ఈ గుర్తులు వాడుక‌లోకి ఎలా వ‌చ్చాయో మీకు తెలుసా..?

నిత్య జీవితంలో మ‌నం అనేక సంద‌ర్భాల్లో ప‌లు ర‌కాల గుర్తులు, చిహ్నాలు చూస్తుంటాం. ఎప్ప‌టి నుంచో ఆ గుర్తులు వాడుక‌లో ఉన్నా మ‌నం వాటి గురించి ఎప్పుడూ ఆలోచించ‌లేదు క‌దా. వాటిని ఉప‌యోగించుకుంటూ, అలా ప‌నిచేస్తూ పోతున్నాం. కానీ… ఆయా గుర్తులు, చిహ్నాలు రావ‌డానికి వెనుక కొన్ని కార‌ణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో అసలు ఆ గుర్తులు ఏమిటో, అవి ఎలా వాడుక‌లోకి వ‌చ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

symbol-meanings-1

అండ్ సింబ‌ల్‌…
దీన్ని యాంప‌ర్‌సండ్ (Ampersand) అంటారు. ఇది లాటిన్ అక్ష‌రాల నుంచి వ‌చ్చింది. ఒక‌ప్పుడు e t అనే రెండు అక్ష‌రాల‌ను క‌లిపి రాసేవారు. దీనికి ఆంగ్లంలో and అనే అర్థం వ‌స్తుంది. అయితే రెండు అక్ష‌రాలు ఉంటే రాయ‌డం ఆల‌స్యం అవుతుంది కాబ‌ట్టి, వాటిని క‌లిపి & అనే ఓ సింబ‌ల్ ను క్రియేట్ చేశారు. అనంత‌రం దాన్నే వాడుతూ వ‌స్తున్నారు. క్ర‌మంగా అది అమెరికా, యూర‌ప్‌తోపాటు ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించి వాడుక‌లోకి వ‌చ్చింది. ఇప్ప‌టికీ చాలా దేశాల్లో and కు బ‌దులుగా కొన్ని సార్లు & సింబ‌ల్‌నే వాడుతున్నారు.

ల‌వ్‌ సింబ‌ల్‌…
ల‌వ్ సింబ‌ల్ అన‌గానే మ‌న‌కు హృదయాకారంలో ఉండే గుర్తు గుర్తుకు వ‌స్తుంది. కానీ గుండె ఉండే షేప్ ఆధారంగా ల‌వ్ సింబ‌ల్ రాలేదు. అందుకు కొన్ని కార‌ణాలు చెబుతారు. హంస‌లు ప్రేమ‌కు, న‌మ్మ‌కానికి, ఆప్యాయ‌త‌కు ప్ర‌తీక‌లు. అవి రెండు ఎదురెదురుగా వ‌చ్చి ముద్దాడుకుంటుంటే వాటి మెడ‌ల మ‌ధ్య ల‌వ్ షేప్ వ‌స్తుంది. అందుకే ప్రేమ సింబ‌ల్‌కు ఆ షేప్ వ‌చ్చింద‌ని చెబుతారు. అదేవిధంగా స్త్రీల‌లో వెన్నెముక చివ‌రి భాగంలో ఉండే పెల్విస్ అనే ప్రాంత ఆకారం కూడా ల‌వ్ షేప్‌లో ఉంటుంద‌ట‌. అందుకే దానికి ఆ షేప్ వ‌చ్చింద‌ట‌. గ్రీకులు ఐవీ అనే ఓ మొక్క‌కు చెందిన ఆకుల ఆధారంగా ల‌వ్ షేప్‌ను త‌యారు చేశార‌ట‌. ఆ ఆకులు కూడా ఇప్ప‌టి ల‌వ్ షేప్‌లో ఉంటాయ‌ట‌.

