బీఎస్ఎన్ఎల్ తీసుకువ‌చ్చిన ఈ 3 కొత్త ప్లాన్లు తెలుసా..? జియోకు పోటీగా ఈ ప్లాన్లు ఉన్నాయి..!

రిల‌య‌న్స్ జియో ఎప్ప‌టిక‌ప్పుడు వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేలా ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించ‌డం ఏమోగానీ ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్ల‌కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. దీంతో వారు కూడా త‌మ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు, ఉన్న వారిని కోల్పోకుండా ఉండేందుకు కొత్త ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌క తప్ప‌డం లేదు. అయితే వారి బాట‌లోకి ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా వ‌చ్చి చేరింది. ఇప్ప‌టికే ఈ సంస్థ త‌న బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్ల కోసం కొత్త ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా తాజాగా త‌న సిమ్ కార్డుల‌ను వాడుతున్న వారికి కూడా వినూత్న‌మైన ఆఫ‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

దిల్ కోల్ కె బోల్ (ఎస్టీవీ 349), ట్రిపుల్ ఏస్ (ఎస్టీవీ 333), నెహెల్ పర్ దేహ్లా (ఎస్టీవీ 395) పేర్లతో బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ నెట్‌వ‌ర్క్‌ను వాడుతున్న యూజ‌ర్లు ఇప్పుడు ఈ ప్యాక్‌ల‌ను రీచార్జి చేసుకుని వాటి ద్వారా బెనిఫిట్స్ పొంద‌వ‌చ్చు. దిల్ కోల్ కె బోల్ ప్లాన్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ ను, రోజుకు 2 జీబీ డేటాను 349 రూపాయల రీఛార్జ్ తో అందిస్తోంది. అదేవిధంగా ట్రిపుల్ ఏస్ ప్లాన్ కింద 333 రూపాయల రీఛార్జ్ తో 90 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా వాడుకునే సౌకర్యం ఉంటుంది. దీంతో 90 రోజుల పాటు 270 జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు.

ఇక నెహెల్ పర్ దెహ్లాపై రోజుకు 2 జీబీ డేటా, 3000 బీఎస్ఎన్ఎల్ టూ బీఎస్ఎన్ఎల్ ఉచిత నిమిషాలు, 1800 నిమిషాల ఇతర నెట్ వర్క్ కాల్స్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్ 71 రోజుల వరకు వాలిడిటీలో ఉంటుంది. అయితే వీటితోపాటు ఎస్టీవీ 339 ప్లాన్ ఆఫర్ ను కూడా బీఎస్ఎన్ఎల్ మార్చింది. దీని ప్రకారం ఇప్పుడు యూజ‌ర్ల‌కు రోజుకు 3 జీబీ డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు ల‌భిస్తాయి. అంత‌కు ముందు ఈ ప్లాన్ వ‌ల్ల రోజుకు 2 జీబీ డేటా మాత్ర‌మే ల‌భించేది. ఈ ప్యాక్ వాలిడీని 28 రోజులుగా నిర్ణ‌యించారు. ఇక జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఆఫ‌ర్లు యూజ‌ర్ల‌ను ఏవిధంగా ఆక‌ట్టుకుంటాయో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top