రాహుల్ గాంధీ పై యువతుల క్రేజ్ ఎంతో తెలుసా .??

యువతలో రాహుల్ గాంధీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా చెన్నైలోని స్టెల్లా మేరి కాలేజ్ లో విద్యార్ధినిలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ విషయం మరోసారి రుజువైంది. రాహుల్ ను చూడడాన్ని యువత చాలా ఎగ్జైట్ మెంట్ ఫీల్ అయ్యారు. రాహుల్ గాంధీ రాక కోసం ఇంకా తాను వెయిట్ చెయ్యిలేనని ఏ విద్యార్ధిని చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా యువతుల్లో రాహుల్ గాంధీకి ఉన్న క్రేజ్ ను పెంచడానికి వణక్కం రాహుల్ పేరుతో ఓ హ్యష్ ట్యాగ్ ను రన్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాహుల్ ప్రచారంలో జోరు పెంచారు.

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్ తన తమిళనాడు పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది. చెన్నై లోని స్టెల్లా మేరి కాలేజ్ లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్ధినిలతో చాలా సరదాగా సంభాషించారు. సార్ అని పిలవద్దు రాహుల్ అని పిలవండి అంటూ విద్యార్ధినిలతో ముచ్చటించారు. రాహుల్ రాక కన్నా ముందుగానే అక్కడికి చేరుకున్న యువతులు రాహుల్ రాక కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూసారు.

రాహుల్ ను నేరుగా చూసేందుకు వచ్చిన యువతులలో ఓ విద్యార్ధిని మరింత ఎగ్జైట్ మెంట్ కు గురై… రాహుల్ రాక కోసం ఎదురు చూడడం తన వల్ల కాదని ఓ వీడియోను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది. ఇదిలా ఉంటే… తన కోసం అమ్మాయిలంతా వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటే… రాహుల్ కూడా వారి ఎగ్జైట్ మెంట్ ను ఏమాత్రం నిరాశ నిరాశపరచకుండా లాల్చీ పైజామాను వదిలేసి ఏకంగా కాలేజీ కుర్రాడిలా జీన్స్, టీ షర్ట్ లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన కోసం ఎదరు చూస్తున్న యువతులను ఆయన అదే ఎగ్జైట్ మెంట్ లో ఉండేలా చేశారు. ఇక వారితో సెల్ఫీ లు దిగుతూ హల్ చల్ చేశారు.

Watch Video;

Comments

comments

Share this post

scroll to top