బ్లూటూత్ గుర్తు…
రెండు డివైస్‌ల‌ను పెయిర్ చేయ‌డానికి మ‌నం బ్లూటూత్ వాడుతాం క‌దా. దానికి ఆ సింబ‌ల్ ఎలా వ‌చ్చిందంటే… Harald Blåtand అనే ఓ రాజుకు బ్లూబెర్రీలంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అయితే అత‌నికి ఓ ప‌న్నుకు నీలి రంగు ప‌ర్మినెంట్‌గా ఫిక్స్ అవుతుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే Hagall, Bjarkan అనే రెండు ప‌దాల‌కు లాటిన్ రూపాలైన రెండు సింబ‌ల్స్‌ను క‌లిపి బ్లూటూత్ గుర్తు త‌యారు చేశారు.

symbol-meanings-3

మెడిక‌ల్ సింబ‌ల్‌…
మెడిక‌ల్ సింబ‌ల్ వాడుక‌లోకి రావ‌డానికి క‌రెక్ట్‌గా కార‌ణాలు ఏవీ తెలియ‌వు. కానీ… గ్రీకుల ప్ర‌కార‌మైతే, వారి దేవుడు హెర్మెస్ ఓ మ్యాజిక‌ల్ చేతిక‌ర్ర‌ను క‌లిగి ఉండేవాడ‌ట‌. మెడిక‌ల్ సింబ‌ల్‌లో మ‌ధ్య‌లో ఉన్న క‌ర్ర‌ను పోలిన క‌ర్ర‌నే అత‌ను కలిగి ఉండేవాడ‌ట‌. అయితే ఆ క‌ర్ర‌కు చుట్టుకుని ఉన్న రెండు పాములు, పైన ప‌క్షి రెక్క‌లు మాత్రం ఎలా వ‌చ్చాయో తెలియ‌దు. కానీ వాటి అర్థం ఏమిటంటే… శ‌త్రువుల‌ను ఎదుర్కొని వారిని క‌ట్ట‌డి చేయ‌డం… అంటే మ‌న వైద్యులు వ్యాధుల‌ను ఎదుర్కొని వాటిని క‌ట్ట‌డి చేస్తారు క‌దా, అలా అన్న‌మాట‌. అందుకే ఆ గుర్తు మెడిక‌ల్ సింబ‌ల్‌గా వ‌చ్చింద‌ని చెబుతారు.

ప‌వ‌ర్ సింబ‌ల్‌…
1940ల‌లో ఇంజినీర్లు స్విచ్‌ల‌ను చెప్ప‌డం కోసం సింబాలిక్‌గా 1, 0 అనే గుర్తుల‌ను వాడేవారు. అయితే త‌ద‌నంత‌ర కాలంలో ప‌వ‌ర్ ఆన్, ఆఫ్ కు కూడా అవే గుర్తుల‌ను వాడ‌డం మొద‌లు పెట్టారు. ఆ క్ర‌మంలో అవి రెండూ క‌లిసి ప‌వ‌ర్ సింబ‌ల్ త‌యారైంది.

ఓకే గుర్తు…
ఓకే గుర్తు వాడుక‌లోకి రావ‌డానికి 3 కార‌ణాలు చెబుతారు. అవేమిటంటే… అమెరికా అధ్య‌క్షుడు మార్టిన్ వాన్ బురెన్ న్యూయార్క్‌లో ఓల్డ్ కిండ‌ర్‌హుక్ అనే ప్రాంతంలో ఉంటార‌ట‌. అయితే ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో తన ఊరి పేరును ఆ పదంలోని రెండు అక్ష‌రాల‌ను (ఓ, కే) క‌లిపి రాశార‌ట‌. అప్ప‌టి నుంచి ఓకే సింబ‌ల్ వాడుతూ వ‌స్తున్నార‌ట‌. అలాగే అమెరికా 7వ అధ్య‌క్షుడు ఆండ్రూ జాక్స‌న్ త‌న నిర్ణ‌యాల‌ను ఫైన‌లైజ్ చేసేట‌ప్పుడు ఓకే సింబ‌ల్ వాడేవార‌ట‌. ఇక హిందూయిజం, బుద్ధిజంల‌లో ఓకే గుర్తు ముద్ర‌ను సూచిస్తుంది. ధ్యానంలో ఉన్న‌వారు ఈ ముద్రను ఎక్కువ‌గా వాడుతారు.

పీస్ సింబ‌ల్‌…
1958ల‌లో అణు ఆయుధాల‌ను వాడ‌కూడ‌ద‌ని చెబుతూ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టార‌ట‌. అయితే ఆ సంద‌ర్భంగా వారు ఎన్‌, డి అనే అక్ష‌రాల‌ను వాడేవార‌ట‌. ఎన్, డి అంటే Nuclear Disarmament అనే అర్థం వ‌స్తుంది. అందుకే ఆ సింబ‌ల్ కూడా వ‌చ్చింది. దాన్ని పీస్ సింబ‌ల్‌గా వాడుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top