సౌదీ అరేబియాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో చైనా క్రికెట్ జ‌ట్టు చేసిన స్కోరు తెలిస్తే షాక‌వుతారు..!

క్రికెట్ లో వ‌న్డే, టెస్ట్ లేదా టీ20… ఇలా మ్యాచ్ ఏదైనా ఒక్కోసారి అత్య‌ల్ప స్కోర్లు న‌మోదు అవుతూ ఉంటాయి. అయితే అందుకు చాలా కార‌ణాలు ఉంటాయి. బ్యాటింగ్ చేసే జ‌ట్టు త‌ప్పిదాలు కొన్ని ఉంటే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌలింగ్ కూడా అందుకు కార‌ణ‌మ‌వుతుంది. ఏది ఏమైనా క్రికెట్ మ్యాచ్‌ల‌లో అలా అత్య‌ల్ప స్కోర్లు న‌మోదైన‌ప్పుడు ఆడేవారికేమోగానీ ఆ ఆట‌ను చూసే వారికి మాత్రం ప‌ర‌మ బోరింగ్‌గా అనిపిస్తుంది. అయితే అంత‌టి బోరింగ్ ను మించిన మ‌హా బోరింగ్ మ్యాచ్ ఈ మ‌ధ్యే ఒక‌టి జ‌రిగింది. అది కూడా ఏయే జ‌ట్ల మ‌ధ్యో తెలుసా..? చైనా, సౌదీ అరేబియాల మ‌ధ్య‌..! అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఏంటీ… చైనా కూడా క్రికెట్ ఆడుతుందా..? అని మీరు ఆశ్చ‌ర్య‌పోకండి, ఆ దేశం క్రికెట్ ఆడుతోంది..! ఇటీవ‌ల జ‌రిగిన ఓ మ్యాచ్‌లో చైనా జ‌ట్టు చేసిన స్కోర్ చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది, అప్పుడేమ‌నాలో..!

మొన్నీ మ‌ధ్యే ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ క్వాలిఫయర్‌ (ఆసియా) టోర్న‌మెంట్ జ‌రిగింది. అందులో సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో చైనా అతి చెత్త ప్రదర్శన నమోదు చేసింది. సౌదీ అరేబియా జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసి 50 ఓవ‌ర్ల‌లో 418 ప‌రుగులు చేసింది. అయితే 419 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన చైనా జ‌ట్టు కేవ‌లం 28 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కేవ‌లం 12.4 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడిన ఆ జ‌ట్టు అత్యంత ఘోరంగా ఓట‌మి పాలైంది.

సౌదీ అరేబియా చేతిలో 390 పరుగుల భారీ తేడాతో చైనా ఓడింది. అయితే ఆ 28 ప‌రుగులు కూడా చైనాకు ఎలా ల‌భించాయో తెలుసా..? ఇద్ద‌రు బ్యాట్స్‌మెన్ 6 ప‌రుగులు చేశారు. మ‌రొక వ్య‌క్తి 3 ప‌రుగులు చేయ‌గా, 13 ప‌రుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే ల‌భించ‌డం విశేషం. ఇక మిగిలిన 7 మంది డ‌కౌట్ అయ్యారు. ఇన్నింగ్స్‌ చివరి మూడు బంతులకు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయి సౌదీ బౌలర్‌ రషీద్‌కు ‘హ్యాట్రిక్‌’ అందించారు. వ‌న్డే చరిత్ర‌లోనే అత్యంత త‌క్కువదైన చెత్త స్కోరుకు చైనా ఆలౌటైంది. అవును మ‌రి, ఇత‌ర ఆట‌లు ఆడ‌మంటే ఆడుతారు, న‌కిలీ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తారు, కానీ క్రికెట్ ఆడ‌మంటే ఎలా..? వాళ్ల‌కు చేత కావ‌ద్దా..?

Comments

comments

Share this post

scroll to top