ఈ లక్షణాలు ఉన్నవాడే అస‌లైన అదృష్ట‌వంతుడు: విదురుడు

ఈ భూ ప్ర‌పంచంలో అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తులు ఎవ‌రు? అంటే మీరు ఏం స‌మాధానం చెబుతారు..? ఏముందీ… ఎవ‌రికి ఎక్కువ డ‌బ్బు ఉండి ధ‌న‌వంతులుగా ఉంటారో వారే అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తులు… అని అన‌బోతున్నారా..? అయితే మీరు పప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే ధ‌న‌మే కాదు, ఇంకా కొన్ని విష‌యాలు కూడా అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తులు అవునా, కాదా అనే విష‌యాన్ని నిర్దారిస్తాయ‌ట‌. అవును, మేం చెబుతోంది నిజ‌మే. విదురుడు తెలుసుగా..? ధృత‌రాష్ట్రుడు, పాండురాజుల త‌మ్ముడు. కౌర‌వ సామ్రాజ్యానికి స‌ల‌హాదారుడిగా ఉండి, ఆ రాజ్య క్షేమం కోసం ఎంత‌గానో కృషి చేశాడు. అంతేకాదు విదురుడు ధ‌ర్మ‌నిర్మాణ కోవిదుడు కూడా. ఏది ధ‌ర్మం, ఏది అధ‌ర్మం, ఏది నీతి, అవినీతి అన్ని చెప్పడంలో విదురుడికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అయితే పైన చెప్పినట్టుగా ఎవ‌ర్న‌యినా అదృష్ట‌వంత‌మైన వ్య‌క్తి అని అనాలంటే వారికి విదురుడు చెప్పిన విధంగా కొన్ని ల‌క్ష‌ణాలు ఉండాల‌ట‌. విదురుడు చెప్పిన అలాంటి ల‌క్ష‌ణాలు ఏమిటంటే…

vidura

  • త‌ర‌చూ అనారోగ్యాల బారిన పడేవారు మిక్కిలి దుర‌దృష్ట‌వంతుల‌ట‌. ఎందుకంటే అనారోగ్యాల కార‌ణంగా ఎంతో విలువైన ఆయువు త‌గ్గిపోతుంద‌ట‌. అంతేకాదు, ధ‌నం కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది. క‌నుక, ఎలాంటి అనారోగ్యాలు లేని వారే బాగా అదృష్ట‌వంతమైన వ్య‌క్తుల‌ని విదురుడు చెప్పాడు.
  • సున్నిత‌మైన మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉండి, ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉండేవారు, త‌క్కువ గొంతుక‌తో మృదువుగా మాట్లాడేవారు మిక్కిలి అదృష్ట‌వంతుల‌ట‌.
  • ఎల్ల‌ప్పుడూ వినయ విధేయ‌త‌ల‌ను క‌లిగి ఉంటూ, పెద్ద‌ల‌ని గౌర‌విస్తూ ఉండే పిల్ల‌లు క‌లిగిన వారు అదృష్ట‌వంతుల‌ట‌. వీరి ఇంట్లో అలాంటి పిల్ల‌ల కార‌ణంగా అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. వారు ఆ కుటుంబానికి మంచి పేరు ప్ర‌ఖ్యాతులు తెస్తార‌ట‌.
  • ఎలాంటి అడ్డంకి లేకుండా నిరంత‌రాయంగా ధ‌నం సంపాదిస్తూ జీవితంలో ముందుకు వెళ్లేవారు, ధ‌న‌వంతులు అదృష్ట‌వంతుల‌ట‌. ఎల్ల‌ప్ప‌టికీ ధ‌నం చేతిలో ఉంటే దాంతో జీవితంలో ఎంతో ముందుకు వెళ్ల‌వ‌చ్చ‌ట‌.
  • బాగా ఉన్న‌త చ‌దువులు చ‌దివిన వారు, ఎంతో జ్ఞానం సంపాదించిన వారు కూడా అదృష్ట‌వంతులేన‌ట‌. ఆ జ్ఞానంతో ఎలాంటి స‌మ‌స్య‌లనైనా ప‌రిష్క‌రించుకునే శ‌క్తి ఆ వ్య‌క్తుల‌కు ల‌భిస్తుంద‌ట‌.
  • దంప‌తుల్లో జీవిత భాగ‌స్వామిని స‌రిగ్గా అర్థం చేసుకుని, అందుకు తగిన విధంగా ఇంటిని తీర్చిదిద్దుకుంటూ, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునే వారు అస‌లైన అదృష్ట‌వంతుల‌ట‌. దంప‌తులు స‌రైన స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగితే వారిని మించిన అదృష్ట‌వంతులు ఇంకొక‌రు ఉండ‌ర‌ట‌.

Comments

comments

Share this post

scroll to top