హిందువులు శుభకార్యాల్లో, దేవుళ్ల పూజ‌ల‌కు ఈ పూల‌నే ఎందుకు వాడుతారో తెలుసా..?

హిందువులు దేవుళ్లు, దేవత‌ల‌ను పూజించేట‌ప్పుడే కాదు, ఇంకా వారు నిర్వ‌హించే శుభ కార్యాలన్నింటిలోనూ పూలు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాయి. అవి లేకుండా ఏ శుభ‌కార్యం కూడా జ‌ర‌గ‌దు. అంతేకాకుండా చాలా మంది పూల‌తో త‌మ ఇండ్ల‌ను అలంక‌రించుకుంటారు కూడా. అయితే ఈ భూమిపై ఎన్నో ర‌కాల పూలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో కేవ‌లం కొన్నింటిని మాత్ర‌మే హిందువులు పూజ‌కు ఉప‌యోగిస్తారు. అన్నింటినీ ఉప‌యోగించ‌రు. అలా ఎందుకు చేస్తారో, దాని వెనుక ఉన్న కార‌ణాలేంటో, అస‌లు పూజ‌కు ఏయే పూవుల‌ను ఉప‌యోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ల్లె పూలు…
శ్రీ‌మ‌హావిష్ణువుకు మ‌ల్లె పూవంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అందుకే ఆయ‌న్ను పూజించేందుకు ఎక్కువ‌గా మ‌ల్లె పూల‌ను వాడుతారు. అలా చేస్తే ఆయ‌న అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. వివాహ శుభాకార్యాల్లో సాధార‌ణంగా మ‌ల్లె పూల‌తో చేసిన దండ‌ల‌ను వ‌ధూ వ‌రులు ధ‌రిస్తారు. దాంతో వారి సంసార జీవితం సుఖంగా సాగుతుందని విశ్వసిస్తారు.

మందార పూలు…
మందార పూల‌ను కాళికా దేవికి ప్ర‌తిరూపంగా భావిస్తారు. ఆ పూల‌తో చేసిన దండ‌ను కాళిక‌కు వేస్తారు. ఎరుపు రంగులో ఉండే ఆ పూలంటే ఆ దేవ‌త‌కు ఎంత‌గానో ఇష్ట‌మ‌ట‌. అలా ఆ పూల‌కు చెందిన దండ‌ల‌ను వేసి పూజిస్తే ఆ దేవి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించి వారికి ధ‌నం, ఆరోగ్యం ఇస్తుంద‌ట‌.

తామ‌ర పూలు…
తామర పూలంటే సాక్షాత్తూ లక్ష్మీ దేవికి ప్ర‌తిరూప‌మ‌ట‌. అంతేకాదు సృష్టిక‌ర్త బ్ర‌హ్మ‌కు, ఆయ‌న భార్య స‌ర‌స్వ‌తి దేవికి కూడా ఈ పూలంటే ఇష్ట‌మ‌ట‌. అందుకే వారు ఎప్పుడూ తామ‌ర పూల‌పై కూర్చుంటారు. ఈ క్ర‌మంలో ఆయా దైవాల‌ను తామ‌ర పూల‌తో పూజిస్తే ఆయురారోగ్యాలు, ధ‌నం, చ‌దువు అన్నీ సిద్దిస్తాయ‌ట‌.

చామంతి, బంతి పూలు…
చామంతి, బంతి పూలు స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌కు ప్ర‌తీక‌ల‌ట‌. అందుకే వాటిని వివాహ స‌మ‌యంలో వ‌ధూవ‌రుల చేత ధ‌రింపజేస్తారు. అంతేకాదు ఆ శుభ కార్యంలోనూ మండ‌పాన్ని ఎక్కువ‌గా ఈ పూల‌తోనే అలంక‌రిస్తారు. ఈ పూల‌ను ఇండ్ల‌లో అలంక‌ర‌ణ‌గా వాడితే దాంతో దోమలు, ఇత‌ర కీట‌కాలు పారిపోతాయ‌ట‌.

గులాబీలు…
ప్రేమ‌కు, ఆప్యాయ‌త‌కు, అనురాగానికి గులాబీ పూలు నిద‌ర్శ‌నాలుగా నిలుస్తాయి. ఇవి దంప‌తుల మ‌ధ్య అన్యోన్యాన్ని పెంచుతాయి. అందుకే వీటితో దేవుళ్ల‌ను పూజిస్తే దంప‌తుల‌కు శుభం క‌లుగుతుంది. వారి జీవితంలో ఉండే స‌మ‌స్య‌లు పోతాయి. క‌ల‌హాలు లేని కాపురంగా మారుతుంది.

Comments

comments

Share this post

scroll to top