ఇత‌ర జీవుల‌కు తోక ఉంటుంది కానీ, మ‌నిషికే తోక ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

మ‌న శ‌రీరంలో ఉన్న అవ‌య‌వాలన్నీ ఏదో ఒక ప‌నికోసం నిర్దేశించ‌బ‌డి రూపుదిద్దుకోబ‌డ్డాయి. అవి వాటి ప‌నులను నిత్యం నిర్వ‌హిస్తూనే ఉంటాయి. అలాగే ప్ర‌పంచంలో ఉన్న ఇత‌ర జీవ‌రాశుల‌లో కూడా వాటి అవ‌య‌వాలు నిర్దిష్ట‌మైన ప‌నుల‌ను చేస్తూ ఉంటాయి. అయితే ఎన్ని జంతువులైనా, ప‌క్షులైనా, ఏ జీవి అయినా చాలా వ‌ర‌కు వాటిల్లో మ‌నం కామ‌న్‌గా గ‌మ‌నించే అవ‌య‌వం ఒక‌టుంటుంది. అదేనండీ, ఆయా జీవుల తోక‌లు. అవును, అవే. చాలా వ‌ర‌కు జీవుల‌కు తోక ఉంటుంది, కొన్నింటికి ఉండ‌దు. అయితే తోక ఉండ‌డ‌మనేది చాలా వాటికి కామ‌న్ అయినా ఒక్కో జీవికి ఉండే తోక ఒక్కో విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అదెలాగంటే…

tails
చేప‌ల‌కు ఉండే తోక‌ల‌తో అవి నీటిలో సుల‌భంగా ఈద‌గ‌లుగుతాయి. అదే గేదెలు, ఆవులు, ఎద్దులు వంటి నాలుగు కాళ్ల జంతువులు తమ తోక‌ల‌తో వాటి శ‌రీరాల‌పై వాలే ఈగ‌లు, పురుగుల‌, ప‌క్షులు, ఇత‌ర కీట‌కాల‌ను తోలుకుంటాయి. పిల్ల‌లు, కంగారూలు వంటి జంతువులు త‌మ తోక‌ల‌ను బ్యాలెన్స్ కోసం వాడుతాయి. అదే కోతులైతే చెట్ల‌పై సుల‌భంగా గెంత‌డానికి, వేలాడ‌డానికి వాడుతాయి. ఇక కుక్క‌, దుప్పి వంటి కొన్ని జంతువులు త‌మ తోక‌ల‌ను వాటిపై వాడే పురుగుల‌ను తోల‌డానికే కాదు, త‌మ త‌మ భావాల‌ను తోటి జంతువుల‌కు తెలియ‌జేయ‌డానికి కూడా తోక‌ల‌ను ఊపుతాయి. విభిన్న‌మైన కోణాల్లో వాటిని ప్ర‌దర్శిస్తాయి.

తేలు వంటి జీవుల‌తే ఇతర జీవులను చంపేందుకు తోక‌లో విషం క‌లిగి ఉంటాయి. పాముకు ఉండే తోక దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌క్షుల‌కైతే తోక‌లు చిన్న‌గా ఈక‌లతో ఉన్నా అవి వాటి స‌హాయంతో గాలిలో సుల‌భంగా ఎగ‌ర‌గ‌ల‌వు. అదే బ‌ల్లి అనుకోండి. ఇత‌ర జీవుల నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు త‌న తోక‌ను తానే తెంపుకుంటుంది. మ‌ళ్లీ అది పెరుగుతుంది. ఇలా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జీవాల‌న్నీ త‌మ తోక‌ల‌ను ఏదో ఒక విధంగా ఉపయోగించుకుంటాయి. కానీ మ‌నుషుల‌కు మాత్రం తోక ఉండ‌దు. ఎందుకంటే…

మ‌నిషి రెండు కాళ్ల‌పై నిల‌బ‌డ‌గ‌ల‌డు. సుల‌భంగా బ్యాలెన్స్ చేసుకోగ‌ల‌డు. ఈగ‌లు, దోమ‌లు వాలినా చేతులు ఉన్నాయి. ముందుకు సరిగ్గా వెళ్లేందుకు కాళ్లు ఉన్నాయి. అందుకే మ‌నిషికి తోక అవ‌స‌రం లేదు. ఒక వేళ ఉంటే ఏం జ‌రుగుతుందో మ‌న‌కు తెలుసు కదా..! ఎన్నో ఇబ్బందులు వ‌స్తాయి. అయితే మీకు తెలుసా..? మ‌నిషి పుట్టాక అత‌నికి తోక ఉండ‌దు, కానీ గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు కొద్ది వారాలు తోక ఉంటుంద‌ట‌. అనంతరం శ‌రీరం పెరుగుతున్న కొద్దీ తోక అందులో క‌లిసి పోతుంద‌ట‌. తోక గురించిన టాపిక్ నిజంగా భ‌లే ఆస‌క్తిగా ఉంది క‌దూ..!

Comments

comments

Share this post

scroll to top