అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయా? అయితే బీచ్ లో స‌ముద్ర అల‌ల మీది నుండి వ‌చ్చే గాలిని ఆస్వాదించండి.

దూరంగా ఎటు చూసినా స‌ముద్రం. నీలి రంగులో క‌నిపించే స‌ముద్ర‌పు నీరు. ఉవ్వెత్తున ఎగిసి ప‌డే అలలు. ఎటు చూసినా ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త ఉట్టిప‌డే ప‌చ్చ‌ద‌నం. అలాంటి స‌ముద్ర‌పు బీచ్‌లో ఎవ‌రికైనా హాయిగా గ‌డ‌పాల‌నే ఉంటుంది క‌దా..! అందుకే చాలా మంది అలాంటి బీచ్‌ల‌కు ఎంజాయ్ చేయ‌డం కోసం వెళ్తుంటారు. అయితే అలాంటి చ‌క్క‌ని స‌ముద్ర‌పు వాతావ‌ర‌ణం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయట‌. ముఖ్యంగా స‌ముద్రం నుంచి వీచే గాలి మ‌న శ‌రీరానికి తాకితే దాంతో ప‌లు అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెబుతోంది కాదు, సాక్షాత్తూ వైద్యులు చెబుతున్న‌దే.

sea-air
వైద్యుల వ‌ద్ద‌కు మ‌నం ఎప్పుడైనా వెళితే వారు ఒక్కోసారి మంచి ప్ర‌కృతి స‌హ‌జ సిద్ధ‌మైన చ‌ల్ల‌ని గాలిలో కొంత సేపు తిర‌గ‌మ‌ని చెబుతారు క‌దా. అలాగే కొంద‌రు వైద్యులైతే చ‌ల్ల‌ని స‌ముద్ర‌పు గాలికి తిర‌గ‌మ‌ని కూడా చెబుతారు. అలా వారు ఎందుకు చెబుతారంటే… స‌ముద్ర‌పు గాలి తాక‌డం వ‌ల్ల దాంట్లో ఉండే ప‌లు ర‌కాల నీటి క‌ణాల‌తోపాటు, అయోడిన్‌, మెగ్నిషియం వంటి మూల‌కాలు మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయ‌ట‌. దీంతో చ‌క్క‌ని ఆరోగ్యం క‌లుగుతుంద‌ట‌. ప్ర‌ధానంగా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. క‌ఫం ఎక్కువ‌గా రాద‌ట‌. అంతే కాదు, ప‌లు అల‌ర్జీలు, చ‌ర్మ స‌మ‌స్య‌లు కూడా పోతాయ‌ట‌.

ఈ క్ర‌మంలో పైన చెప్పిన విధంగా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఒక్క‌సారి గ‌న‌క స‌ముద్ర‌పు గాలి శ‌రీరానికి త‌గిలేలా చేస్తే దాంతో ఆయా అనారోగ్యాల‌ను ఇట్టే న‌యం చేసుకోవ‌చ్చని వైద్యులు చెబుతున్నారు. అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారే కాదు, లేని వారు కూడా స‌ముద్ర‌పు గాలి ఆస్వాదించాల‌ని దాంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని అంటున్నారు. అయితే కాలుష్యానికి దూరంగా, స్వ‌చ్ఛ‌మైన గాలి వ‌చ్చే స‌ముద్రం వ‌ద్ద‌కు వెళితేనే పైన చెప్పిన ఫ‌లితాలు క‌లుగుతాయ‌ట‌. క‌నుక‌, ఎవ‌రైనా అలాంటి మంచి బీచ్ వ‌ద్ద‌కు వెళితే స‌రి. దాంతో ఎంచ‌క్కా ఎంజాయ్ దొరుకుతుంది, ఆరోగ్యం కూడా ల‌భిస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top