఇంకా ద‌గ్గ‌ర‌గానే ఉన్న‌ట్టు ఉంటుంది అన్న ఫీలింగ్‌. ఒక‌ప్పుడు ఎంజీఆర్ చ‌నిపోతే ఆయ‌న మృత‌దేహాన్ని కూడా పూడ్చి పెట్టారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికీ ఆయ‌న స‌మాధి నుంచి గ‌డియారం టిక్ టిక్ మ‌న్న శ‌బ్దం వ‌స్తూ ఉంటుంద‌ట‌. దాంతోపాటు పూడ్చిపెట్ట‌డం వ‌ల్ల చ‌నిపోయిన వారు ఇంకా త‌మ ద‌గ్గ‌రే ఉన్నార‌న్న భావం క‌లుగుతుంది. అందుకే చాలా మంది నాయ‌కుల‌ను అలా పూడ్చిపెడుతూ వ‌స్తున్నారు.

జ‌య మృత‌దేహాన్ని కాల్చ‌కుండా పూడ్చ‌డానికి ఇంకో కార‌ణం ఏమిటంటే… వ్య‌క్తిగ‌తంగా జ‌య బ్రాహ్మ‌ణ కుటుంబానికి చెందిన వారైనా పార్టీ ప్ర‌కారం ఆమెకు కులం లేదు, మ‌తం లేదు, అంద‌రికీ అమ్మ ఒక‌టే. అందుకే ఆమె దేహాన్ని పూడ్చి పెడుతున్నారు. ఇక చివ‌ర‌గా ఇంకో కార‌ణ‌మేమిటంటే… జ‌య మృత‌దేహాన్ని ద‌హ‌నం చేయ‌డానికి త‌ల‌కొరివి పెట్టే ఎవ‌రో ఒక‌రు ఆమె ర‌క్త సంబంధీకులు ఉండాలి. కానీ అలా ఎవ‌రూ లేర‌ట (దీప అని జ‌య సోద‌రుడి కుమార్తె ఉంది, కానీ ఆమెను ఇప్ప‌టి వ‌ర‌కు జ‌య వ‌ద్ద‌కు అనుమ‌తించ‌లేదు, మీడియాతో కూడా ఆమెను మాట్లాడ‌నీయ‌డం లేదు అని తెలిసింది). దీంతో జ‌య మృత‌దేహాన్ని ద‌హ‌నం చేయ‌డం సాధ్యం కాదు కాబ‌ట్టే పూడుస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top