ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

మ‌న‌లో చాలా మంది అన్నం తెల్ల‌గా మ‌ల్లెపూవులా ఉంటే గానీ తిన‌రు. దీంతోపాటు మైదా పిండి, చ‌క్కెర‌, ఉప్పు వంటి ప‌దార్థాలు కూడా తెల్ల‌గా ఉండాల్సిందే. అలా ఉంటేనే ఆయా ప‌దార్థాలు శుభ్రంగా ఉన్న‌ట్టు భావిస్తారు. ఈ క్ర‌మంలోనే వాటిని ఆర‌గించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. అయితే… నిజానికి ఆ ప‌దార్థాలు అలా తెల్ల‌గా ఉంటే చాలా డేంజ‌ర‌ట‌. ఎందుకంటే అలాంటి పదార్థాల‌లో పోష‌క విలువ‌లు ఏమాత్రం ఉండ‌వు స‌రిక‌దా, వాటిని తింటే ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

1. రీఫైన్డ్ పిండి…
రీఫైన్ చేయ‌బ‌డిన గోధుమ పిండి లేదా మైదా పిండిలో అల్లోగ్జాన్ అన‌బ‌డే ప్రమాద‌క‌ర ర‌సాయ‌నం క‌లుస్తుంద‌ట‌. ఇది క్లోమంలో ఉండే క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంద‌ట‌. దీంతో డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌.

2. రీఫైన్డ్ చ‌క్కెర‌…
చ‌క్కెర ఎలా త‌యార‌వుతుందో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో దాన్ని రీఫైన్ చేసే క్ర‌మంలో అందులో ఉండే 90 శాతం పోష‌క విలువలు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌. దీనికి తోడు అలాంటి చ‌క్కెర‌లో కార్బ‌న్ డ‌యాక్సైడ్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఈ క్ర‌మంలో అలాంటి రీఫైన్డ్ చ‌క్కెర‌ను తింటే ఇబ్బందుల్లో ప‌డ్డ‌ట్టే అవుతుంది. అనారోగ్యం బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది.

3. పాశ్చ‌రైజ్డ్ పాలు…
పాలను పాశ్చ‌రైజ్ చేసే క్ర‌మంలో అందులో ఉండే కీల‌క విట‌మిన్లు, ఎంజైమ్‌లు నాశ‌న‌మ‌వుతాయి. చివ‌రిగా అలాంటి పాల‌లో కేవ‌లం 10 శాతం పోష‌కాలు మాత్ర‌మే మిగులుతాయి. దీనికి తోడు అలాంటి పాలలో ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు క‌ల‌వ‌డం వ‌ల్ల ఆ పాల‌ను సేవిస్తే మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

4. రీఫైన్డ్ బియ్యం…
బియ్యాన్ని రీఫైన్ చేసే క్ర‌మంలో అందులో ఉండే ఫైబ‌ర్‌, ఇత‌ర పోష‌కాలు నాశ‌నం అవుతాయి. ఈ క్ర‌మంలో అలా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటే డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి.

5. రీఫైన్డ్ ఉప్పు…
రీఫైన్ చేసిన ఉప్పును తింటే గుండె సంబంధ వ్యాధులు వ‌స్తాయి. బీపీ ఎక్కువ‌వుతుంది. ప్ర‌మాద‌క‌ర కెమిక‌ల్స్ మ‌న శ‌రీరంలోకి వెళ్లి అనారోగ్యాల‌ను తెచ్చి పెడ‌తాయి.

Comments

comments

Share this post

scroll to top