కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తిలో కోట్లు గెలుచుకున్న విన్న‌ర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. భార‌త‌దేశ టెలివిజ‌న్ చ‌రిత్ర‌లోనే అతి పెద్ద షోగా కేబీసీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కేబీసీలో చాలా సీజ‌న్ల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. 2000వ సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైన ఈ షోకు ఈ ఏడాదితో 17 ఏళ్లు పూర్తి అయ్యాయి. అయితే ఈ షోకు చెందిన మొద‌టి 7 సీజ‌న్ల‌లో ప‌లువురు పెద్ద మొత్తంలో డబ్బును గెలుచుకున్నారు. ఈ క్ర‌మంలో వారు ఆ న‌గ‌దును గెలుచుకుని చాలా రోజులే అయింది. అయితే అంత పెద్ద మొత్తంలో డ‌బ్బు గెలుచుకున్న వారు ఇప్పుడేం చేస్తున్నారు..? ఆ డ‌బ్బును వారు ఎలా ఖ‌ర్చు పెట్టారు..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1. కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి మొద‌టి సీజ‌న్‌లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అనే వ్య‌క్తి రూ.1 కోటి గెలుచుకున్నాడు. ఇత‌ను యూపీఎస్‌సీ ప‌రీక్ష‌లు రాశాడు. కానీ వాటిలో విజ‌యం సాధించ‌లేదు. ఈ క్ర‌మంలో అత‌ను ఎంబీఏ చేసి ప్రస్తుతం మ‌హీంద్రా కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. 2000వ సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైన మొద‌టి సీజ‌న్‌లో హర్ష‌వ‌ర్ధ‌న్ రూ.1 కోటి గెలుచుకోవ‌డం ఏమో గానీ ఇత‌ను ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు.

2. కేబీసీ 2వ సీజ‌న్‌లో ర‌విశైని అనే అత‌ను రూ.1 కోటి గెలుచుకున్నాడు. అయితే అప్ప‌టికి ర‌వికిష‌న్‌కు 14 ఏళ్లే. అప్పుడ‌త‌ను టెన్త్ చ‌దువుతున్నాడు. కానీ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యాడు. తన‌కు ల‌భించిన మొత్తంతో ఐపీఎస్ కోచింగ్ తీసుకుని అందులో సెలెక్ట్ అయి ఆఫీస‌ర్ అయ్యాడు.

3. కేబీసీ 3వ సీజ‌న్‌లో రాహ‌త్ అనే యువ‌తి రూ.1 కోటి గెలుచుకుంది. ఈమె ప్ర‌స్తుతం త‌ల్లి దండ్రుల నుంచి విడిపోయి సొంతంగా ఉంటోంది.

4. కేబీసీ 4వ సీజ‌న్‌లో బీహార్‌కు చెందిన సుశీల్ అనే వ్య‌క్తి రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. ఇత‌నిది అప్పుడు చాలా పేద కుటుంబం. కానీ కేబీసీ షో ఇత‌ని లైఫ్‌ను పూర్తిగా మార్చేసింది. దీంతో ఇప్పుడు సుశీల్ బాగానే సెటిల్ అయ్యాడు. బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

5. కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి 5వ సీజ‌న్‌లో సున్మిత్ కౌర్ అనే మ‌హిళ రూ.5 కోట్ల‌ను గెలుచుకుంది. అయితే అలా డ‌బ్బును గెల‌వ‌డానికి ముందు ఆమె చాలా క‌ష్టాలు ప‌డింది. బంధువులు ఎవ‌రూ ఆదుకోలేదు. కానీ న‌గ‌దు గెలిచాక ఆమె లైఫ్ మారిపోయింది. సొంతంగా ఫ్యాష‌న్ డిజైనింగ్ బిజినెస్ పెట్టుకుని రాణిస్తోంది.

6. తాజ్ మ‌హ‌మ్మ‌ద్ అనే వ్య‌క్తి కేబీసీ 6వ సీజ‌న్‌లో రూ.1 కోటి గెలుచుకున్నాడు. అయితే తాజ్ అప్ప‌టికే టీచ‌ర్‌. అయిన‌ప్ప‌టికీ ఆ వృత్తిలోనే ఇంకా కొన‌సాగుతున్నాడు. షోలో గెలిచిన డ‌బ్బుతో చ‌క్క‌గా ఇల్లు క‌ట్టుకున్నాడు. కూతురికి కంటి ఆప‌రేష‌న్ చేయించాడు.

7. ఇక కేబీసీ 7వ సీజ‌న్‌లో ఢిల్లీకి చెందిన అచిన్‌ నెరూలా, సార్థ‌క్ నెరూలా అనే ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు రూ.7 కోట్లు గెలుచుకున్నారు. షోలో వ‌చ్చిన డ‌బ్బుతో వీరు త‌మ త‌ల్లికి క్యాన్స‌ర్ చికిత్స చేయించారు. షోలో గెల‌వ‌డం ఏమో గానీ అప్ప‌టి వ‌ర‌కు పెళ్లి కాకుండా ఉన్న వీరిద్ద‌రికీ ఒకేసారి అమ్మాయిల నుంచి బోలెడ‌న్ని ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయి. అవును మ‌రి, డ‌బ్బు మ‌హ‌త్యం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top