ఇండోనేషియా క‌రెన్సీ నోట్ల‌పై వినాయ‌కుడి బొమ్మ ఉంటుంది.ఎందుకో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో హిందువులు ఉన్నా భార‌త్‌లోనే వారి శాతం ఎక్కువ. ఎందుకంటే ఆ మ‌తం ఇక్క‌డే పుట్టింది కాబ‌ట్టి. మ‌న దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఎన్నో ఆల‌యాలు, హిందూ మ‌తం ఆవిర్భావం వెనుక ఉన్న చారిత్ర‌క సాక్ష్యాలు మ‌న‌కు క‌నిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి సాక్ష్యాలు కేవ‌లం మ‌న దేశంలోనే ఉంటాయి. ఇత‌ర దేశాల్లో ఉండ‌వు. మ‌న దేశానికి చుట్టు ముట్టు ఉన్న శ్రీ‌లంక‌, పాక్ వంటి దేశాల్లో హిందువుల తాలూకు ఆల‌యాలు, అప్ప‌టి చిహ్నాలు త‌దిత‌రాలు ఉంటే కొన్ని ఉంటాయి, కానీ ఇక ఆ దేశాలు దాటితే మాత్రం ఎక్క‌డా మ‌న‌కు అలాంటి ఛాయ‌లు క‌నిపించ‌వు. కానీ ఇండోనేషియాలో మ‌న‌కు క‌నిపిస్తాయి. ముస్లిం దేశ‌మైన అక్క‌డ అంతా హిందువులమ‌య‌మే. అంతెందుకు వారి క‌రెన్సీ నోటుపై కూడా వినాయ‌కుడి బొమ్మ ఉంటుంది. దీని వెనుక ఉన్న ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

indonesian-currency

ఇండోనేషియాలో మొత్తం జ‌నాభాలో 87.5 శాతం మంది ముస్లింలే. మిగ‌తా వారిలో 3 శాతం మంది హిందువులు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ ఎక్క‌డ చూసినా హిందు సాంప్ర‌దాయానికి చెందిన ఆన‌వాళ్లే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. అనేక చోట్ల హిందూ ఆల‌యాలు కూడా ఉన్నాయి. అక్క‌డి జ‌కార్తా న‌గ‌రంలో శ్రీ‌కృష్ణుడు, అర్జునుల‌కు చెందిన విగ్ర‌హం కూడా ఒక‌టి ఉంటుంది. అంతే కాకుండా వారి క‌రెన్సీ నోట్ల‌లో 20వేల రూపాయి నోట్ల‌పై వినాయ‌కుడి బొమ్మ ఉంటుంది. అది దాని మీద‌కు ఎలా వ‌చ్చిందంటే… అది ఇండోనేషియాను డ‌చ్ వారు పాలిస్తున్న స‌మ‌యం. కి హ‌జ‌ర్ దేవంత‌ర అనే ఓ గొప్ప స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు అప్ప‌టికే ఇండోనేషియా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో చ‌దువుకు, జ్ఞానానికి అధిప‌తి అయిన గ‌ణేషుడి గురించి ఆయ‌న‌కు తెలిసింది. దీంతో ఆయ‌న చిత్రాన్ని పెట్టుకుంటే అక్క‌డి విద్యార్థుల‌కు చ‌దువు ఎంత ముఖ్య‌మో తెలుస్తుంద‌ని, త‌ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంద‌ని ఆయ‌న భావించాడు. క్ర‌మంగా వినాయ‌కుడి బొమ్మ 20వేల రూపాయి నోట్ల‌పై ముద్రించ‌డం మొద‌లు పెట్టారు.

jakartha-statue

ఇండోనేషియా క‌రెన్సీ నోట్ల‌పై వినాయ‌కుడి బొమ్మ రావ‌డం వెనుక మ‌రో క‌థ ఉంద‌ని చెబుతారు. అదేమిటంటే… 1997లో ఆసియా దేశాల‌కు చెందిన క‌రెన్సీ విలువ అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బాగా ప‌డిపోయింద‌ట‌. ఈ క్రమంలో వినాయ‌కుడి బొమ్మ‌ను ఆ నోట్ల‌పై ముద్రిస్తే మంచి జ‌రుగుతుంద‌ని అప్ప‌టి మంత్రివ‌ర్గానికి తెలిసి వారు అలాగే చేశార‌ట‌. దీంతో ఆ దేశ క‌రెన్సీ విలువ పెరిగింద‌ట‌. అప్ప‌టి నుంచి ఆ దేశ క‌రెన్సీ నోట్ల‌పై వినాయ‌కుడి బొమ్మ‌ను ముద్రిస్తూ వ‌స్తున్నారు. అయితే ఇదే కాదు, అక్క‌డి బాండుంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ లోగోలో కూడా వినాయ‌కుడే ఉంటాడు. చ‌దువుకు ఆయ‌నేగా అధిప‌తి. అందుక‌నే వారు కూడా గ‌ణేషుడి బొమ్మ‌ను లోగోలో పెట్టుకున్నార‌ట‌. కాగా 2010లో బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ ఇండోనేషియాను సంద‌ర్శించిన‌ప్పుడు అక్క‌డ హిందువుల‌కు వారు ఇస్తున్న గౌర‌వాన్ని ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా చూసి ఎంతో హ‌ర్షం వ్య‌క్తం చేశార‌ట‌. అదీ… ఓ మ‌తానికి ఇంకో మ‌తం వారు ఇచ్చే విలువ‌..! ప్రపంచ‌మంతా ఇలాగే ఉంటే… అప్పుడు ఎలాంటి అసమాన‌త‌లు, తార‌త‌మ్యాలు… త‌ద్వారా యుద్ధాలు కూడా రావు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top