ఆండ్రాయిడ్ క‌న్నా ఐఫోన్ల ఖ‌రీదు ఎందుకు ఎక్కువ‌గా ఉంటుందో తెలుసా..?

ఐఫోన్‌… దీని గురించి తెలియ‌ని వారుండ‌రు. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లే కాదు, వాటిని వాడ‌ని వారికి కూడా ఐఫోన్ ఖ‌రీదు, దాని విలువ గురించి తెలుసు. ఈ మ‌ధ్యే యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో కొత్త మోడ‌ల్ అయిన ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. వీటి ప్రారంభ ధ‌ర‌లు వింటే మీరు షాక్ అవుతారు. రూ.60వేల ప్రారంభ ధ‌ర‌ నుంచి ఇవి వినియోగ‌దారుల‌కు అక్టోబ‌ర్ 7 న‌ అందుబాటులోకి రానున్నాయి. గ‌తంలో వ‌చ్చిన ఐఫోన్ల‌తో పోలిస్తే ఇప్ప‌టి ఐఫోన్ 7, 7 ప్ల‌స్ ధ‌ర‌లు కాస్తంత ఎక్కువ‌య్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ గ‌తంలో ఒక‌ప్పుడు ఐఫోన్లు వ‌చ్చినా వాటి ధ‌ర‌లు ఆ ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే ఎక్కువ‌గానే ఉన్నాయి త‌ప్ప, ఏ మాత్రం త‌క్కువగా లేవు. ఐఫోన్ మొద‌ట విడుద‌లైన‌ప్ప‌టి నుంచి దాని రేట్లు అలాగే ఉంటూ వ‌స్తున్నాయి. కానీ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే యాపిల్ తన ఐఫోన్ రేట్ల‌ను ఎందుకింత ఎక్కువ‌గా ఉంచుతోంది..? నిజానికి వాటిలోని హార్డ్‌వేర్ పార్ట్స్‌ను విడిగా తీసి చూస్తే ఐఫోన్ ధ‌ర రూ.15 వేల నుంచి రూ.25వేల మ‌ధ్యే ఉంటుంది. కానీ యాపిల్ అంత‌కు రెట్టింపు ధ‌ర‌తో ఐఫోన్ల‌ను అమ్ముతోంది. ఎందుకిలా దానికి రెట్టింపు ధ‌ర‌ను వినియోగ‌దారులు చెల్లిస్తున్నారు..? నిజంగా ఐఫోన్ల‌లో అంత ద‌మ్ముందా..?

iphone-android-phone

ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న‌వి రెండు ప్ర‌ధాన బ్రాండ్లు. అవి ఆండ్రాయిడ్‌, ఐఫోన్లు. ఆండ్రాయిడ్ ఫోన్లు మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భ్య‌మ‌వుతున్నాయి. అదే ఐఫోన్లు అయితే ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు కొన్ని వందల రెట్లు ఎక్కువ ఖ‌రీదును క‌లిగి ఉంటున్నాయి. అయితే ఒకే రేటు ఉన్న ఐఫోన్‌, ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను ప‌రిశీలిస్తే వాటిలో హార్డ్‌వేర్ అంతా దాదాపుగా ఒకే ర‌కంగా ఉంటుంది. కానీ ప‌నితీరులో మాత్రం తేడా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఐఫోన్ డిస్‌ప్లేను తీసుకుంటే అందులో ఇత‌ర ఆండ్రాయిడ్ ఫోన్ల క‌న్నా త‌క్కువ రిజ‌ల్యూష‌న్ ఉంటుంది. కానీ ఆ డిస్‌ప్లేలో ఆండ్రాయిడ్ క‌న్నా మెరుగా ఫొటోలు, వీడియోలు, స్క్రీన్ క‌నిపిస్తాయి.

ఇక ఐఫోన్ ప్రాసెస‌ర్ విష‌యానికి వ‌స్తే అది ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే ప్రాసెస‌ర్ క‌న్నా త‌క్కువ కోర్లు, స్పీడ్‌ను క‌లిగి ఉంటుంది. కానీ మెరుగైన ప‌నిత‌నాన్ని అందిస్తుంది. డివైస్‌లో మ‌నం ఓపెన్ చేసే యాప్స్‌కు అనుగుణంగానే ప్రాసెస‌ర్ స్పీడ్ వినియోగ‌మ‌వుతుంది. క‌నుక ప్రాసెస‌ర్ స్పీడ్ త‌క్కువ అయినా ప‌నిత‌నం మాత్రం మెరుగ్గా ఉంటుంది. ఇది ర్యామ్‌కు కూడా వ‌ర్తిస్తుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లో 1 జీబీ ర్యామ్ ఉన్నా, ఐఫోన్‌లో 512 ఎంబీ ర్యామ్ (స‌గం త‌క్కువ‌గా) ఉన్నా ఒక‌టే. ఎలాగంటే, ఆండ్రాయిడ్ ఫోన్‌లో మ‌నం ఏదైనా యాప్‌ను ఓపెన్ చేస్తే దాన్ని మ‌ళ్లీ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఐఫోన్‌లో అలా కాదు. మ‌నం యాప్‌ను ఓపెన్ చేసి మ‌రో యాప్‌కు షిఫ్ట్ అయితే మునుప‌టి యాప్ వెంట‌నే క్లోజ్ అయిపోతుంది. దీని వ‌ల్ల ర్యామ్ వృథా కాదు. డివైస్ స్పీడ్‌గా ఉంటుంది.

