బుద్ధుడు మరణించిన స్థలం ఎక్కడ ఉందో తెలుసా..?

బౌద్ధమతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని అవలంబించడం ద్వారా ధ్యాన మార్గంలో ప్రయాణించవచ్చని చెప్పాడు. అలాగే దీంతో దుఃఖం, పాపకర్మల నుంచి విముక్తి చెందవచ్చని అన్నాడు. ఇక బుద్ధున్ని జగత్తును జ్ఞానంతో నింపడానికి వచ్చాడని చాలా మంది భావిస్తారు. బుద్ధుడి మొదటి శిష్యుడి పేరు ఆనందం. కాగా బుద్ధుడు అంటే నిద్ర నుంచి మేల్కోవడం, జాగృతుడు అవడం, జ్ఞాని, వికసించడం, అన్నీ తెలిసిన వాడు అనే అనేక అర్థాలు వస్తాయి. ఈ క్రమంలోనే ఆశే దుఃఖానికి మూలం అని బుద్ధుడు అన్నాడు. అయితే బుద్ధునికి సంబంధించిన అనేక విషయాలను మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఆయన చివరకు మరణించింది ఎక్కడ అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అదే ఇప్పుడు తెలుసుకుందాం.

బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని అనే పట్టణంలో జన్మించాడు. ఈ ప్రాంతం ప్రస్తుతం నేపాల్‌లో ఉంది. కానీ ఒకప్పటి అఖండ భారత్‌లో ఈ ప్రాంతం భారతదేశంలోనే ఉండేది. ఇక సిద్ధార్థుని పెంచిన తల్లి గౌతమి. ఆమె పేరు మీదనే ఆయనకు గౌతమ బుద్ధుడు అని పేరు వచ్చింది. ఇక ఈయన తండ్రి పేరు శుద్ధోధనుడు. తల్లి మహామాయ. ఈమె కోళియన్‌ దేశపు రాకుమారి. అయితే సిద్ధార్థుడు జన్మించిన 7 రోజుల తరువాత తల్లి మహామాయ మరణిస్తుంది. దీంతో సిద్ధార్థుడు తన సవతి తల్లి గౌతమి వద్ద పెరుగుతాడు. ఈ కారణంగానే గౌతమ బుద్ధుడు అని సిద్ధార్థుడికి పేరు వచ్చింది.

సిద్ధార్థుడు పుట్టగానే అతనిలో గొప్ప లక్షణాలు జ్యోతిష్యులకు కనిపించాయట. అందుకు అనుగుణంగానే అతను తన తండ్రి తరువాత రాజ్యానికి రాజు అవుతాడు. పెళ్లి చేసుకుంటాడు. ఆ సమయంలో ఒకసారి సిద్ధార్థుడు నగర సంచారానికి వెళ్తాడు. మార్గమధ్యలో ఒక వృద్ధున్ని, ఒక రోగిని, ఒక చావును చూస్తాడు. దీంతో అతను విచారం చెందుతాడు. అతనికి దుఃఖం ఆవరిస్తుంది. చింతతో ఆలోచిస్తుంటాడు. అయితే అదే సమయంలో ఒక సన్యాసి అతని ముందు నుంచి వెళ్తాడు. దీంతో సిద్ధార్థుడు అప్పుడే నిర్ణయించుకుంటాడు, తానూ ఓ సన్యాసిలా మారాలని. అనుకున్నదే తడవుగా అన్ని బంధాలను తెంచుకుంటాడు.

అలా సిద్ధార్థుడు అన్ని బంధాలను తెంచుకుని, రాజ్యాన్ని, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి జ్ఞానమార్గం దిశగా ప్రయాణం చేస్తాడు. అందులో భాగంగానే జ్ఞానం ఆర్జించిన సిద్ధార్థుడు బుద్ధుడిగా మారుతాడు. అప్పటి నుంచి అతన్ని గౌతమ బుద్ధుడు అని పిలవడం ప్రారంభించారు. అనంతరం బుద్ధుడు ప్రపంచానికి జ్ఞాన మార్గాన్ని తెలియజేస్తాడు. చివరకు అతను తుదిశ్వాస విడుస్తాడు. ఇక బుద్ధుడు మరణించిన స్థలం ఇప్పుడు మన దేశంలోని ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న కుశినగర్‌ లో ఉంది. అది ఇప్పుడు ప్రముఖ బౌద్ధ ఆలయంగా మారింది. ఈ ప్రదేశానికి ఇప్పుడు అనేక మంది వెళ్తుంటారు. దీంతో ఇది గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అవతరించింది. ఇక ఈ ఆలయంలో బుద్ధుడు యోగనిద్రలో మనకు కనిపిస్తాడు. తల ఉత్తరం దిశగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న బుద్ధుడి విగ్రహం సుమారు 6.1 మీటర్ల పొడవు ఉంటుంది. కాగా క్రీస్తు పూర్వం 260వ సంవత్సరంలో మౌర్య రాజు అశోకుడు బుద్ధుడు నిర్యాణం చెందిన ఈ స్థలాన్ని గుర్తించి అనేక స్థూపాలను కూడా నిర్మింపజేశాడు.

 

Comments

comments

Share this post

scroll to top