గాఢంగా ప్రేమించుకునే క‌పుల్స్ కూడా ఒక్కోసారి త‌మ పార్ట్‌న‌ర్‌ను చీట్ చేస్తారు. అందుకు కార‌ణం ఏమిటో తెలుసా..?

నేటి త‌రుణంలో మ‌నం దంప‌తులు, ల‌వ‌ర్స్‌కు చెందిన చీటింగ్ వార్త‌ల‌ను ఎక్కువ‌గా వింటున్నాం. భార్య‌ను మోసం చేసిన భ‌ర్త‌.. భ‌ర్త‌ను మోసం చేసిన భార్య‌.. ల‌వ‌ర్ మోసం చేశాడ‌ని నిర‌స‌న తెలిపే ప్రియురాలు.. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య బాగా చోటు చేసుకుంటున్నాయి. అయితే పెళ్లి చేసుకున్న దంప‌తులు అయినా.. లేదంటే ల‌వ‌ర్స్ అయినా స‌రే.. అంత‌లా గాఢంగా ప్రేమించుకున్న వారు అస‌లు ఒక‌రిని ఒక‌రు ఎందుకు మోసం చేస్తారు ? చీటింగ్‌కు ఎందుకు పాల్ప‌డుతారు ? వేరే వారితో అక్ర‌మ సంబంధం ఎందుకు పెట్టుకుంటారు ? అందుకు అస‌లు కార‌ణం ఏమిటి ? అంటే.. ఇదే విష‌యాన్ని ఓ లేడీ సైంటిస్టు ప్ర‌యోగం చేసి మ‌రీ మ‌న‌కు దీని వెనుక ఉన్న కార‌ణాలను చెప్పారు. అవేమిటంటే…

సాధార‌ణంగా ఎవ‌రైనా త‌మ‌కు ఇష్ట‌మైన వారి ఫొటోను చూస్తే అప్పుడు, శృంగారంలో భావ‌ప్రాప్తి చెందిన‌ప్పుడు, కొకెయిన్ వంటి మ‌త్తు ప‌దార్థాలు తీసుకున్న‌ప్పుడు… ఈ మూడు స‌మ‌యాల్లోనూ మ‌న మెద‌డు ఒకే విధంగా స్పందిస్తుంద‌ట‌. అంటే.. మ‌న‌కు ఇష్ట‌మైన వారిని చూస్తే.. మ‌న మెద‌డు రిలాక్స్ అవుతుంది. ఇక ఇది మెద‌డులో ఉండే మూడు ప్ర‌ధాన వ్య‌వ‌స్థ‌ల‌ను కంట్రోల్ చేస్తుంది. వాటిల్లో ఒక‌టి క‌పుల్స్ మ‌ధ్య ఉండే రొమాంటిక్ ల‌వ్‌ను, రెండోది వారి మ‌ధ్య ఉండే శృంగార సంబంధాన్ని, మూడోది వారిలో ఒక‌రిపై ఒక‌రికి ఉండే సెక్యూరిటీ ఫీలింగ్‌ను సూచిస్తాయి.

పైన చెప్పిన ఆ మూడు వ్య‌వ‌స్థ‌లు బ‌లంగా ఉన్న‌ప్పుడు క‌పుల్స్‌కు ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి అమిత‌మైన ప్రేమ ఉంటుంది. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేరు అన్నంత‌గా క‌ల‌సిపోయి ఉంటారు. ఎప్పుడైతే ఈ వ్య‌వ‌స్థ‌లు బ‌ల‌హీనంగా అవుతాయో అప్పుడు స‌హ‌జంగానే క‌పుల్స్‌లో ఎవ‌రికైనా ఇత‌రుల ప‌ట్ల ఆక‌ర్ష‌ణ పెరుగుతుంది. దీంతో వారు అప్ప‌టి వ‌ర‌కు గాఢంగా ప్రేమించుకున్న‌ప్ప‌టికీ త‌మ పార్ట్‌న‌ర్స్‌ను చీట్ చేసేందుకే య‌త్నిస్తారు. అవే మూడు వ్య‌వ‌స్థ‌లు మ‌రీ బ‌ల‌హీనంగా మారితే అవి ఇత‌రుల ప‌ట్ల ఆక‌ర్ష‌ణ‌ను మ‌రింత ప్రేరేపిస్తాయి. దీంతో ఇత‌రుల ప‌ట్ల ఇవే వ్య‌వ‌స్థ‌లు బ‌లంగా తయార‌వుతాయి. అవే ఇత‌రుల‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకునేందుకు కార‌ణ‌మ‌వుతాయి. దీంతో అస‌లు పార్ట్‌న‌ర్‌ను మ‌రిచిపోతారు. ఈ క్ర‌మంలో క‌పుల్స్ త‌మ పార్ట్‌న‌ర్‌ను చీట్ చేయ‌డ‌మే కాదు, అవ‌స‌రం అయితే వారిని చంపేందుకు కూడా వెనుకాడరు. ప్ర‌స్తుతం స‌మాజంలో కొన్ని జంటల మ‌ధ్య జ‌రుగుతుందిదే. క‌నుక తెలిసింది క‌దా.. క‌పుల్స్ గాఢంగా ప్రేమించుకున్న‌ప్ప‌టికీ ఒక‌ర్నొక‌రు ఎందుకు మోసం చేసుకుంటారో. ఇదే అస‌లు కార‌ణం..!

https://www.scoopwhoop.com/science-why-people-cheat-on-partners/?ref=latest&utm_source=home_latest&utm_medium=desktop#.ny99sycqo

Comments

comments

Share this post

scroll to top