విమానం టాయిలెట్‌లో అతడు చేసిన పని ఏంటో తెలుసా.?

మనిషికి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను మానుకోలేక వారు వాటికి బానిసలైపోయి ఉంటారు. కొన్ని సార్లు అలవాటు ప్రకారం పని చేస్తు
పక్కన ఎవరున్న డోంట్ కేర్ అంటుంటారు. మద్యానికి బానిసైన వారి కంటే సిగరెట్‌ అలవాటు ఉన్నవారు తాను రెగ్యులర్‌గా తాగే సమయానికి
తాగకపోతే ఎదో మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. ఆ టైం కి తాగకపోతే మూడీగా ఉంటారు. అందుకే ఎక్కడ ఉన్నామనేది ఆలోచించకుండా సిగరెట్‌
తాగుతుంటారు. పక్కన ఎవరున్న వారు పట్టించుకోము.

అదే అలవాటులో పడి ఓ వ్యక్తి ఏకంగా విమానంలోనే సిగరేట్ తాగాడు. అయితే విమానంలో నుంచి పోగలు రావడంతో అసలు విషయం బయటపడింది.
ఇదేక్కడో పక్క దేశంలో జరగలేదు. మన దేశంలోనే జరిగింది ఈ ఘటన.గోవా నుంచి ఢిల్లీకి ప్రయాణికులతో ఇండిగో విమానం బయలుదేరింది. విమానంలో అందరు సాఫీగా ప్రయాణిస్తున్నారు. ఇంకా కాసేపు అయితే ఎవరి గమ్య స్థానాలకు వార చేరుకుంటారు. అంతలోనే ఓ ప్రయాణికుడు సిగరెట్‌ తాగాలని తన దగ్గర ఉన్నరెండు సిగరెట్లను తీసుకుని బాత్‌రూంలోకి వెళ్లాడు. తను కూర్చున్న ప్లేస్ లో సిగరేట్ తాగితే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని భావించి .బాత్‌ రూంలోకి వెళ్లి సిగరెట్‌ తాగితే ఎవరికి ఇబ్బంది కలగదని ఆయన అనుకొని బాత్ రూం లో సిగరేట్ తాగడం మొదలు పెట్టాడు.

అయితే విమానంలో బాత్ రూం నుండి పోగ రావడాన్ని విమాన సిబ్బంది చూసి ఎదో జరిగిందని అనుకుని కంగారు పడ్డారు. విమానం నుండి పోగలు వస్తున్నాయని వెంటనే పైలెట్‌కు విషయాన్ని చెప్పడంతో ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ ఎయిర్‌ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చి వెంటనే ల్యాండింగ్‌కు క్లియరెన్స్‌
తీసుకొని వెంటనే విమానాన్ని ల్యాండ్‌ చేశాడు. అంతలో అక్కడ సిగరేట్ వాసన రావడంతో ఆ పోగ సిగరేట్ ది అని గుర్తించారు ఎయిర్ సిబ్బంది. దింతో సిగరేట్ తాగిన ప్రయాణికుడిపై ఆ విమాన సంస్థ కేసు పెట్టింది. అతడిపై పలు సెక్షన్స్‌ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఓ ప్రయాణికుడు చేసిన పనికి విమానంలో ఉన్న ప్రయాణికులు అంతా కూడా కొన్ని నిమిషాల పాటు తమ ప్రాణాలు గాల్లో కలిసినట్లే అని భయపడ్డారు. ఆ తర్వాత అసలు విషయం తెలవడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Comments

comments

Share this post

scroll to top