పార్లే జి బిస్కెట్ ప్యాక్‌పై ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..?

ఏ రంగానికి చెందిన కంపెనీ అయినా త‌మ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం, వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం త‌మ త‌మ ఉత్ప‌త్తుల‌ను ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేలా త‌యారు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయా ఉత్ప‌త్తుల ప్యాకింగ్‌పై లోగో, బ్రాండ్ ఇమేజ్ వంటి వాటిని ముద్రించి జ‌నాల‌ను త‌మ వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తాయి. అయితే ఇలా చేయ‌డంలో అన్ని కంపెనీలు స‌క్సెస్ కావు, కేవ‌లం కొన్ని మాత్ర‌మే విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తాయి. అలా విజ‌యం సాధించిన కంపెనీల్లో పార్లే-జి (Parle-G) కూడా ఒక‌టి. ఇంత‌కీ ఆ కంపెనీ త‌మ ఉత్ప‌త్తుల‌కు ఆక‌ర్ష‌ణ పెంచ‌డం కోసం ఏం చేసింద‌నేగా మీ డౌట్‌. అదే ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Parle-G-Biscuit-Pack

Parle-G కంపెనీ బిస్క‌ట్ల‌ను మీరెప్పుడైనా తిన్నారా? తిన‌కేం, చెప్ప‌లేనన్ని ప్యాకెట్ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు కొని తిన్నాం, అంటారా? అయితే ఆగండి, అక్క‌డే ఆగిపోండి. ఆ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్‌ను కొన్నాక దానిపై మీరేం గ‌మ‌నించారు? ఎవ‌రైనా ఏం చూస్తారు, కంపెనీ పేరు, బిస్క‌ట్ల‌ పేరు, వాటిలో క‌లిసిన ప‌దార్థాలు, ఆ బిస్కెట్ల‌ను తిన‌డం వ‌ల్ల వ‌చ్చే శ‌క్తి త‌దిత‌ర వివ‌రాల‌ను చూస్తార‌ని చెబుతారా? అయితే వాటితోపాటు ఇంకో విష‌యం కూడా మీరు గ‌మ‌నించే ఉండాలే! అదేనండీ ప్యాక్‌పై ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది క‌దా, ఆ బొమ్మ‌నే, చూశారా! చూడ‌కేం, చాలా సార్లు చూశామంటారా? మీరు చూసే ఉంటారు, కానీ ఆ బొమ్మ గురించి మీరేమ‌నుకుంటున్నారు? ఏమ‌నుకోవ‌డ‌మేమిటి? అది బొమ్మే క‌దా! అంటారా? అయితే అక్క‌డే మీరు ప‌ప్పులో కాలేశారు. అది బొమ్మ కాదండీ బాబు! నిజంగానే ఓ చిన్నారి పాప‌కు చెందిన ఫొటో అది. దాన్ని Parle కంపెనీ వారు త‌మ Parle-G బిస్క‌ట్ల‌పై ఎప్ప‌టి నుంచో వాడుతున్నారు. ఏంటి షాక్ తిన్నారా! అయినా ఇది నిజం, మీరు న‌మ్మాల్సిందే!

అది ఇప్ప‌టి మాట కాదు. 1960ల నాటి ముచ్చ‌ట‌. మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో నీరు దేశ్ పాండేకు అప్పుడు 4 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు. కాగా ఆ చిన్నారి తండ్రి ఆ పాప ఫొటోను ఒకానొక సంద‌ర్భంలో అనుకోకుండా తీశాడు. అత‌ను ఫొటోగ్రాఫ‌ర్ కాదు. అయినా ఆ పాప ఫొటోను అద్భుతంగా తీశాడు. ముద్దులొలికే చూపులు, చేతుల‌తో ఆ పాప ఫొటో వ‌చ్చిన తీరు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా మారింది. ఈ క్ర‌మంలో ఆ ఫొటో అనుకోకుండా పార్లె కంపెనీ ప్ర‌తినిధుల కంట ప‌డింది. ఇంకేముంది వారికి ఆ ఫొటో ఎంత‌గానో న‌చ్చి దాన్ని త‌మ బిస్కెట్ ప్యాక్‌లపై బ్రాండ్ ఇమేజ్‌గా వాడడం మొద‌లు పెట్టారు. అలా అప్ప‌టి నుంచి ప్ర‌స్తుతం వ‌స్తున్న పార్లే జి బిస్క‌ట్ ప్యాక్‌ల‌పై కూడా ఆ ఫొటోనే య‌థాత‌థంగా వాడుతూ వ‌స్తున్నారు. అంతేగానీ ఆ ఫొటో యానిమేటెడ్ కాదు. ఎవ‌రో గీసిన చిత్రం అంత‌క‌న్నా కాదు.

ఇంత‌కీ నీరు దేశ్ పాండే ఇప్పుడుందా? అనేగా మీ డౌటు. అవును, ఆమె ఇప్ప‌టికీ ఉంది. కాక‌పోతే ఇప్పుడామె వ‌య‌స్సు 65 ఏళ్లు. మ‌రి ఇప్పుడామె ఎలా ఉందో మీకు కూడా చూడాల‌ని ఉంది క‌దూ. అయితే కింది చిత్రం చూడండి. కాక‌పోతే 1960 మాదిరిగా మాత్రం ఉండదు లెండి. ఎందుకంటే ఇప్పుడామెకు వృద్ధాప్యం వ‌చ్చిందిగా మరి. ఏది ఏమైనా అస‌లు ఆ పాప ఒరిజిన‌ల్‌గా ఉంద‌న్న విష‌యం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌దు. దీంతో ఈ వార్త తెలుసుకున్న వారు ఇప్పుడు అమితంగా ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌. నిజంగా ఇది ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే క‌దా మ‌రి!

Neeru-Desh-Pande

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top