జైన మ‌తానికి చెందిన స‌న్యాసులు నోటికి ముహ ప‌ట్టీ ఎందుకు ధ‌రిస్తారో తెలుసా..?

Azhar

ప్రపంచంలో అనేక మ‌తాలు ఉన్నాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఏ మ‌త‌మైనా ఒక్కో దాంట్లో భ‌క్తులు న‌మ్మే విశ్వాసాలు అనేకం ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఆ మ‌తానికి చెంది స‌న్యాసులు పాటించే ఆచారాలు కూడా అనేకం ఉంటాయి. అలాంటి వాటిలో జైన స‌న్యాసులు పాటించే ముహ‌ప‌ట్టి ఆచారం కూడా ఉంది. జైన మ‌తానికి చెందిన స‌న్యాసులు ముహ‌పట్టి ధ‌రించే ఉంటారు. తెల్ల‌ని వ‌స్త్రంతో ఆ ప‌ట్టీ త‌యారు చేయ‌బ‌డి ఉంటుంది. అయితే మీకు తెలుసా..? నిజానికి జైన స‌న్యాసులు ఈ ముహ‌ ప‌ట్టిని నోటికి ఎందుకు ధ‌రిస్తారో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

జైనులు అహింస ధ‌ర్మాన్ని పాటిస్తారు. ఇక ఆ మ‌తానికి చెందిన స‌న్యాసులు అయితే దీన్ని కొంచెం ఎక్కువ‌గానే పాటిస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే సాధార‌ణంగా మ‌నం శ్వాస తీసుకునేట‌ప్పుడు నోట్లోకి కూడా కొన్ని క్రిములు వెళ్తాయి. కానీ అవి అక్క‌డ ఉండ‌లేవు. చ‌నిపోతాయి. ఇలా క్రిములు చ‌నిపోవ‌డం అంటే హింస చేసిన‌ట్టే క‌దా. ఇది వారి ధర్మానికి విరుద్ధం. క‌నుకనే అలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు గాను జైన స‌న్యాసులు నోటికి ముహ‌ ప‌ట్టి ధ‌రిస్తారు. దీంతో నోట్లోకి క్రిములు వెళ్ల‌వు. అవి చ‌నిపోవు.

అయితే జైన మ‌తంలో స‌న్యాసులే కాదు, కొంద‌రు సాధార‌ణ పౌరులు కూడా ఇలా చేస్తారు. కానీ వారు నోటికి ముహ‌ప‌ట్టి ధరించ‌రు. కాక‌పోతే వారు మాట్లాడిన‌ప్పుడ‌ల్లా నోటికి చేయి అడ్డం పెట్టుకుంటారు. లేదంటే తెల్ల‌ని క‌ర్చీఫ్‌ను అడ్డు పెట్టుకుంటారు. ఇలా చేసినా వారి ఆచారం పాటించిన‌ట్టే అవుతుంద‌ట‌. కానీ స‌న్యాసులు మాత్రం ఇక నిరంత‌రంగా అలా ముహ‌ప‌ట్టీ ధ‌రించే ఉంటారు..!

Comments

comments