ఒక‌ప్పుడు స్త్రీల‌కు ఎలాంటి ఆంక్ష‌లు, నియ‌మాలు విధించే వారో తెలుసా..?

ఇప్పుడంటే మ‌హిళ‌లు ఎక్క‌డికంటే అక్క‌డికి వెళ్తున్నారు. ఏం కావాలంటే అది చేస్తున్నారు. వారిపై ఎలాంటి ఆంక్ష‌లు లేవు. అయితే ఒక‌ప్పుడు మాత్రం అలా కాదు. స్త్రీల‌పై అనేక ఆంక్ష‌లు విధించే వారు. అవి చాలా క‌ఠినంగా ఉండేవి. ఏం చేయాలన్నా అందుకు తండ్రి, సోద‌రుడు లేదా భ‌ర్త అనుమ‌తి ఉండాల్సిందే. ఈ క్రమంలోనే అప్ప‌ట్లో మ‌హిళ‌ల‌పై పెట్టిన ఆంక్ష‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్త్రీలు ఎప్పుడు ప‌డితే అప్పుడు శృంగారంలో పాల్గొన‌డానికి వీలు లేదు. కేవ‌లం రాత్రి పూట మాత్ర‌మే ఆ ప‌ని చేయాలి.

2. భ‌ర్త అరిచినా, తిట్టినా భార్య‌లు అత‌న్ని ఏమీ అన‌కూడ‌దు. మారుమాట్లాడకుండా అక్క‌డి నుంచి వెళ్లిపోవాలి. అంతే త‌ప్ప ఎదురు చెప్ప కూడ‌దు.

3. భ‌ర్త ముందుకు భార్య‌లు అందంగా అలంక‌రించుకుని రావాలి. భ‌ర్త లేక‌పోతే వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ అందంగా అలంక‌రించుకోకూడ‌దు.

4. భ‌ర్త ఎంత త‌క్కువ సంపాదన తెచ్చినా దాంతో భార్య ఇల్లు గ‌డ‌పాలి. అంతే త‌ప్ప వాదించ‌కూడదు.

5. వేశ్య‌తో ఎవ‌రైనా ఒక స్త్రీ మాట్లాడితే అంతే. ఆమెను ఇక ఎవ‌రూ త‌మ త‌మ ఇండ్ల‌లోకి రానివ్వ‌రు. అంత క‌ఠిన‌మైన నియమం అప్ప‌ట్లో ఉండేది.

6. పండుగ‌లు, శుభ‌కార్యాలు జ‌రిగిన‌ప్పుడు మ‌హిళ‌లు కచ్చితంగా ఉప‌వాసం చేయాలి. భ‌ర్త‌, కుటుంబ స‌భ్యులు, పిల్ల‌ల క్షేమం కోసం వారు ప్రార్థించాలి.

7. స్త్రీల‌కు రుతుక్ర‌మం అయిన‌ప్పుడు భ‌ర్త‌ను చూడ‌కూడ‌దు. అత‌ను చూసే విధంగా ఎదురు ప‌డ‌కూడ‌దు. విడిగా ప‌డుకోవాలి. తినాలి. నిద్ర‌పోవాలి.

8. దేవుడు, బిచ్చ‌గాడు, ప‌నివాడు, ఆవు, అతిథిల‌కు పెట్ట‌కుండా స్త్రీ అస్స‌లు భోజ‌నం చేయ‌రాదు.

9. భ‌ర్త గురించిన ఎటువంటి ర‌హ‌స్యం తెలిసినా భార్య దాన్ని ఇత‌రుల‌తో చెప్ప‌రాదు. అలా చేస్తే పెద్ద నేరం చేసిన‌ట్టే లెక్క‌.

10. స్త్రీలు త‌మ భ‌ర్త‌లు నిద్రించాక ప‌డుకోవాలి. ఉద‌యం భ‌ర్త లేవ‌క ముందే నిద్ర లేవాలి.

11. భ‌ర్త అనుమ‌తి లేకుండా భార్య గ‌డ‌పలో నిల‌బ‌డరాదు. గ‌డ‌ప దాటి బ‌య‌టికి వెళ్ల‌రాదు.

12. భ‌ర్త కేవ‌లం ఒక్క‌సారి పిలిస్తే చాలు ప‌ల‌కాలి. అత‌ని ఆదేశానుసారం న‌డుచుకుని పనులు చేసి పెట్టాలి. అత‌ను అడిగింది చేయాలి.

13. భ‌ర్త సంతోష‌మే భార్య‌కు ముఖ్యం అన్న‌ట్టుగా ఉండాలి. భ‌ర్త‌ను భార్య ఎల్ల‌ప్పుడూ ఆనందంగా ఉంచాలి. అత‌నికి కోపం తెప్పించ‌కూడ‌దు. అత‌ను చెప్పిన‌ట్టు న‌డుచుకుని స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఇల్లాలుగా మెల‌గాలి.

ఇవి ఇప్ప‌టికి కూడా కొన్ని ప్రాంతాల్లో అమ‌ల‌వుతున్న‌వే.!

రాతి యుగం నుండి కంప్యూట‌ర్ యుగంలోకి వ‌చ్చిన మ‌నలో మార్పు రావాలి… స్త్రీ పురుషులిద్ద‌రూ స‌మాన‌మే భావ‌న మ‌న‌లో క‌ల‌గాలి.
సంసార బాధ్య‌త‌లో ఇరువురూ కీల‌క‌మే.! ఇది కేవ‌లం స్త్రీల ప‌ట్ల ఇటువంటి నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని చెప్ప‌డం కోస‌మే.!!

Comments

comments

Share this post

scroll to top