మన దేశంలో క్రికెటర్లకు ఎంత పాపులారిటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. సినిమా స్టార్ల కన్నా ఎక్కువగానే వారికి ఆదరణ ఉంటుంది. అందుకు కారణం వారు ఆడే ఆటే. అయితే ఆ ఆటతోపాటు వారికి ఎన్నో నజరానాలు, పారితోషికాలు వస్తాయి. మరి అలా వచ్చాక ఏ క్రికెటర్ అయినా ఊరుకుంటాడా..! తమ అభిరుచులను, ఇష్టాలను ఆ నజరానాతో బయట పెట్టుకుంటారు. అదీ ముఖ్యంగా కార్ల విషయంలో. విలాసవంతమైన కార్లలో తిరగాలని అందరికీ ఉంటుంది కదా, ఆ క్రమంలోనే మన క్రికెటర్లు కూడా ఎన్నో రకాల కార్లను కొనుగోలు చేసి వాటిలో తిరిగి ఆనందిస్తుంటారు. మరి… మన క్రికెటర్ల దగ్గర ఉన్న కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..?
సచిన్ టెండుల్కర్…
మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వద్ద బీఎండబ్ల్యూ ఎం5, ఎక్స్5, నిస్సాన్ జీటీఆర్ 530 తదితర కార్లు ఉన్నాయి. అయితే సచిన్ వద్ద మొన్నటి వరకు ఫెరారీ 360 మోడెనా అనే కారు ఉండేది. కానీ దాన్ని ఆయన మొన్నా మధ్యే అమ్మేశాడు.
యువరాజ్ సింగ్…
క్రికెటర్ యువరాజ్ సింగ్కైతే కార్లు అంటే క్రేజీ. ఎన్నో లగ్జరీ కార్లు ఆయన కలెక్షన్లో ఉంటాయి. లంబోర్గిని ముర్సిలాగో, పోర్షే 911 కార్లు యువీ వద్ద ఉన్నాయి. 2007లో వరల్డ్ టీ20 కప్‌లో ఇంగ్లండ్‌పై 6 బాల్స్ కు 6 సిక్సర్లు బాదినందుకు గాను యువీకి పోర్షే కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.
ధోని…
మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి అయితే కార్లే కాదు బైక్ లన్నా క్రేజే. ఆయన వద్ద టయోటా కరోలా, హమ్మర్, ఓపెన్ టాప్ స్కార్పియో, మిత్సుబుషి పజెరొ వంటి కార్లు ఉన్నాయి.
సౌరవ్ గంగూలీ…
భారత క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే మన దాదా, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వద్ద 20 మెర్సిడెస్ బెంజ్ కార్లు ఉన్నాయి. అంతే కాదు ఇంకా ఎన్నో బీఎండబ్ల్యూ కార్లు కూడా ఉన్నాయి.
కపిల్ దేవ్…
ఇండియాకు తొలిసారిగా క్రికెట్ వరల్డ్ కప్ అందించిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వద్ద పోర్షె పనమెరా కారు ఉంది. దీంతోపాటు ఇతర లగ్జరీ కార్లు కూడా ఆయన వద్ద ఉన్నాయి.
వీరేంద్ర సెహ్వాగ్…
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వద్దనైతే బెంట్లీ మోటార్స్‌కు చెందిన కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ అని పిలవబడే కారు ఉంది. దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. అంతే కాదు ఆయన వద్ద కోట్ల రూపాయల విలువైన ఇతర కార్లు కూడా ఉన్నాయట.
రాహుల్ ద్రావిడ్…
ది వాల్‌గా పేరున్న మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వద్ద బీఎండబ్ల్యూ కారు ఉంది. హుందాయ్ టక్సన్ కారు ఉంది. ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా 2004లో రాహుల్ ద్రావిడ్ సెలెక్ట్ అయినందుకు గాను ఆయనకు టక్సన్ కారు గిఫ్ట్‌గా వచ్చింది.
విరాట్ కోహ్లి…
భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లి వద్ద బీఎండబ్ల్యూ ఎక్స్, రెనాల్ట్ డస్టర్, ఆడి ఆర్8 కార్లు ఉన్నాయి.
హర్భజన్ సింగ్…
భజ్జీగా పిలుచుకునే హర్భజన్ సింగ్ వద్ద హమ్మర్ కారుతోపాటు మరెన్నో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
అనిల్ కుంబ్లే…
మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే వద్ద ఫోర్డ్ ఎండీవర్, బ్లాక్ మెర్సిడెస్ ఇ-క్లాస్ కారు ఉన్నాయి.