ఇత‌నో వెరైటీ ఫొటోగ్రాఫ‌ర్‌.. నూత‌న దంప‌తుల‌ను ఎలా ఫొటో తీశాడో తెలుసా..?

ఎవ‌రైనా చేసే ఏ ప‌నిలోనైనా నిబ‌ద్ధ‌త ఉండాలి. ప‌నిప‌ట్ల అంకిత భావం ఉండాలి. దీనికి తోడు శ్ర‌మించాలి. ఇవి ఉంటే ఎవ‌రైనా తాము చేసే ప‌నిలో నైపుణ్య‌త‌ను సాధిస్తారు. అలాగే ప‌నిచేసేట‌ప్పుడు అందులో కొంత వైవిధ్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తే ఎవ‌రైనా న‌లుగురిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. కేర‌ళ‌కు చెందిన ఆ ఫొటోగ్రాఫ‌ర్ కూడా అదే చేశాడు. రొటీన్‌గా నూత‌న దంప‌తుల‌ను నిల‌బెట్టి వివిధ భంగిమ‌ల్లో ఫొటోలు ఎవ‌రైనా తీస్తారు. కానీ అలా తీస్తే రొటీన్‌. పెద్ద తేడా ఏముంటుంది. అందుక‌ని ఓ పెళ్లి జంట‌ను అత‌ను వెరైటీగా ఫొటో తీశాడు. దీంతో ఇప్పుడ‌త‌ని వీడియో నెట్ లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

కేర‌ళ‌లోని త్రిసూర్‌కు చెందిన విష్ణు అనే అత‌ను ఫోటోగ్రాఫ‌ర్‌. ఇత‌ను కొంత మంది మిత్రులు క‌లిసి వైట్‌ర్యాంప్ అనే గ్రూప్ పెట్టి దాని ద్వారా పెళ్ల‌యిన నూత‌న దంప‌తుల ఫొటోలు తీస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు అలా విష్ణు అనేక క‌పుల్స్ ఫొటోలు తీశాడు. కానీ ఎప్పుడూ తీసిన‌ట్టుగా తీస్తే వెరైటీ ఏముంటుంద‌ని భావించిన అత‌ను, ఈ సారి ఓ కొత్త జంట‌ను వెరైటీగా ఫొటో తీశాడు. ఏప్రిల్ 15వ తేదీన పెళ్లి చేసుకున్న ఓ జంట‌కు అత‌ను ఫొటో తీశాడు. వారి పెళ్లి అయ్యాక మండ‌పం స‌మీపంలో ఉన్న గార్డెన్‌లోని ఓ చెట్టు ఎక్కాడు. అనంత‌రం త‌ల‌కిందులుగా వేలాడుతూ టాప్ యాంగిల్‌లో ఆ నూత‌న జంట‌ను ఫొటో తీశాడు. అది అద్భుతంగా వ‌చ్చింది.

అయితే విష్ణు అలా ఫొటో తీయ‌డం ఏమోగానీ ఆ స‌మ‌యంలో అత‌న్ని అత‌ని స్నేహితులు వీడియో తీశారు. అనంత‌రం దాన్ని వారు త‌మ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. త‌రువాత కొన్ని గంట‌ల్లోనే సోష‌ల్ మీడియా మొత్తం ఆ వీడియో వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలో అలా ఓ క‌పుల్ ను వెరైటీగా ఫొటో తీసినందుకు సాటి ఫొటోగ్రాఫ‌ర్లే కాదు, అనేక మంది విష్ణును అభినందిస్తున్నారు. వ‌ర్క్ ప‌ట్ల అంకిత భావం అంటే.. ఇలా ఉండాలి అని అంద‌రూ అత‌న్ని తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి ఫొటోలు గ‌తంలో ఒక‌టి రెండు సార్లు తీశాడ‌ట‌. కానీ ఇప్పుడు తీసిన ఫొటోయే చాలా బాగా వ‌చ్చింద‌ని అత‌ను చెబుతున్నాడు. అవును మ‌రి, బాగా రాబ‌ట్టే క‌దా. అది వైర‌ల్ అయింది. ఏది ఏమైనా నూత‌న దంప‌తుల‌ను ఫొటో తీసేందుకు విష్ణు చేసిన ఆ ఫీట్‌ను మ‌న‌మంద‌రం అభినందించాల్సిందే క‌దా..!

 

Comments

comments

Share this post

scroll to top