మీ ఫోన్ 4-G అవునా? కాదా? ఇలా గుర్తించండి..!

4జీ… ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ మాట ప్ర‌తి ఒక్క స్మార్ట్‌ఫోన్ యూజర్ నోటా వినిపిస్తోంది. టెలికాం ఆప‌రేట‌ర్లు పోటీ ప‌డి మ‌రీ 4జీ సేవ‌ల‌ను అందించేందుకు ప్ర‌త్యేక‌మైన టారిఫ్‌లతో, ఆఫ‌ర్ల‌తో సిద్ధ‌మ‌వుతుంటే యూజ‌ర్లు ఆయా ఆఫర్ల‌లో దేన్ని స్వీక‌రించాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మ‌రోవైపు 4జీ ఫోన్ల‌లో దేన్ని కొనుగోలు చేయాలో తెలియ‌క ఇబ్బందులకు గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో 4జీ ఎల్‌టీఈ (4G LTE) అనే ఫీచ‌ర్ క‌నిపిస్తే చాలు, అలాంటి ఫీచ‌ర్ ఉన్న త‌క్కువ బ‌డ్జెట్ ఫోన్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే మీకు తెలుసా..? 4జీ ఎల్‌టీఈ అంటే కేవ‌లం ఇంట‌ర్నెట్ డేటా మాత్ర‌మే అని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అదేంటీ, 4జీ అంటే వాయిస్, ఇంట‌ర్నెట్ డేటా రెండూ ఉంటాయి క‌దా, అలా అంటారేమిటి..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయినా మేము చెబుతోంది నిజ‌మండీ బాబూ..! కావాలంటే ఇది చ‌దివి అస‌లు ట్రూ 4జీ అంటే ఏమిటో తెలుసుకోండి..!

volte

సాధార‌ణంగా ఏ ఫోన్‌కైనా 4జీ అంటే 4జీ ఎల్‌టీఈ అనే ఫీచ‌ర్‌ను మాత్ర‌మే సెల్ త‌యారీ దార్లు ఉంచుతున్నారు. అయితే అసలు నిజ‌మైన ట్రూ 4జీ అంటే వాయిస్‌, డేటా రెండూ వ‌స్తాయి. కానీ ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చాలా వ‌ర‌కు ఫోన్ల‌లో కేవలం 4జీ ఇంట‌ర్నెట్ డేటాను అందించేలా మాత్ర‌మే తీర్చిదిద్దారు. కేవలం కొన్నింటిలోనే 4జీ వాయిస్‌, ఇంట‌ర్నెట్ డేటా స‌పోర్ట్ రెండూ ల‌భిస్తున్నాయి. వీటినే ట్రూ 4జీ ఫోన్లు అని పిలుస్తున్నారు. అయితే మ‌రి ఇలాంటి ట్రూ 4జీ ఉన్న ఫోన్ల‌ను గుర్తించ‌డ‌మెలా..? అంటే, కింద చ‌ద‌వండి…

volte-on-device

4G LTE లో LTE అంటే లాంగ్ ట‌ర్మ్ ఎవ‌ల్యూష‌న్ అని అర్థం వ‌స్తుంది. అంటే మొబైల్ ఫోన్స్ వంటి డివైస్‌ల‌లో ఈ టెక్నాల‌జీని హైస్పీడ్ ఇంట‌ర్నెట్ డేటా, వాయిస్ కాల్స్ కోసం ఉపయోగిస్తారు. అయితే కేవ‌లం ఎల్‌టీఈ అని ఉంటే అది దాదాపుగా 4జీ ఇంట‌ర్నెట్ డేటాకు మాత్ర‌మే స‌పోర్ట్‌నిస్తుంది. కానీ 4G VoLTE (వీఓ ఎల్‌టీఈ – వాయిస్ ఓవ‌ర్ ఎల్‌టీఈ ) అని ఉంటే అలాంటి ఫోన్లు 4జీ ఇంట‌ర్నెట్ డేటాకే కాకుండా, 4జీ వాయిస్ కాల్స్ కోసం కూడా ప‌నిచేస్తాయి. కాబ‌ట్టి 4జీ ఫోన్ల‌ను కొనుగోలు చేసేముందు వాటిపై 4G VoLTE అని ఉంటే మాత్ర‌మే కొనుగోలు చేయండి. ఎందుకంటే అవే ట్రూ 4జీ అనుభ‌వాన్ని ఇస్తాయి. కాబ‌ట్టి తెలిసిందా..? ట‌్రూ 4జీని ఎలా గుర్తించాలో… ఇంకెందుకాల‌స్యం, వెంట‌నే అలాంటి ట్రూ 4జీ ఫోన్ కోసం ప్ర‌య‌త్నించండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top