ఆ అమెరికా జంట త‌మ కూతురికి మ‌న దేశంలోని ఓ రాష్ట్రం పేరు పెట్టారు..! అదేమిటో తెలుసా..?

శ్రీ‌శైలం… తిరుప‌తి… యాద‌గిరి..! ఏంటివ‌న్నీ అనుకుంటున్నారా..? అవేనండీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పుణ్య‌క్షేత్రాలు ఇవి. అది స‌రే… ఇంత‌కీ విష‌యం ఏమిటి..? అంటారా..! ఏమీ లేదండీ… సాధార‌ణంగా మ‌న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు అబ్బాయిల‌కు ఈ పుణ్య‌క్షేత్రాల పేర్ల‌ను పెట్టుకుంటారు క‌దా. అయితే ఆ జంట మాత్రం ఏకంగా మ‌న దేశంలోని ఓ రాష్ట్రం పేరునే త‌మ కూతురికి పెట్టుకుంది. ఆ జంట ఇక్క‌డి వారు కాదు, అమెరికాకు చెందిన వారు. అవును, మీరు వింటోంది నిజ‌మే. ఇంత‌కీ ఎవ‌రు వారు..? ఎందుకు త‌మ కూతురికి మ‌న దేశంలోని రాష్ట్రం పేరు పెట్టుకున్నారో తెలుసా..?

వారి పేర్లు చార్లెస్ క్రామ‌ర్‌, బ్రెన్నా మూరే. అమెరికా వాసులు. వీరిద్ద‌రూ ప్రేమికులు. 2006లో భార‌తదేశ ప‌ర్య‌ట‌న‌కు వీరు వ‌చ్చారు. అయితే అప్పుడు వారు తమ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేర‌ళ రాష్ట్రాన్ని సంద‌ర్శించారు. అక్క‌డి ప్ర‌కృతి దృశ్యాలు, సుంద‌ర‌మైన బీచ్‌లు, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, ప‌చ్చ‌ని అందాలు వారికి క‌నువిందు చేశాయి. కేర‌ళ మ‌నోహ‌ర‌త వారిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆ రాష్ట్ర ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు వారిని ఆక‌ర్షించాయి. దీంతో వారు అప్పుడే డిసైడ్ అయ్యారు. త‌మ‌కు పుట్ట‌బోయే మొద‌టి సంతానానికి కేర‌ళ అని పేరు పెట్టుకోవాల‌ని.

ఈ క్ర‌మంలోనే వారికి పెళ్ల‌యి 2009లో కూతురు పుట్టింది. దీంతో వారు ముందు అనుకున్న విధంగానే త‌మ కూతురికి కేరళ అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరుతోనే ఆమెను పిలుచుకుంటున్నారు. ఆ త‌రువాత వారికి మ‌రో పిల్లాడు జ‌న్మించాడు. అత‌నికి జూలియ‌న్ అని పేరు పెట్టారు. కాగా వారు మ‌ళ్లీ ఈ మ‌ధ్య‌నే కేర‌ళ‌కు వ‌చ్చారు. అప్పుడే ఆ పాప‌కు తెలిసింది త‌న‌కు ఆ పేరు ఎందుకు పెట్టారో. ఈ క్రమంలో వారు కేర‌ళ‌లో ఒక నెల రోజుల పాటు గ‌డిపారు. ఆ స‌మ‌యంలో కేర‌ళ పాప ఏం చేసిందో తెలుసా..? ఎంచ‌క్కా మ‌ళ‌యాళం నేర్చుకుంది. అక్ష‌రాలు, గుణింతాలు ఇలా ఆ భాష‌లో ఉండే వాటిని నేర్చుకుంది. కొద్ది కొద్దిగా ఆ పాప రాయ‌గ‌ల‌దు కూడా. ఏది ఏమైనా ఆ దంప‌తులు అలా తమ చిన్నారికి కేర‌ళ అని పెట్ట‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంది క‌దా..! అదీ… ఓ విదేశీ జంట అలా చేయ‌డం ఇంకా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది..!

Comments

comments

Share this post

scroll to top