క‌ర్పూరం బిళ్లను బ్యాగ్‌లో చుట్టి మెడ‌లో వేసుకుని నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

క‌ర్పూరం… దేవుడి పూజ కోసం ఉప‌యోగించే ప‌దార్థంగానే చాలా మందికి తెలుసు. కానీ దీన్ని అనేక ర‌కాల లోష‌న్స్‌, స‌బ్బులు, క్రీముల త‌యారీలో ఉప‌యోగిస్తారు. లారెల్ వుడ్ అనే ఓ ప్ర‌త్యేక‌మైన వృక్ష జాతికి చెందిన కాండం నుంచి దీన్ని త‌యారు చేస్తారు. అయితే ముందు చెప్పిన విధంగా క‌ర్పూరం కేవ‌లం ఆయా అవ‌స‌రాల కోస‌మే కాదు, మ‌న శరీరానికి ఆరోగ్య ప‌రంగానూ చాలా మంచి చేస్తుంది. అయితే ఇది చ‌ర్మానికి తాకితే మ‌న చ‌ర్మం ఇరిటేష‌న్‌కు గుర‌వుతుంది. క‌నుక దీన్ని ఎలా వాడాలో, దాని వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు చూద్దాం.

camphor-bag-on-chest

ఒక చిన్న‌పాటి క్లాత్ బ్యాగ్‌లో కొన్ని క‌ర్పూరం బిళ్ల‌ల‌ను తీసుకుని ఆ బ్యాగ్‌ను మూట క‌ట్టి దానికి దారాన్ని పెన వేసి అనంత‌రం ఆ బ్యాగ్‌ను చిత్రంలో చూపిన‌ట్టుగా మెడ‌లో వేసుకోవాలి. అయితే ఇలా రాత్రిపూట చేయాల్సి ఉంటుంది. ఉద‌యాన్నే ఆ బ్యాగ్‌ను తీసేయాలి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. అవేమిటంటే…

1. పైన చెప్పిన విధంగా క‌ర్పూరాన్ని బ్యాగులో చుట్టి మెడ‌లో వేసుకుని నిద్రించ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గ్యాస్ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు రావు.

2. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. శరీర జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రుగుతాయి.

3. యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, అనాల్‌జెసిక్ వంటి గుణాలు క‌ర్పూరానికి ఉన్నాయి. కండ‌రాలు నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి.

4. యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు న‌య‌మ‌వుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

5. న‌రాల సంబంధ వ్యాధులు దూర‌మ‌వుతాయి. ఎల్ల‌ప్పుడూ ఉత్తేజంగా ఉంటారు. డిప్రెష‌న్ ద‌రి చేర‌దు.

అయితే క‌ర్పూరం బిళ్ల‌ల రూపంలో కాకుండా పొడ‌వాటి బార్స్ రూపంలో కూడా మ‌న‌కు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతోంది. వాటిని కూడా పైన చెప్పిన విధంగా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top