పిన్ పంచ్‌ (స్టాప్ లర్ ) ను ఇప్పటి వరకు తప్పుగా వాడారని మీకు తెలుసా? ఇదిగో ఇది అసలు వాడే విధానం.

ఉదయం నిద్ర లేచిన ద‌గ్గ‌ర్నుంచి రాత్రి మ‌ళ్లీ నిద్ర‌పోయే వ‌ర‌కు మ‌నం చాలా ప‌నులు చేస్తుంటాం. కొన్ని కొత్త‌గా చేసే ప‌నులైతే, కొన్ని నిత్యం చేసేవే ఉంటాయి. అయితే ఎవ‌రు ఏ ప‌ని చేసినా కాస్త అటు, ఇటుగా ఒకేలా చేస్తారు. కానీ మీకు తెలుసా..? మీరు త‌ర‌చూ చేసే కొన్ని ప‌నుల‌ను అనుకోకుండా, తెలియ‌కుండానే త‌ప్పుగా చేస్తున్నార‌ని..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ క్ర‌మంలో అలాంటి ప‌నుల్లో త‌ప్పుగా చేస్తున్న ఒక ప‌ని గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. అదేనండీ, పిన్ పంచ్ (స్టాప్ల‌ర్) వాడ‌కం. అదేంటీ, దాన్ని ఎవ‌రైనా ఒకే విధంగా, ఒకే ప‌ని కోసం ఉప‌యోగిస్తారు క‌దా, అందులో విచిత్రం, వెరైటీ ఏముంటుందీ, అని అడ‌గ‌బోతున్నారా..? అవును, మీరు అడుగుతోంది క‌రెక్టే. కానీ చాలా మంది దాన్ని త‌ప్పుగా ఉప‌యోగిస్తార‌ట‌. మ‌రి క‌రెక్ట్‌గా ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

pin-punch

పైన ఇచ్చిన బొమ్మ‌ను చూశారుగా. మీరు ఎప్పుడైనా పిన్ పంచ్‌ను వాడిన‌ప్పుడు అలా వాడారా..? లేదు క‌దా..! కానీ పైన ఇచ్చిన విధంగానే పిన్ పంచ్‌ను వాడాల్సి ఉంటుంది. పేప‌ర్‌కు పంచ్‌ను క్లిప్ చేసి దానిపై బొట‌న వేలితో పిన్‌ను పంచ్ చేయాలి. ఈ క్ర‌మంలో పిన్ పంచ్ అయిన‌ట్టుగా క్రాకింగ్ సౌండ్ వ‌స్తుంది. అదే స‌రైన పంచ్‌కి గుర్తు. కింద ఇచ్చిన బొమ్మ‌ను చూస్తే పిన్ పంచ్‌లో ఉండే భాగాల గురించి తెలుస్తుంది.

crimp-area

crimp-size

పై బొమ్మ‌లో క్రింప్‌ ఏరియాను చూశారుగా..! సాధార‌ణంగా చిన్నగా ఉండే పిన్ పంచ్‌ల‌కు క్రింప్ ఏరియాలో ఒకే సైజ్ గ‌ల పిన్‌ల‌ను పంచ్ చేసుకునే ప్ర‌దేశం మాత్ర‌మే ఉంటుంది. కానీ పెద్ద వాటిలో రెండు సైజ్‌ల‌తో కూడిన క్రింప్ ఏరియాలు ఉంటాయి. వాటిలో మ‌న‌కు న‌చ్చిన సైజ్‌ను ఎంచుకుని, అందుకు త‌గిన విధంగా పిన్‌ల‌ను పెట్టి పంచ్ చేసుకోవ‌చ్చు. ఇలాంటి పిన్ పంచ్‌లు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి.

కింది వీడియో చూస్తే స్టాప్ల‌ర్‌ను మ‌రింత బాగా ఎలా ఉప‌యోగించుకోవ‌చ్చో తెలుస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top