కాలుష్యంతో ఉన్న చెరువును బాగు చేసేందుకు ఈ బాలిక ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

మ‌న దేశంలో ఉన్న చెరువులు ఒక‌ప్పుడు ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేవి. సాగునీటిని అందించేవి. కానీ రాను రాను అవి కాలుష్య కాసారాలుగా మారాయి. ఆధునీక‌ర‌ణ‌, ప‌ట్ట‌ణీక‌ర‌ణ ముసుగులో అనేక చెరువులు క‌బ్జాల‌కు గురి అయి నామ రూపాల్లేకుండా పోయాయి. ఉన్న ఆ కొద్ది చెరువులు కూడా కాలుష్యం కోర‌ల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. బెంగుళూరులో ఉన్న ఆ చెరువు కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. అయితే ఎన్ని విజ్ఞ‌ప్తులు చేసినా అక్క‌డి ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. దీంతో ఆ చెరువు చుట్టూ ఉండే స్థానికులే దాన్ని బాగు చేసే ప‌నిలో ప‌డ్డారు. ఇది స‌హ‌జ‌మే కదా, ఇందులో విశేష‌మేముందీ అంటారా..? అవును, నిజంగానే విశేషం ఉంది మ‌రి. ఎందుకంటే ఆ చెరువు శుభ్ర‌త‌, సుంద‌రీక‌ర‌ణ ప‌నిలో 12 ఏళ్ల ఓ బాలిక కూడా పాలు పంచుకుంది. త‌న వంతు బాధ్య‌త‌గా ఆ పనులు చేయ‌డ‌మే కాదు, స్వ‌యంగా ప్ర‌తి ఇంటికీ తిరిగి ఏకంగా కొంత సొమ్మును చెరువు బాగు కోసం క‌లెక్ట్ చేసింది. ఇంత‌కీ ఆ చిన్నారి ఎవ‌రంటే..?

ఆ బాలిక పేరు రిధి జ‌య‌ప్ర‌కాష్‌. వ‌య‌స్సు 12 సంవత్స‌రాలు. బెంగుళూరులో త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటోంది. ఈమె ఉంటున్న ప్రాంతం పేరు కొన‌న‌కుంటె. మున్సిపాలిటీలో వీరిది 12 వార్డు కింద‌కు వ‌స్తుంది. అయితే రిధి ఉంటున్న ఏరియా ప‌క్క‌నే చుంచ‌ఘ‌ట్ట అనే పేరున్న చెరువుంది. కానీ అది అత్యంత ద‌యనీయ స్థితిలో ఉంది. అందులో గుర్ర‌పు డెక్క, నాచు పేరుకుపోవ‌డ‌మే కాదు, చుట్టు ఉన్న నివాసాల నుంచి పెద్ద ఎత్తున మురుగు నీరు ఆ చెరువులో క‌లుస్తుండేది. దీనికి తోడు ఆ చెరువు ప‌రిస‌రాలు కూడా అత్యంత అప‌రిశుభ్రంగా త‌యార‌య్యాయి. దీంతో ఆ చెరువు స్థితి చూసిన స్థానికులు ఎన్నోసార్లు ప్ర‌భుత్వాలు మారుతున్న కొద్దీ విన‌తులు స‌మ‌ర్పించారు. అయిన‌ప్ప‌టికీ నాయ‌కులు ప‌ట్టించుకోలేదు. దీంతో ఎట్ట‌కేల‌కు వారే ఆ చెరువు బాగుకు పూనుకున్నారు.

అందులో భాగంగానే వారు త‌మంత‌ట తామే చుంచ‌ఘ‌ట్ట చెరువును బాగు చేయ‌డం మొద‌లు పెట్టారు. ముందుగా చెరువు చుట్టూ పెరిగిన పిచ్చి మొక్క‌లు, దాని ప‌రిస‌రాల్లో ఉండే చెత్త‌ను తొల‌గించ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌రువాత చెరువు క్లీనింగ్ కోసం నిధులు సేక‌రించ‌డం ప్రారంభించారు. దీంతో వారికి రూ.30వేల వ‌ర‌కు విరాళాల రూపంలో డ‌బ్బు వ‌చ్చింది. అయితే అందులో రూ.7వేల వ‌ర‌కు బాలిక రిధి జ‌య‌ప్ర‌కాష్ ఒక్క‌తే క‌లెక్ట్ చేసింది. ఇంటింటికీ తిరుగుతూ స్వయంగా విరాళాల‌ను సేక‌రించింది. దీనికి గాను ఆమెకు త‌న త‌ల్లిదండ్రుల నుంచి స‌పోర్ట్ కూడా ల‌భించింది. ఈ క్రమంలో ఇప్పుడు చుంచ‌ఘ‌ట్ట చెరువు క్లీనింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అయితే బాలిక రిధి కూడా ఆ చెరువు శుభ్ర‌త కార్యక్ర‌మంలో పాల్గొనేది. త‌న‌కు ఖాళీ దొరికిన‌ప్పుడల్లా చెరువు ప‌రిస‌రాల్లోని చెత్త‌ను ఏరివేసిది. వీలుంటే చందాల‌ను కూడా సేక‌రించేది. ఈ క్ర‌మంలో ఇప్పుడా చెరువు రూపురేఖ‌లు కొద్ది కొద్దిగా మారుతున్నాయి. అవును మ‌రి, స‌మాజంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రూ క‌లిస్తే ఏదైనా సాధింవ‌చ్చు..! ఏది ఏమైనా ఇంత చిన్న వ‌య‌స్సులోనే సామాజిక బాధ్య‌త‌ను నెత్తిన వేసుకున్న బాలిక రిధి ప్ర‌య‌త్నాన్ని మ‌నం అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top