కాయిన్స్ కిందున్న ఈ సింబ‌ల్స్ ను గ‌మ‌నించారా? ఆ గుర్తుల్లో ఓ విష‌యం దాగుంది, అదేంటో తెలుసా??

ఏ దేశ క‌రెన్సీలో అయిన‌….నోట్లు మ‌రియు కాయిన్స్ ( నాణాలు) ఉంటాయ‌నేది అంద‌రికీ తెల్సిన విష‌య‌మే.! అయితే ఇండియాలో నాణాలను ముద్రించే ప‌నిని SPMCIL( సెక్యురిటి ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అనే ప్ర‌భుత్వ సంస్థ చూసుకుంటుంది. దేశంలో 4 ప్రాంతాలలోని త‌మ ముద్ర‌ణా సంస్థ‌ల‌నుండి SPMCIL కాయిన్స్ ను అచ్చువేయిస్తుంది. అవి:

1) ముంబాయ్. 2) హైద్రాబాద్ 3) కల‌క‌త్తా 4) నోయిడా….

అయితే కాయిన్స్ కిందున్న గుర్తుల‌ను బ‌ట్టి…ఆ కాయిన్ ఎక్క‌డ ముద్రించారో తెలుసుకోవొచ్చు, అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ముంబాయ్ లో ముద్రించిన కాయిన్.

  • కాయిన్ ముద్రించ‌బ‌డిన సంవ‌త్స‌రం కింద డైమండ్ గుర్తు ఉంటే ..స‌ద‌రు నాణెం ముంబాయ్ లో అచ్చువేయ‌బ‌డ్డ‌ట్టు.!
  • 1829 నుండి ముంబాయి లో నాణాలు అచ్చువేయ‌బ‌డుతున్నాయి.

హైద్రాబాద్ లో ముద్రించిన కాయిన్….

  • కాయిన్ ముద్రించ‌బ‌డిన సంవ‌త్స‌రం కింద స్టార్ మార్క్ లేదా…డైమండ్ ఆకారం మ‌ద్య‌లో చుక్క గుర్తు ఉంటే…స‌ద‌రు నాణెం హైద్రాబాద్ లో అచ్చువేయ‌బ‌డ్డ‌ట్టు.!
  • 1903 నుండి హైద్రాబాద్లో నాణాలు అచ్చువేయ‌బ‌డుతున్నాయి.

 

నోయిడా లో ముద్రించిన కాయిన్.

  • కాయిన్ ముద్రించ‌బ‌డిన సంవ‌త్స‌రం కింద డాట్ మార్క్( చుక్క గుర్తు) ఉంటే…స‌ద‌రు నాణెం నోయిడా లో అచ్చువేయ‌బ‌డ్డ‌ట్టు.!
  • 1984 నుండి నోయిడా లో నాణాలు అచ్చువేయ‌బ‌డుతున్నాయి.

క‌ల‌క‌త్తా లో ముద్రించిన కాయిన్…..

  • కాయిన్ ముద్రించ‌బ‌డిన సంవ‌త్స‌రం కింద ఎటువంటి గుర్తు లేక‌పోతే ..స‌ద‌రు నాణెం క‌ల‌క‌త్తాలో అచ్చువేయ‌బ‌డ్డ‌ట్టు.!
  • 1757 నుండి క‌ల‌క‌త్తా లో నాణాలు అచ్చువేయ‌బ‌డుతున్నాయి.

Comments

comments

Share this post

scroll to top