మితిమీరిన అభిమానం ప‌ట్ల స్పందిచిన Jr.NTR, ముందు దేశం తర్వాత కుటుంబం, ఆతర్వాతే ఎవరైనా…

న‌చ్చిన హీరో సినిమా వ‌చ్చిందంటే చాలు మొద‌టి రోజు మొద‌టి ఆట టిక్కెట్ కొనుక్కుని ఏ అభిమాని అయినా సినిమా చూస్తాడు. టిక్కెట్ కోసం ఎన్ని గంట‌లైనా లైన్‌లో నిలుచుంటాడు. అలా టిక్కెట్ దొర‌క్క‌పోతే బ్లాక్‌లో ఏ రేట్‌కైనా స‌రే టిక్కెట్ కొనుక్కుని మ‌రీ సినిమా చూస్తాడు. ఇక సినిమా మొద‌లై, చివ‌రికి క్లైమాక్స్ చేరుకునే వ‌ర‌కు ఆ అభిమాని ఉత్సాహం అంతా ఇంతా ఉండ‌దు. మొద‌టి రోజు మొద‌టి త‌న అభిమాన సినీ హీరో సినిమా చూస్తున్నాన‌నే ఆనందం ఓ వైపు, తెర‌పై ఆ హీరో చేసే ఫైట్లు, చెప్పే డైలాగులు, చేసే డైలాగ్‌లకు పెల్లుబికే ఉత్సాహం మ‌రో వైపు వెర‌సి… ఓ స‌గ‌టు సినీ హీరో అభిమానికి ఉండే కుతూహ‌లం మాట‌ల్లో వ‌ర్ణించ‌రానిది. అయితే ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంటుంది. కానీ అది శృతి మించితే..?

jr-ntr-fans

ఇటీవ‌ల ఇద్ద‌రు సినీ హీరోల‌ ఫ్యాన్స్‌కు మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లో ఓ ప‌వ‌న్ కల్యాణ్ అభిమాని హ‌త్య‌కు గురైన విష‌యం విదిత‌మే. అయితే అది పైన చెప్పిన‌టువంటి శృతి మించిన అభిమానం వ‌ల్లే జ‌రిగింద‌ని చెప్ప‌క‌నే చెప్ప‌వ‌చ్చు. కార‌ణాలు ఏమున్నా ఏ హీరోకు చెందిన అభిమాని అయినా, త‌మ అభిమాన హీరోను మ‌రో హీరో ఫ్యాన్స్ తిట్టినా, కామెంట్లు చేసినా వారు ఊరుకోరు. ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా వెర్రి అభిమానం ఒకింత ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌రీ సోష‌ల్ మీడియాలోనైతే ఒక సినీ హీరో ఫ్యాన్స్‌, మ‌రొక హీరో ఫ్యాన్స్ పోస్టుల సాక్షిగా తిట్టుకోవ‌డం, అసభ్య‌క‌ర కామెంట్లు పెట్టుకోవ‌డం ఎక్కువైంది. మీ హీరో సినిమా అట్ట‌ర్ ఫ్లాఫ్ అయిందంటే, మీ హీరో సినిమా మొద‌టి రోజే అన్ని షోలు మూసుకోవాల్సి వ‌చ్చిందనో, మ‌రే విధంగానో ఫ్యాన్స్ దూషించుకుంటున్నారు. అది ఇంకాస్త శృతి మించ‌డంతో గొడ‌వల‌కు త‌ద్వారా దాడుల‌కు దాన్నుంచి హ‌త్య‌ల‌కు దారి తీసింద‌ని చెప్ప‌క‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ అభిమానులెంత తిట్టుకున్నా, గుద్దుకున్నా, చంపుకున్నా, ఎప్ప‌టికీ హీరోలు చెప్పే మాట ఒక‌టే. అదే, తామంతా ఒక‌టేన‌ని. మితి మీరిన అభిమానం పనికి రాద‌ని. జ‌న‌తా గ్యారేజ్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా జూనియర్ ఎన్‌టీఆర్ ఓ మీడియా ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాల‌నే మ‌ళ్లీ పున‌రుద్ఘాటించారు. ఇంత‌కీ ఆయ‌నేం చెప్పారంటే…

‘మితి మీరిన అభిమానం ఎప్పుడూ మంచిదికాదు. ముందు మ‌నం పుట్టిన దేశాన్ని ప్రేమించాలి త‌రువాత క‌న్న త‌ల్లిదండ్రుల‌ను ప్రేమించాలి. అనంత‌రం నీ మీద న‌మ్మ‌కం పెట్టుకున్న నీ భార్య‌ను ప్రేమించాలి, నిన్నే న‌మ్ముకుని పుట్టిన నీ పిల్ల‌ల్ని ప్రేమించాలి. ఆ త‌రువాతే నీ అభిమాన న‌టీన‌టుల‌ను ప్రేమించాలి. ఓ క్రాస్ రోడ్ వైపు వ‌చ్చి ఎవ‌రి వైపు వెళ్లాలి అని మీరు అనుకుంటే అప్పుడు పైన చెప్పిన ఆర్డ‌ర్ వ‌ర్తిస్తుంది. అంద‌రి త‌రువాతే అభిమాన నటీ న‌టులు ఆఖ‌రున ఉంటారు. ఏ న‌టుడికి చెందిన అభిమానుల‌కైనా ఇది వ‌ర్తిస్తుంది. అభిమానం సినిమాల వ‌ర‌కే ఉండాలి. గొడ‌వ‌లకు దిగ‌వ‌ద్దు, వెళ్లొద్దు. నా అభిమానులు గొడ‌వ‌ల‌కు వెళ్ల‌రు. నాకు ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంది. న‌టులంద‌రం ఐక్యంగానే ఉంటాం. మా పేరిట అభిమానులు గొడ‌వ ప‌డ‌వ‌ద్దు. హ‌ద్దులు దాటే అభిమానులు నాకు వ‌ద్ద‌’ని తార‌క్ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అంతే క‌దా మ‌రి..! నిజంగా అభిమానులైతే అది సినిమాల వ‌ర‌కే పరిమితం అవ్వాలి, అంతే కానీ, ఆ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని గొడ‌వ‌ల‌కు దిగితే న‌ష్టం మ‌న‌కే జ‌రుగుతుంది, త‌ప్ప వారికి కాదు. దీన్ని గ‌మనిస్తే, ఇక ముందు ఏ అభిమాని కూడా అలాంటి హ‌త్య‌ల‌కు గురి కాడు, తాను అలాంటి హ‌త్య‌ల‌ను చేయ‌డు.

జూనియర్ ఎన్‌టీఆర్ పైన చెప్పిన మాట‌ల‌ను కింది వీడియోలో కూడా చూడ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top