ios-android

ఐఫోన్‌లో కెమెరా కూడా చాలా ప‌వ‌ర్‌ఫులే. ప్ర‌తి సారీ విడుద‌ల‌య్యే కొత్త మోడ‌ల్ ఐఫోన్ల‌లో కెమెరాల‌ను మ‌రింత నాణ్యంగా అందించ‌డం కోసం యాపిల్‌లో నిరంత‌రం 800 మంది ఉద్యోగులు ప‌నిచేస్తుంటారు. వీరు కేవ‌లం ఐఫోన్ కెమెరాపైనే ప‌నిచేస్తారు. దాని వ‌ల్ల ఫొటోలు, వీడియోలు అత్యంత క్వాలిటీగా ఐఫోన్‌లో అందించ‌గ‌లుగుతున్నారు. అందుకే యాపిల్ ఐఫోన్‌లో కెమెరా సామ‌ర్థ్యం త‌క్కువ మెగాపిక్స‌ల్ అయినా ఫొటోలు, వీడియోలు ప‌వ‌ర్‌ఫుల్‌గా వ‌స్తాయి. చివ‌రిగా ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌. సాధార‌ణంగా ఆండ్రాయిడ్ అంటే ఏ కంపెనీకి చెందిన ఫోన్‌లో అయినా ఉంటుంది. కాక‌పోతే ఆయా త‌యారీదార్లు త‌మ డివైస్‌ల‌కు అనుగుణంగా ఆండ్రాయిడ్‌ను కొద్దిగా మార్చుకుని వినియోగ‌దారులకు అందిస్తారు. కానీ ఐఫోన్‌లో అలా కాదు. ఐఫోన్‌లో ఉన్న ఐఓఎస్ (iOS) కేవ‌లం ఐఫోన్ల‌లో మాత్ర‌మే ఉంటుంది. ఇత‌ర ఫోన్ల‌లో ఉండ‌దు. ఆండ్రాయిడ్ ఫోన్ల‌యితే ఆయా ఫోన్ల త‌యారీదారులు ఎప్పుడు ఓఎస్ అప్‌డేట్ విడుద‌ల చేస్తే అప్పుడే వినియోగ‌దారులు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. కానీ యాపిల్ ఐఓఎస్ అలా కాదు. అందుకోసం యాపిల్‌లో ప్ర‌త్యేక సిబ్బంది ఉంటారు. వారు నిరంత‌రం సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తూనే ఉంటారు. కాబ‌ట్టి ఐఫోన్ల‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు త్వ‌ర‌గా వ‌స్తాయి. ఐఫోన్లు యూసేజ్‌లోనూ బాగుంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు మాటి మాటికీ హ్యాంగ్ అయి ఆగిపోయిన‌ట్టుగా ఐఫోన్లు అవ‌వు. స్మూత్‌గా ర‌న్ అవుతాయి. స్పీడ్ బాగుంటుంది.

దీనికి తోడు ఆండ్రాయిడ్ ఫోన్ల క‌న్నా యాపిల్ ఫోన్ల‌లోనే సెక్యూరిటీ బాగుంటుంది. ఐఫోన్‌లో ఒక యూజ‌ర్ పెట్టుకున్న పాస్‌వ‌ర్డ్‌ను హ్యాక్ చేయ‌డం అంత ఈజీ కాదు. కానీ ఆండ్రాయిడ్‌లోనైతే డివైస్‌ను సుల‌భంగా రీసెట్ చేయ‌వ‌చ్చు. అదేవిధంగా యాప్స్‌. యాపిల్ ఐఫోన్ల‌కు యాప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ కంపెనీ అయినా యాప్‌ను రిలీజ్ చేసిందంటే ఐఫోన్ల‌కే ముందుగా వ‌స్తాయి. ఆండ్రాయిడ్‌కు లేటుగా వ‌స్తాయి. ఇవే కాదు, ఇంకా ఇలాంటివే అనేక ఫీచ‌ర్లు ఐఫోన్ల‌లో ఉన్నాయి. వాటిలో మొబైల్ పేమెంట్ సిస్ట‌మ్ యాపిల్ పే, 3డీ ట‌చ్ వంటివి కూడా ఉన్నాయి. అందుకే ఐఫోన్ హార్డ్‌వేర్ త‌క్కువ ఖ‌రీదే అయినా, వాటితో రూపొందించిన ఐఫోన్ మాత్రం ఎక్కువ ధ‌ర‌కు ల‌భిస్తుంది. అందుకే ఐఫోన్లు అంత‌టి విలాస‌వంత‌మైన‌, ప‌వ‌ర్‌ఫుల్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లుగా అవ‌త‌రించాయి.

Comments

comments

Share this post

scroll to top