ఫొటోగ్రాఫ‌ర్ కాలుపై నుంచి వెళ్లిన షారూక్ ఖాన్ కారు… ఆయ‌న ఎలా స్పందించాండంటే..!

బ‌డాబాబులు, ధ‌న‌వంతులు ఎవ‌రైనా సామాన్య ప్ర‌జ‌ల‌కు యాక్సిడెంట్ చేశార‌నుకోండి..! అప్పుడేం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు. సాధార‌ణంగా అలాంటి ప‌రిస్థితుల్లో వారు ప‌ట్టించుకోకుండా వెళ్లిపోతారు. ట్రీట్‌మెంట్ మాట దేవుడెరుగు. క‌నీసం బాధితుల‌కు ఎలా ఉందో అని కూడా చూడ‌రు. అయితే బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ మాత్రం అలా కాదు. తాను ఎంత గొప్ప స్థానంలో ఉన్నా, ఫేమ‌స్ స్టార్‌గా వెలుగొందుతున్నా త‌న వ‌ల్ల ఒకరికి ప్ర‌మాదం జ‌రిగిందని తెలిసి వెంట‌నే స్పందించాడు. బాధితుడికి అన్ని విధాలా సాయం చేశాడు. ఇంత‌కీ జ‌రిగిందేమిటంటే…


మీకు ఆలియా భ‌ట్ తెలుసు క‌దా. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి. మొన్నా మ‌ధ్యే ఈవిడ న‌టించిన సినిమా రిలీజైంది. అదేనండీ… బ‌ద్రీనాథ్ కీ దుల్హ‌నియా. అయితే ఈ మ‌ధ్యే ఆమె బ‌ర్త్ డే కూడా అయింది. మొన్న‌నే ఆమె త‌న 24వ బ‌ర్త్‌డేను జ‌రుపుకుంది. ఆ సంద‌ర్భంగా చాలా మంది న‌టుల‌కు, వీఐపీల‌కు ఆమె ఆహ్వానం పంపింది. అందులో షారూక్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆలియా భ‌ట్ ఇచ్చిన విందుకు హాజ‌ర‌య్యారు. అయితే పార్టీ లొకేష‌న్ వ‌ద్ద ఆయ‌న్ను ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫ‌ర్లంద‌రూ ఎగ‌బడ్డారు. దీంతో చిన్న‌పాటి తోపులాట అయింది. అందులో ఓ ఫొటోగ్రాఫ‌ర్ అప్పుడే ఎదురుగా వ‌స్తున్న షారుక్ కార్ కింద ప‌డ్డాడు.


అయితే దుర‌దృష్టంలో అదృష్ట‌మో ఏమో గానీ ఆ ఫొటోగ్రాఫ‌ర్ ఓ కాలు మీద నుంచి షారుక్ కార్ వెళ్లింది. దీంతో అతను తీవ్ర గాయాల‌కు గుర‌య్యాడు. జ‌రిగిన విష‌యం తెలుసుకున్న షారూక్ వెంట‌నే స్పందించాడు. త‌న సొంత కారులో ఆ ఫోటోగ్రాఫ‌ర్‌ను తీసుకెళ్లి ద‌గ్గ‌ర్లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేర్పించాడు. అత‌నికి వైద్యం కోసం ఖ‌ర్చు భ‌రిండ‌మే కాదు, చికిత్స అందించేందుకు త‌న ప‌ర్స‌న‌ల్ వైద్యుల‌ను కూడా షారూక్ పిలిపించాడు. ఆ ఫొటోగ్రాఫ‌ర్ గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, అంతా బాగానే ఉంద‌ని, త్వ‌ర‌లోనే కోలుకుంటాడ‌ని, అత‌నికి కావ‌ల్సిన స‌హాయ‌మంత‌టినీ అందిస్తాన‌ని షారూక్ అత‌ని కుటుంబానికి హామీ ఇచ్చాడు. అదీ… బాలీవుడ్ స్టార్ షారూక్ స‌హృద‌యానికి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం..!

Comments

comments

Share this post

scroll to top