త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డిన 28 వేల ఏళ్ల కింద‌టి సెక్స్ టాయ్.!!

నిజంగా మ‌న కంటే మ‌న పూర్వీకులు దాదాపుగా అన్ని విష‌యాల్లోనూ గ్రేటే. ఆ విష‌యం క‌చ్చితంగా ఎవ‌రైనా ఒప్పుకోవాల్సిందే. తిన‌డంలోనూ, ప‌నిచేయ‌డంలోనూ, ఆఖ‌రికి పిల్లల్ని క‌న‌డంలోనూ వారే గ్రేట్‌. ఇక శృంగార సామ‌ర్థ్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇదంతా స‌రే. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… ఏమీ లేదండీ.. మీకు డిల్డో (dildo) అంటే తెలుసా..? అదే సెక్స్ టాయ్‌. స్త్రీ, పురుషులు త‌మ శృంగార కోర్కెల‌ను తీర్చుకునేందుకు వాడుతారు. అవును, అవే. అయితే స్త్రీ, పురుషుల‌కు వారి జ‌ననావ‌య‌వాల‌ను బ‌ట్టి ఆ టాయ్స్ వేర్వేరు ఆకారాల్లో ఉంటాయి. పురుషుల‌కు రౌండ్‌గా ఉంటే, స్త్రీల‌కు నిలువుగా ఆ టాయ్స్ ల‌భిస్తాయి. కేవ‌లం విదేశీయులు మాత్ర‌మే ఒక‌ప్పుడు వీటిని ఉప‌యోగించేవారు, కానీ ఇప్పుడు దాదాపుగా ప్ర‌పంచంలో చాలా దేశాల‌కు చెందిన వారు వాడుతున్నారు. అయితే నిజానికి ఈ టాయ్స్ ఇప్పుడు వ‌చ్చిన‌వి కావు. ఎప్ప‌టి నుంచో ఉన్న‌వే. అంటే.. సుమారుగా 28వేల సంవ‌త్స‌రాల కింద‌టే సెక్స్ టాయ్స్ వాడుక‌లో ఉండేవి. ఏంటీ షాకింగ్ ఉందా..? అయినా మేం చెబుతోంది నిజ‌మే.

జ‌ర్మ‌నీలోని స్వాబియ‌న్ జురా అనే ప‌ర్వ‌త శ్రేణిలో ఉన్న ఓ పురాత‌న గుహ‌లో త‌వ్వ‌కాలు జ‌రిపిన పురాత‌త్వ‌ సైంటిస్టులకు అందులో ఓ పురాత‌న సెక్స్ టాయ్ దొరికింది. దానిపై ప‌రిశోధ‌న‌లు చేసిన సైంటిస్టుల‌కు షాకింగ్ విష‌యం తెలిసింది. ఆ సెక్స్ టాయ్ సుమారుగా 28వేల సంవ‌త్స‌రాల కింద‌టినాటిద‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అంత పురాత‌న కాలం నుంచే సెక్స్ టాయ్‌లు వాడుక‌లో ఉండేవ‌ని సైంటిస్టులు తేల్చేశారు. అయితే సైంటిస్టులు క‌నుగొన్న ఆ పురాత‌న టాయ్ మ‌హిళ‌లు వాడేది. ఎందుకంటే అది అంగం ఆకారంలో ఉంటుంది క‌నుక‌. దాని పొడ‌వు 8 ఇంచులు ఉండ‌గా, వెడ‌ల్పు 3 సెంటీమీట‌ర్లు ఉంది.

ఆ సెక్స్ టాయ్‌ని చాలా దృఢంగా తయారు చేశారు. అందువ‌ల్లే అది ఇన్ని వేల సంవ‌త్స‌రాలు అయినా చెక్కు చెద‌ర‌కుండా ఉంది. దీంతో ఈ సెక్స్ టాయ్ ఇప్పుడు ప్ర‌పంచంలోనే అత్యంత పాత‌దైన‌, పురాత‌న‌మైన సెక్స్ టాయ్‌గా రికార్డుల‌కెక్కింది. అయితే ఇలాంటి టాయ్‌ల‌ను గ్రీకులు వాడేవార‌ట‌. వారు త‌మ కామ కోర్కెల‌ను తీర్చుకోవ‌డానికి అప్ప‌ట్లో ఇలాంటి టాయ్‌ల‌ను వాడిన‌ట్టు సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే మ‌న‌కు తెలిసిన విష‌యం ఏమిటంటే… నిజంగా మ‌నం తురుంల‌ము కాదు, మ‌న పూర్వీకులే. అవును, పైనే చెప్పాం క‌దా..! ఏ విష‌యంలోనైనా వారే గ్రేట్ అని..!

Comments

comments

Share this post

scroll to top