ప్ర‌ధాని మోడీ, కాంగ్రెస్ నాయ‌కురాలు సోనియాల‌ ఆల‌యాలు ఉన్నాయ‌ని తెలుసా..?

భ‌క్తిప‌రులు, ధ‌న‌వంతులు అయిన కొంద‌రు భ‌క్తులు తమ త‌మ ఇష్ట దేవుళ్ల‌కు గుళ్లు క‌ట్ట‌డం మామూలే. మొక్కుకున్నామ‌నో, లేదంటే మొక్కు తీరింద‌నో చెప్పి చాలా మంది దేవుళ్లు, దేవ‌త‌ల‌కు ఆల‌యాలు క‌ట్టిస్తుంటారు. అనంత‌రం ఆయా గుళ్ల‌లో పూజ‌లు కూడా నిర్వ‌హిస్తుంటారు. అయితే దేవుళ్లు, దేవ‌త‌ల‌కు గుళ్లు, గోపురాలు క‌ట్టించ‌డం ఎక్క‌డైనా జ‌రిగే స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. కానీ… కొంద‌రు ఏం చేస్తున్నారంటే త‌మ అభిమాన రాజకీయ నాయ‌కుల‌కు కూడా ఆల‌యాలు క‌డుతున్నారు. అభిమానం కాస్తా భ‌క్తిగా మార‌డంతో వారు తమ నేత‌ల‌కు గుళ్లు క‌డుతూ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు, గుళ్లు క‌ట్టి అంత‌టితో ఆగ‌డం లేదు, వాటిలో నిత్యం పూజ‌లు జ‌రిగేలా చూస్తున్నారు.

modi-temple
మ‌న ప్ర‌ధాని మోడీకి దేశ వ్యాప్తంగా ఎంద‌రు అభిమానులు ఉన్నారో అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ లో నైతే ఆయ‌న‌కు వీరాభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో 350 మంది దాకా గ్రూప్‌గా చేరి రూ.1.65 ల‌క్ష‌ల‌ను జ‌మ చేసి ప్ర‌ధాని మోడీ విగ్ర‌హాన్ని చేయించారు. అనంత‌రం వారే ఓ గుడిని క‌ట్టి అందులో ఆ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ శివారు ప్రాంతంలో మోడీ గుడి ఉంది. అయితే గుడి క‌ట్ట‌కముందు ఆయ‌న్ను అక్క‌డ చిత్ర‌ప‌టం రూపంలో పూజించేవార‌ట‌. అనంత‌రం గుడి వ‌చ్చింది క‌నుక‌, అందులో నిత్యం ఆ విగ్ర‌హానికి అభిషేకాలు, పూజ‌లు చేస్తూ మోడీని కొలుస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యం మోడీకి కూడా తెలిసింద‌ట‌. అయితే అలా త‌న‌కు గుడి క‌ట్టి పూజించ‌డం న‌చ్చ‌ద‌ని చెప్ప‌డంతో ఆ గుడిని తీసేశారు.

sonia-temple
ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకైతే అప్ప‌ట్లో రెండు గుళ్లు క‌ట్టించారు. ఒక‌టి మాజీ మంత్రి శంక‌ర్రావు క‌ట్టించారు. అందుకు ఆయ‌న కృష్ణా జిల్లా దాకా వెళ్లి తెలంగాణ త‌ల్లి రూపంలో సోనియా విగ్ర‌హాన్ని చేయించి దాన్ని క‌రీంన‌గ‌ర్‌లో ప్ర‌తిష్ఠించారు. ఇంకో విగ్ర‌హాన్ని కూడా క‌రీంన‌గ‌ర్‌లోనే స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌ట్టించారు. కానీ వాటి గురించి సోనియా గాంధీకి తెలిసి ఉంటుందో లేదో. అది ఇప్ప‌టి ముచ్చ‌ట కాదు క‌దా. ఎప్పుడో ఆ గుళ్ల‌ను క‌ట్టించారు. మ‌రి అవి ఇప్పుడు ఏమ‌య్యాయో, అస‌లు ఉన్నాయో లేదా కూడా తెలియ‌దు. ఏది ఏమైనా, అభిమానం భ‌క్తిగా మారితే దానికి ప‌రాకాష్ట ఇలాగే ఉంటుంది క‌దా… అది రాజ‌కీయ నాయ‌కులు కావ‌చ్చు, సినిమా యాక్ట‌ర్లు కావ‌చ్చు… ఇంకెవ‌రైనా కావ‌చ్చు… అభిమానులు త‌లుచుకుంటే సాధ్యం కానిదంటూ ఉండ‌దు క‌దా. అన్న‌ట్టు, ఇంకో విష‌యం… మొన్నా మ‌ధ్య మృతి చెందిన దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత కు కూడా ఆమె అభిమానులు గుడి క‌ట్టిన‌ట్టు తెలిసింది. అయితే అది ఈ మ‌ధ్య క‌ట్టింది కాదు, ఆమె బ‌తికి ఉన్న‌ప్పుడే ఈ ఏడాది మార్చిలో క‌ట్టార‌ట‌. ఆ టెంపుల్‌కు అమ్మ ఆల‌యం అని పేరు పెట్టారు. త‌మిళ‌నాడులోని వెల్లూర్‌లో ఆ గుడి ఉంది. దానికి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్టు స‌మాచారం.

Comments

comments

Share this post

scroll to top