మనదేశంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లు ఇవి.! వీటి లోపల ఎలా ఉందో ఓ లుక్కేయండి.

కూ… చుక్‌… చుక్‌… మంటూ రైలు కూత పెడుతుంటే… ప‌చ్చ‌ని ప్ర‌కృతి స‌హ‌జ సిద్ధ‌మైన అందాల న‌డుమ ట్రైన్‌లో వెళ్తుంటే… ఆహా… ఆ మ‌జాయే వేరు క‌దా..! ఆ అనుభ‌వం త‌ల‌చుకుంటే వెంట‌నే అలాంటి జ‌ర్నీ చేయాల‌ని ప్ర‌తి ఒక్కరికి అనిపిస్తుంది. విమానాల్లో వెళ్లే వారికి కూడా అంత‌టి ఆహ్లాదానుభూతి క‌ల‌గ‌దేమో. అందుకే రైలు ప్ర‌యాణం అంటే చాలా మంది మ‌క్కువ చూపిస్తారు. అయితే అది జ‌న‌ర‌ల్ బోగీల్లో కాదు లెండి. ఎంచ‌క్కా రిజ‌ర్వ‌రేష‌న్ చేయించుకుని, హాయిగా ప‌డుకుని వెళితేనే రైలు ప్ర‌యాణంలో మ‌జా తెలుస్తుంది. ఈ క్ర‌మంలో రిజ‌ర్వేష‌న్‌లో ఇంకాస్త ముందుకు వెళ్లి… రాజ‌భోగాలతో ట్రైన్‌లో ప్ర‌యాణిస్తే..? అబ్బో..! అలాంటి అనుభూతిని త‌ల‌చుకుంటేనే మ‌న‌సంతా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది క‌దూ..! ఇక నిజంగా అలాంటి భోగాల‌తో రైలులో ప్ర‌యాణిస్తే… ఇక ఆ ప్ర‌యాణం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాన్ని వ‌ర్ణించ‌డానికి మాట‌లు కూడా స‌రిపోవేమో. అయితే అలాంటి భోగాలు అనుభ‌విస్తూ కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు రైలు ప్ర‌యాణం చేసేలా మ‌న భార‌తీయ రైల్వే కొన్ని టూరిస్ట్ రైళ్ల‌ను న‌డుపుతోంది. కాక‌పోతే వాటిలో ప్ర‌యాణించాలంటే జేబునిండా డ‌బ్బులు ఉండాల్సిందే. మ‌రి అలాంటి మ‌హారాజ సౌక‌ర్యాల‌ను అందిస్తూ, ప్ర‌యాణంలోని మజాను అందించే విలాస‌వంత‌మైన రైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

maharaja-express

ప్యాలెస్ ఆన్ వీల్స్‌…
ప్యాలెస్ ఆన్ వీల్స్ అని పిల‌వ‌బ‌డే ఈ రైలు ఢిల్లీ – రాజ‌స్థాన్‌ల మ‌ధ్య న‌డుస్తోంది. దీని ధ‌ర రూ.2 ల‌క్షల నుంచి రూ.2.75 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుంది.

గోల్డెన్ చారియ‌ట్‌…
ఈ రైలు క‌ర్ణాట‌క‌, గోవాల‌లో న‌డుస్తోంది. టిక్కెట్ ధ‌ర రూ.1.62 ల‌క్ష‌ల నుంచి రూ.2.85 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుంది. 19 కోచ్‌లు, 2 రెస్టారెంట్లు, ఒక బార్‌, కాన్ఫ‌రెన్స్ రూం, జిమ్ వంటి సౌక‌ర్యాలు ఇందులో ఉన్నాయి.

maharaja-express

డెక్క‌న్ ఒడిస్సీ…
మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌ల‌లో ఈ రైలు న‌డుస్తోంది. రూ.2.90 ల‌క్ష‌ల నుంచి రూ.4.35 ల‌క్షల మ‌ధ్య టిక్కెట్ ఉంటుంది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, భార‌తీయ రైల్వేలు రెండూ క‌లిపి ఈ రైలును న‌డుపుతున్నాయి. 5 స్టార్ హోట‌ల్ లాంటి స‌దుపాయాలు ఈ రైలులో ఉంటాయి.

మ‌హారాజా ఎక్స్‌ప్రెస్‌…
ఢిల్లీ, జైపూర్‌, ఆగ్రాల‌లో ఈ రైలు న‌డుస్తోంది. ఇందులో టిక్కెట్ ధ‌ర రూ.2.75 ల‌క్ష‌ల నుంచి రూ.16 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుంది. మొత్తం 5 మార్గాలో ఈ రైలు న‌డుస్తుంది. 12 గ‌మ్య‌స్థానాల‌కు రైలు వెళ్తుంది. అత్యంత మిక్కిలి విలాస‌వంత‌మైన రైలుగా ఇది పేరుగాంచింది. అక్టోబ‌ర్ నుంచి ఏప్రిల్ మ‌ధ్య కాలాల్లో దీన్ని న‌డుపుతారు.

maharaja-express

రాయ‌ల్ రాజ‌స్థాన్ ఆన్ వీల్స్‌…
రాజ‌స్థాన్‌లో ఈ రైలు తిరుగుతుంది. ఇందులో రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.4.15 ల‌క్ష‌ల మ‌ధ్య టిక్కెట్ ధ‌ర ఉంటుంది. డీల‌క్స్ రూమ్‌లు, రెస్టారెంట్లు, బార్‌, స్పా, సెలూన్‌, వైఫై వంటి సౌక‌ర్యాల‌ను ఇందులో అందిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top