మొన్నటి మ్యాచ్ లో అందరి దృష్టి ఆ అమ్మాయి మీదే.! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.?

క్రికెట్ మ్యాచులంటే.. కేవ‌లం ఆట మాత్ర‌మే కాదు.. అప్పుడ‌ప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో స్టేడియంలో కూర్చున్న అభిమానుల వైపు కూడా కెమెరాల క‌ళ్లు మ‌ళ్లుతుంటాయి. అభిమానులు చేసే విచిత్ర విన్యాసాలు, వారి చేష్ట‌లు, వారి గెట‌ప్‌లు, బౌండ‌రీ కొట్టిన‌ప్పుడు, వికెట్ తీసిన‌ప్పుడు లేదా త‌మ‌కిష్ట‌మైన ప్లేయ‌ర్ మైదానంలోకి వ‌చ్చిన‌ప్పుడు వారు చేసే అల్ల‌రి, వేసే ఈల‌లు… ఇలాంటి వాటినన్నింటినీ మ్యాచ్ సంద‌ర్భంగా కెమెరామెన్‌లు రికార్డు చేస్తుంటారు. లైవ్‌లో ఆ ప్ర‌సారాలు వ‌స్తుంటాయి కూడా. అయితే తాజాగా ఐపీఎల్‌లో బెంగుళూరు, కోల్‌క‌తా జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ్గా ఇలాగే కెమెరా కళ్లు ఓ యువ‌తి వైపే ప‌దే ప‌దే వెళ్లాయి. దీంతో ఆ యువ‌తి ఫొటోలు కాస్తా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే…

ఆమె పేరు శివానీ పాథ‌క్‌. మెడిక‌ల్ స్టూడెంట్‌. సోష‌ల్ మీడియాలో ఈమె బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఈమెకు 1200 మందికి పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈమె తాజాగా జ‌రిగిన‌ బెంగుళూరు, కోల్‌క‌తా మ్యాచ్‌కు స్టేడియంకు వ‌చ్చింది. అందులో భాగంగా గ్యాల‌రీలో ఆమె కూర్చుని త‌న ఫేవ‌రెట్ టీం అయిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగుళూరుకు స‌పోర్ట్‌గా చీర్స్ తెలిపింది. త‌న ఫేవ‌రెట్ బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లికి మ‌ద్దతుగా నినాదాలు చేసింది.

అయితే గ్యాల‌రీలో కూర్చుని ఆర్‌సీబీ జ‌ట్టుకు చీర్స్ తెలుపుతున్న శివానీ వైపే కెమెరా క‌ళ్లు ప‌దే ప‌దే వెళ్లాయి. దీంతో ఆమె ఎవ‌రో సెల‌బ్రిటీ అయి ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఆమె సెల‌బ్రిటీ కాదు. కాక‌పోతే అంత అందంగా ఉండ‌డం చేత ప‌దే ప‌దే కెమెరాల్లో ఆమెను చూపించారు. అంతే.. ఈ క్ర‌మంలోనే ఆమె ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కావాలంటే మీరూ ఆమె గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను చూడ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top