పెళ్లి తర్వాత అమ్మాయికి అలా ఎందుకు చేస్తారు… ఆ గదిలోకి వెళ్లే ముందు ఆ విషయాలు ఎందుకు చెబుతారు??

పెళ్లంటే ఇద్దరు కలిసి తమ నూతన జీవితాన్ని ప్రారంభించడం. పెద్దలు నిశ్చయించిన పెళ్లి అయినా, ప్రేమ వివాహాం అయినా సరే పెళ్లి అయిన ఫస్ట్ నైట్ అనే సాంప్రదయం ఉంటుంది. ఆడా, మగా తేడా లేకుండా తమ తొలి రాత్రి గురించి చాలా ఊహించుకుంటూ ఉంటారు. అమ్మాయిల్లో ఫస్ట్ నైట్ అనగానే తెలియని ఏదో భయం, బెరుకు కాస్త సిగ్గు కనిపిస్తాయి. అయితే కొందరు అబ్బాయిలు కూడా తమ మొదటి రాత్రి గురించి భయంతోనే ఉంటారట. దీనికి కారణం లైంగిక అవగాహన లేకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. అవగాహన లోపం వలన అమ్మాయి, అబ్బాయి ఇద్దరిలోనూ ఆందోళన, టెన్షన్ వంటివి ఏర్పడతాయట. అమ్మాయిలకు శోభనం గదిలోకి పంపించే ముందు కొన్ని విషయాలు చెప్పి పంపిస్తారు. అయితే అవి మరి ఎలాంటి విషయాలు, ఎందుకు అలా చెబుతారో తెలియదు. మొదటి రాత్రి కాబట్టి కేవలం లైంగిక విషయాలపై అవగాహాన కల్పిస్తారా..లేదా ఇంకేమైనా చెబుతారా అనేవి ఓ సారి తెలుసుకుందాం.

కొత్తగా పెళ్లయినా దంపతుల మధ్య ఫస్ట్ నైట్ అనేది అనివార్యంగా జరిగే విషయం. మొదటి రాత్రి విషయంలో అమ్మాయిలకు పెద్దలు చాలా విషయాలపై అవగాహన కల్పించి మరీ గదిలోకి పంపిస్తారట. కేవలం లైంగిక పరమైన విషయాలే కాకుండా సంసార జీవితంలో తప్పని సరి అయ్యే అంశాల గురించి వారికి పరిపరి విధాలా జ్ఞానం కలిగిస్తారట. తన భర్త ఏమి చెబితే అలా అనుకూలంగా నడుచుకోవాలని పెద్దలు చెప్తుంటారట. అయితే మొదటి రాత్రి రోజు అబ్బాయికి కూడా కొన్ని సూచనలు చేస్తారట పెద్దలు. భార్యని దగ్గర చేసుకొని మనసులోని భావాలను ఒకరికోకరు వ్యక్త పరచుకోడం సలహా ఇస్తారంట. దీని తరువాత శారీరకంగా కలవడం మంచిదని చెబుతున్నారు పెద్దలు. ఎందుకంటే అలా కాసేపు మాట్లాడుకోవడం వల్ల ఒకరి ఇష్టా ఇష్టాలను తెలుసుకోవడం భయం అనేది వీడిపోయి ఆ తర్వాత వారు దాంపత్య జీవితం ప్రారంభించడానికి ఎటువంటి ఆటంకాలు రావని పెద్దల నమ్మకం.

Comments

comments

Share this post

scroll to top