కంప్యూట‌ర్లు, రోబోల‌కు ఇష్ట‌మైన భాష సంస్కృత‌మేన‌ట‌..!

కంప్యూట‌ర్లు, రోబోల‌లో ఉండే ప్రోగ్రామింగ్  లాంగ్వేజ్‌లను ఏ భాష ఆధారంగా రూపొందిస్తారో తెలుసు క‌దా..! అవును, అవి ఇంగ్లిష్ భాష‌ను ఆధారంగా చేసుకుని రూపొందించ‌బ‌డ‌తాయి. అయితే ఆయా ప‌రిక‌రాలు స‌ద‌రు భాష‌ను 0, 1 అని మార్చుకుని త‌మకు అనుగుణంగా యూజ‌ర్ క‌మాండ్ల‌ను అర్థం చేసుకుంటాయి. దాని ప్ర‌కార‌మే అవి ఔట్‌పుట్ ఇస్తాయి. అయితే కంప్యూట‌ర్లు, రోబోల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యే భాష ఇంగ్లిష్ కాద‌ట‌. మ‌న భార‌తీయ భాష సంస్కృత‌మేన‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇది మేం చెబుతోంది కాదు. నాసాకు చెందిన ఓ సైంటిస్టు 1985లలోనే దీనిపై ప‌రిశోధ‌న‌లు చేశారు కూడా. ఇంత‌కీ ఆయ‌న ఏం చెబుతున్నాడంటే…

sanskrit-in-pc

నాసాకు చెందిన రిక్ బ్రిగ్స్ అనే సైంటిస్టు 1985ల‌లోనే కంప్యూట‌ర్లు, రోబోలు సుల‌భంగా అర్థం చేసుకునే భాష‌పై ప్ర‌యోగాలు చేశాడు. అందులో తెలిసిందేమిటంటే… ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భాష‌ల‌న్నింటిలోకెల్లా కేవ‌లం సంస్కృత భాష‌నే కంప్యూట‌ర్లు, రోబోలు సుల‌భంగా అర్థం చేసుకోగ‌ల‌వ‌ట‌. అందులోనే సుల‌భంగా వాక్యాల‌ను త‌యారు చేసుకోగ‌ల‌వ‌ట‌. అలా అని చెప్పి రిక్ బ్రిగ్స్ ఓ ప‌రిశోధ‌నా ప‌త్రాన్ని కూడా అప్ప‌ట్లో విడుద‌ల చేశారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియ‌దు. అయితే ఇప్ప‌టికీ కంప్యూట‌ర్లు, రోబోల‌లో ఇంగ్లిష్ భాషతో రూపొందించిన సాఫ్ట్‌వేర్ల‌నే వాడుతున్నారు లెండి, అది వేరే విష‌యం. మ‌రి సంస్కృత భాష‌తో వాటిని ఎవ‌రు వాడ‌తారో వేచి చూడాలి. ఈ క్ర‌మంలో సంస్కృత భాష‌కు చెందిన ప‌లు ఇత‌ర ఆస‌క్తి క‌ర విష‌యాల‌ను కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

robots-sanskrit

  • 2010లో ఇంగ్లండ్‌లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్‌కు చెందిన సైంటిస్టులు సూర్యుని బాహ్య వాతావ‌ర‌ణంలో ఉన్న సౌండ్ వైబ్రేష‌న్స్‌ను రికార్డ్ చేయ‌ద‌లిచార‌ట‌. అయితే శూన్యంలో ధ్వ‌ని ప్ర‌యాణించ‌దు క‌నుక ఆ సౌండ్‌ను రికార్డ్ చేసేందుకు వారు అత్యంత అధునాత‌న‌మైన శాటిలైట్ ఇమేజింగ్ టూల్స్ వాడార‌ట‌. ఈ క్ర‌మంలో వారు ఆ ప‌రిక‌రాల స‌హాయంతో స‌ద‌రు సౌండ్ వైబ్రేష‌న్స్‌ను రికార్డ్ చేసి వాటిని విన‌గా అందులో ఓం అనే సంస్కృత ప‌దం శ‌బ్దం వినిపించింద‌ట‌. దీన్ని నాసా కూడా ధృవీక‌రించడం విశేషం.
  • సంస్కృత భాష‌ను నిత్యం ఉప‌యోగిస్తుంటే దాంతో మెద‌డుకు మంచి వ్యాయామం జ‌రిగి మెద‌డు చాలా ప‌దునెక్కుతుంద‌ట‌. 1950ల‌లో ఎంఐటీకి చెందిన ఓ ప్రొఫెసర్ దీన్ని నిరూపించారు కూడా.
  • ఉచ్ఛార‌ణ స‌రిగ్గా రానివారు, ప‌దాల‌ను స‌రిగ్గా ప‌ల‌క‌లేని వారు సంస్క‌తాన్ని అభ్య‌సిస్తే దాంతో వారిలో ఆ స‌మ‌స్య పోతుంద‌ట‌.
  • అన్ని భాష‌ల క‌న్నా సంస్కృత భాషను చాలా సుల‌భంగా నేర్చుకోవ‌చ్చ‌ట‌. కానీ చాలా మంది ఆ భాష‌ను క‌ష్టంగా భావిస్తార‌ట‌. అయితే నిజానికి సంస్కృత ప‌దాలు ఎలా ఉంటాయంటే ఒక ప‌ద్యం లేదా పాట పాడినట్టు ల‌య‌బ‌ద్దంగా ఉంటాయ‌ట‌. దీంతో వాటిని నేర్చుకోవ‌డం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌ట‌.
  • వేదాలు, భ‌గ‌వ‌ద్గీత‌, ఉప‌నిష‌త్తులు, రామాయ‌ణం, మ‌హాభారతం, అర్థ‌శాస్త్రం త‌దిత‌ర ప్ర‌ముఖ పురాణాలు, శాస్త్రాల‌న్నీ సంస్కృతంలోనే రాయ‌బ‌డినందున ఆ భాష‌ను నేర్చుకుంటే ఆయా పురాణాలు, శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది.
  • ఆయుర్వేదం, యోగా, ఇండియ‌న్ ఫిలాస‌ఫీ, వేదిక్ మ్యాథ్స్, జ్యోతిష్యం వంటివి కూడా సంస్కృతంలోనే రాయ‌బ‌డ్డాయి. క‌నుక సంస్కృత భాష నేర్చుకుంటే ఆయా అంశాల‌కు చెందిన విషయాల‌ను ఇట్టే గ్ర‌హించ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top