మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన అభిమానులకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అభిమానులే కాదు, ఇతర సినీ ప్రియులు కూడా ఆయన సినిమా వస్తుందంటే చాలు, ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటిది దాదాపు 9 ఏళ్ల విరామం తరువాత వచ్చిన సినిమా అది. అదేనండీ… ఖైదీ నంబర్ 150. మరి ఆ సినిమాకు ప్రస్తుతం ఎలాంటి ఆదరణ లభిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే మెగాస్టార్ అభిమానులంతా సినిమా హిట్ అయినందుకు గాను పండగ చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఓ మెగా అభిమాని ఏం చేశాడో తెలుసా..? ఓ బ్యూటిపుల్ గిఫ్ట్‌ను బహుకరించాడు. అదెవరికో కాదు, ఆ సినిమా నిర్మాత, మెగా తనయుడు రాం చరణ్‌కే ఆ బహుమతిని అందజేశాడు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసా..?
ఏమీ లేదండీ… ఖైదీ నంబర్ 150 సినిమా టైటిల్ లోగో ఉంది కదా. దాన్నే అక్షరాల రూపంలో చెక్కి ఓ అభిమాని రాం చరణ్‌కు అందించాడు. ఇంతకీ ఆ అక్షరాలు అలా చెక్కడం కోసం ఆ అభిమాని వాడిన పదార్థం ఏంటో తెలుసా..? ఐస్..! మంచు..! దాంతోనే ఖైదీ నంబర్ 150 అనే అక్షరాలను చెక్కి ఆ అభిమాని రాంచరణ్‌కు అందించాడు. దీంతో రాంచరణ్ ఆ గిఫ్ట్‌తో ఫొటో దిగి దాన్నితన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
అయితే నిజానికి మెగా అభిమానులు ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం కొత్త కాదు. ఒకప్పుడు వారు మెగాస్టార్ సినిమా వస్తుందంటే రక్త దాన శిబిరాలు చేపట్టేవారు. ఈ క్రమంలో ప్రస్తుతం వారు ట్రెండ్ మార్చి ఇలా గిఫ్ట్స్ బాట పట్టారు. మరి… ఇకపై మెగా అభిమానులు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారో..? ఎన్ని సర్ప్రైజ్లు చేస్తారో వేచి చూడాలి..! అయితే… ఈ గిఫ్ట్ విషయం పక్కన పెడితే… సినిమా నేపథ్యంలో రైతులకు మెగా ఫ్యామిలీ ఏమైనా సహాయం చేస్తుందా..? అని పలువురు అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. అదేనండీ… మొన్నా మధ్య… అంటే లాస్ట్ ఇయర్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా విడుదల అయింది కదా..! ఆ సినిమా తరువాత మహేష్ ఓ ఊరుని కూడా దత్తత తీసుకున్నారు. ఆయన ట్రెండ్‌ను చాలా మంది ఫాలోఅయి అలా ఊర్లను దత్తత తీసుకునే పనిలో పడ్డారు. అలాగే ఇప్పుడు రైతుల నేపథ్యంలో తీసిన సినిమా కాబట్టి చిరంజీవి ఆయన ఫ్యామిలీ కూడా అలాగే రైతులకు ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి… వారు స్పందిస్తారో లేదో వేచి చూడాలి..!