ముద్దుల్లో ఎన్ని ర‌కాలు ఉంటాయో, ఎలా ముద్దు పెట్టుకోవాలో తెలుసా..?

ఓ జంట విష‌యానికి వ‌స్తే ముద్దు అనేది రెండు పెద‌వుల క‌ల‌యిక‌. మాట‌లు క‌రువైన సంద‌ర్భంలో లేదా మాటలు అవ‌స‌రం లేని సంద‌ర్భంలో కొన్ని సార్లు ముద్దులే వారిద్ద‌రి మ‌ధ్య కీల‌క‌పాత్ర పోషిస్తాయి. మ‌న‌స్సులో ఉన్న భావాల‌ను ఎదుటి వారికి తెలియ‌జేసేందుకు ముద్దులు ఉప‌క‌రిస్తాయి. అయితే నిజానికి ముద్దు పెట్టుకోవ‌డం అనేది ఓ క‌ళ‌. ఈ క్ర‌మంలో అస‌లు ముద్దు ఎలా పెట్టుకోవాలో, అందులో ఎన్ని ర‌కాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

kiss-types-1
ఫ్రెంచ్ కిస్‌…
పార్ట్‌న‌ర్స్ ఇద్ద‌రూ పెద‌వుల‌ను లాక్ చేసి ఒక‌రి నాలుక‌ను మ‌రొక‌రు సుతారంగా ట‌చ్ చేస్తూ సాగే కిస్‌నే ఫ్రెంచ్ కిస్ అంటారు. దీంతో జంట‌లో ఎంతో రొమాంటిక్ మూడ్ వ‌స్తుంద‌ట‌. ఎలాంటి ఆందోళ‌న‌, ఒత్తిడిలో ఉన్నా ఈ ముద్దు పెడితే వెంట‌నే రిలాక్స్ అవుతార‌ట‌.

సింగిల్ లిప్ కిస్‌…
పార్ట్‌న‌ర్‌కు చెందిన రెండు పెద‌వుల్లో ఏదైనా ఒక పెద‌విని అవ‌త‌లి పార్ట్‌న‌ర్ త‌న రెండు పెద‌వుల‌తో ప‌ట్టుకుని ముద్దు పెట్టాలి. దీన్నే సింగిల్ లిప్ కిస్ అంటారు. ఐ ల‌వ్ యూ అని పార్ట్‌న‌ర్‌కు చెప్పేందుకు దీన్ని వాడ‌తార‌ట‌.

kiss-types-2
లిజ్జీ కిస్‌…
పైన చెప్పిన ఫ్రెంచ్ కిస్ మాదిరిగానే లిజ్జీ కిస్ ఉంటుంది. కాక‌పోతే అందులో నాలుక‌ను ట‌చ్ చేస్తూ ఉంటారు. ఇందులో నాలుక‌ల‌ను లాక్ చేసి ఉంచాలి. క‌ద‌ల‌నీయ‌కూడ‌దు. దీన్నే లిజ్జీ కిస్ అంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల బాగా ఎక్కువ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్తార‌ట‌.

అమెరిక‌న్ కిస్‌…
పార్ట్‌న‌ర్స్ ఇద్ద‌రూ తమ పెద‌వుల‌ను లాక్ చేసి పెట్టుకునే ముద్దే ఇది. అయితే ఈ ముద్దు పెట్టుకున్న‌ప్పుడు క‌పుల్స్‌లో లేడీస్ వెనుక‌గా జెంట్స్ చేయి వేసి ఆమెను కొంచెం బెండ్ చేసి ఆమె మీద‌కి ఒరిగి ఈ ముద్దు పెట్టాల‌ట‌. దీంతో అస‌లైన మ‌జా వ‌స్తుంద‌ట‌.

kiss-types-3
ఐస్ కిస్‌…
ఒక ఐస్ క్యూబ్‌ను ఒక పార్ట్‌న‌ర్ నోట్లో తీసుకుని దాంతో అవ‌త‌లి పార్ట్‌న‌ర్‌ను కిస్ చేస్తూ అత‌ని / ఆమె నోట్లోకి ఐస్ క్యూబ్‌ను వ‌ద‌లాలి. మ‌ళ్లీ ఆ పార్ట్‌న‌ర్ కూడా అలాగే చేస్తూ ముద్దు పెట్టాలి. దీన్నే ఐస్ కిస్ అంటారు. అయితే ఐస్ క్యూబ్ క‌రిగే వ‌ర‌కు ఆ ముద్దులు అలా కంటిన్యూ చేయాల‌ట‌.

నిబుల్ కిస్‌…
పార్ట్‌న‌ర్ కింది పెద‌విని సుతారంగా కొరుకుతూ ముద్దు పెట్టాలి. దీన్నే నిబుల్ కిస్ అంటారు. దీంతో శృంగారంలో మ‌రింత ఎక్కువ సేపు పాల్గొన‌వ‌చ్చ‌ట‌.

kiss-types-4
లిప్ ట్రేస్ కిస్‌…
పార్ట్‌న‌ర్ పెదవుల మ‌ధ్య‌లో నాలుక పెట్టి సుతారంగా ముద్దు పెట్టుకోవాలి. పెద‌వుల‌ను పెద‌వుల‌తో స్పృశించాలి. దీన్నే లిప్ ట్రేస్ కిస్ అంటారు. ఇలా ముద్దు పెట్టుకుంటే మ‌రింత ఎక్కువ సేపు ముద్దు పెట్టుకోవాల‌ని అనిపిస్తుంద‌ట‌.

Comments

comments

Share this post

scroll to top