మ‌నం ఏ వ‌య‌స్సులో పెళ్లి చేసుకుంటే మంచిదో తెలుసా..?

ఒక‌ప్పుడంటే నిండా 15 ఏళ్లు కూడా రాక‌ముందే చాలా చిన్న వ‌య‌స్సులోనే పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడ‌లా కాదుగా, ప్ర‌పంచం మారిపోయింది. మ‌హిళ‌లు పురుషుల‌తో అన్ని రంగాల్లోనూ పోటీ ప‌డుతున్నారు. టెక్నాల‌జీ యుగం న‌డుస్తోంది. అంద‌రూ బాగా ఆలోచించే మేథావులు అయిపోయారు. అందుక‌ని బాగా సెటిల్ అయ్యాకే వివాహాలు చేసుకుంటున్నారు. 30 ఏళ్లు నిండితే గానీ ఎవ‌రూ పెళ్లి మాట ఎత్త‌డం లేదు. అయితే మీకు తెలుసా..? ఎవ‌రికైనా పెళ్లి చేసుకోవ‌డానికి క‌రెక్ట్ ఏజ్ ఏంటో..? ఆ ఏముందీ… ప్ర‌భుత్వం ముందే చెప్పింది క‌దా, ఆడ‌వారికి 18, మ‌గవారికి 21 ఉంటే పెళ్లి చేసుకోవ‌చ్చ‌ని..! అది క‌రెక్టే. ఆ రూల్‌ను ప్ర‌భుత్వాలు పెట్టాయి. కానీ అది కాదు, అస‌లు మ‌నం పెళ్లి చేసుకోవ‌డానికి క‌రెక్ట్ ఏజ్ అది కాద‌ట‌. మ‌రి ఏ వ‌య‌స్సులో పెళ్లి చేసుకుంటే బెట‌ర్‌..? అనేదేగా మీ డౌట్‌. ఇంకెందుకాల‌స్యం ఆ డౌట్‌ను తీర్చుకుందాం రండి..!

ఆయ‌న పేరు నికోలాస్ హెచ్‌.వోల్ఫింగ‌ర్‌. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఉతాహ్‌లో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆయ‌న ఓ మానసిక వైద్యుడు, శాస్త్రవేత్త‌. అయితే ఈ మ‌ధ్యే ఈయ‌న ఓ అంశంపై ప‌రిశోధ‌న చేశాడు. అది వేరే ఏదో కాదు, పైన ఆల్రెడీ చెప్పాం క‌దా, అదే. మనం ఏ వ‌య‌స్సులో పెళ్లి చేసుకుంటే మంచిది..? అనే అంశంపై ఈయ‌న ప‌రిశోధ‌న చేశాడు. అందుకు గాను ఆయ‌న అనేక జంట‌ల గురించి, వారికి పెళ్లి జ‌రిగిన వ‌య‌స్సు గురించి తెలుసుకుని, ఆ డేటా అంతటా ఒక ద‌గ్గ‌ర పెట్టి విశ్లేషించాడు. దీంతో చివ‌రికి తెలిసిందేమిటంటే…

ఆడైనా, మ‌గైనా ఎవ‌రైనా 28 నుంచి 32 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు పెళ్లి చేసుకుంటేనే మంచిద‌ట‌. ఎందుకంటే ఆ వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్న వారు విడాకులు తీసుకునే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. అంత‌క‌న్నా ముందు అంటే 20ల‌లో ఉన్న‌ప్పుడు పెళ్లి చేసుకున్నా, లేదంటే 32 దాటాక పెళ్లి చేసుకున్నా వారు గొడ‌వ ప‌డి విడాకులు తీసుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. అందుక‌ని ముందు చెప్పిన విధంగా వ‌య‌స్సు 28 నుంచి 32 సంవ‌త్స‌రాలు ఉంటేనే బెట‌ర‌ట‌. అదే వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు పెళ్లి చేసుకోవాల‌ట‌. ఏది ఏమైనా ఆ సైంటిస్టు చెప్పింది ఓ విధంగా క‌రెక్టే. ఎందుకంటే నేటి త‌రుణంలో చాలా మంది అదే వ‌య‌స్సులో పెళ్లి చేసుకుంటున్నారు. అందుకు ముఖ్య కార‌ణం కెరీర్‌. బాగా సెటిలై పెళ్లి చేసుకోవాల‌నే కోరిక ఉండ‌డం వ‌ల్ల నేడు చాలా మంది 30ల‌లో పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. అవును మ‌రి, ఆ సైంటిస్టు చెప్పింది కూడా దాదాపుగా ఇదే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top