మ‌న దేశంలో వాడే కొన్ని వ‌స్తువుల‌ను ఇత‌ర దేశాల్లో బ్యాన్ చేశార‌ని తెలుసా..?

ఒక దేశంలో త‌యార‌య్యే ఏ వ‌స్తువైనా, ఆహార ప‌దార్థ‌మైనా ఇత‌ర దేశాల‌కు ఎగుమతి అవుతుంది. అలా అని చెప్పి అన్ని వ‌స్తువులు అలా ఎగుమ‌తి కావు. అలా ఎగుమ‌తి అయ్యేవి ఏవో కొన్ని మాత్ర‌మే ఉంటాయి. అవి కూడా చాలా పేరుగాంచిన వ‌స్తువులు, ఆహార ప‌దార్థాలు అయితేనే ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి అవుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న వ‌ద్ద ల‌భించే బిర్యానీ, హ‌లీం లాంటివ‌న్న‌మాట‌. అయితే మీకు తెలుసా..? మ‌నం ఇష్టంగా తినే కొన్ని ప‌దార్థాలు, ఉప‌యోగించే వ‌స్తువులు కేవ‌లం మ‌న దేశంలో మాత్ర‌మే ల‌భిస్తాయ‌ని.? ఇత‌ర దేశాల్లో అవి నిషేధించ‌బ‌డ్డాయ‌ని..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కింద ఇచ్చిన ప‌లు వ‌స్తువులు విదేశాల్లో నిషేధించ‌బ‌డ్డాయి. కానీ మ‌న దేశంలో మాత్రం వాటిని ఉప‌యోగిస్తూనే ఉన్నాం. అలాంటి వ‌స్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

banned-items-1

లైఫ్‌బాయ్ స‌బ్బు…
లైఫ్‌బాయ్ స‌బ్బును మ‌న‌దేశంలో చాలా మందే వాడుతారు. కానీ మీకు తెలుసా..? అది అమెరికాలో బ్యాన్ అయింది. ఎందుకంటే చ‌ర్మానికి ఆ స‌బ్బు హాని క‌లిగిస్తుంద‌ట‌.

డిస్ప్రిన్ టాబ్లెట్లు…
ఇవి త‌ల‌నొప్పిని త‌గ్గించే ఇంగ్లిష్ మాత్ర‌లు. వీటిని అమెరికా, యూర‌ప్‌ల‌లో నిషేధించారు. ఎందుకంటే ఈ టాబ్లెట్ల‌ను వాడ‌డం వల్ల శ‌రీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గుతుంది. అందుకే వీటిని ప్ర‌పంచ ఆరోగ్య ప్ర‌మాణాల‌కు స‌రిపోయేలా లేవ‌ని వీటిని నిషేధించారు.

స‌మోసా…
సోమాలియా అనే దేశంలో స‌మోసాలపై నిషేధం ఉంది. ఎందుకంటే స‌మోసాల‌ను అక్క‌డి వారు క్రిస్టియన్ వ‌ర్గాల‌కు చెందిన వాటిగా భావిస్తార‌ట‌.

కిండ‌ర్ జాయ్ చాకొలెట్‌…
అమెరికాలో ఈ చాక్లెట్ల‌పై నిషేధం ఉంది. బొమ్మ‌లాంటి ప్లాస్టిక్ వ‌స్తువులో తినే ప‌దార్థం ఉన్నందునే ఈ చాక్లెట్ల‌ను అక్క‌డ నిషేధించార‌ట‌. అవి త‌మ పిల్ల‌ల‌కు హాని క‌లిగిస్తాయ‌ని వారి న‌మ్మ‌కం.

banned-items-2

టాటా నానో కారు…
మ‌న దేశంలో త‌ప్ప చాలా దేశాల్లో ఈ కారును నిషేధించారు. ఎందుకంటే ఈ కారులో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు యాక్సిడెంట్ అయితే పెద్ద ఎత్తున గాయాలు అవుతాయ‌ట‌. అవి చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌. అందుకే ఆయా దేశాల్లో ఈ కారును నిషేధించారు.

మారుతి సుజుకి అల్టో 800…
మ‌న దేశంలో త‌ప్ప దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈ కారును బ్యాన్ చేశారు. సేఫ్టీకి త‌గిన‌ట్టుగా ఈ కారు ఉండ‌ద‌ట‌. అందుకే దీన్ని నిషేధించారు.

రెడ్‌బుల్ డ్రింక్‌…
ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ల‌లో ఈ డ్రింక్‌ను నిషేధించారు. దీన్ని తాగ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు, డిప్రెష‌న్‌, హైప‌ర్ టెన్ష‌న్ వంటి జ‌బ్బులు వ‌స్తున్నాయ‌ట‌. అందుకే దీనిపై నిషేధం విధించారు. లూథియానాలో అయితే 18 ఏళ్ల లోపు వారు దీన్ని తాగ‌కూడ‌దు.

డీకోల్డ్ టోట‌ల్‌…
జ‌లుబు, ద‌గ్గు వంటి అనారోగ్యాల‌కు చాలా మంది ఈ మాత్ర‌ను మ‌న ద‌గ్గ‌ర వేసుకుంటారు. అయితే దీన్ని చాలా దేశాల్లో నిషేధించారు. ఎందుకంటే ఈ టాబ్లెట్‌ను వాడితే కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.

Comments

comments

Share this post

scroll to top