మామా కోడ‌లు అయిన నాగార్జున, స‌మంత‌ల మధ్య సాగిన వాట్సాప్ సంభాష‌ణ‌.. ఏంటో తెలుసా..?

అక్కినేని నాగ‌చైత‌న్య కొత్త సినిమా రారండోయ్ వేడుక చూద్దాం ట్రైల‌ర్ ఈ మ‌ధ్యే విడుద‌లైన విష‌యం విదిత‌మే. కాగా అందులో వ‌చ్చిన అమ్మాయి మనశ్శాంతికి హానికరం అనే ఓ డైలాగ్‌కు ఆడియ‌న్స్ నుంచి విశేష రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ట్రైల‌ర్‌ను కూడా ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది వీక్షించారు. అయితే అలా వీక్షించిన వారిలో అక్కినేని నాగ‌చైత‌న్య‌కు కాబోయే భార్య స‌మంత కూడా ఉందండోయ్‌..! అవును. అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ… ఈ సినిమా ట్రైల‌ర్‌ను వీక్షించిన స‌మంత ఎలా స్పందించిందో తెలుసా..? అది కూడా త‌న‌కు కాబోయే మామ‌గారైన అక్కినేని నాగార్జున‌తో..! ఆ విష‌యం ఏంటో మీరే చ‌దివి తెలుసుకోండి..!

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ట్రైల‌ర్‌ను అక్కినేని నాగ చైత‌న్య ఫియాన్సీ స‌మంత మాత్ర‌మే కాదు, అత‌ని తండ్రి నాగార్జున కూడా చూశారు. ఈ క్ర‌మంలో నాగార్జున‌, స‌మంత (మామా కోడ‌లు) మ‌ధ్య వాట్సాప్‌లో చిన్న‌పాటి సంభాషణ జ‌రిగింది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడీ న్యూస్ నెట్‌లో ట్రెండింగ్ గా మారింది. ఇంత‌కీ ఆ సంభాష‌ణ‌లో ఏముందో మీరే ఫొటోలో చూడండి..!

నాగార్జున క‌ంగ్రాట్స్ కోడ‌లా అన‌గా అందుకు స‌మంత ల‌వ్ సింబ‌ల్ పంపింది. వెంట‌నే ఆమే ప‌లు మెసేజ్‌ల‌ను పోస్ట్ చేసింది. ఐ ల‌వ్ ద ట్రెయిల‌ర్‌, ల‌వ్ మామా… ఇట్స్ ఆల్ వ‌ర్కింగ్‌, హి ఈజ్ లుకింగ్ సూప‌ర్ అండ్ ఎవ్రీథింగ్ వ‌ర్క్స్‌, ఐయామ్ సో హ్యాపీ, థాంక్ యూ… ఇదిగో ఇలా ఆమె మెసేజ్‌లు పెట్టింది. మీరూ చూశారుగా. దీంతో ఆ పోస్ట్ సంభాష‌ణ‌ను నాగార్జున షేర్ చేశారు. నిజంగా… ఆ చాటింగ్ ఫ‌న్నీగా ఉంది క‌దా… దీని గురించే నెట్‌లో ఇప్పుడు వార్త‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఇక ముందు ముందు ఇలాంటి ఫ‌న్నీ మెసేజ్‌లు వారు ఎన్ని పెడ‌తారో వేచి చూడాలి. అవును, అన్న‌ట్టు నాగార్జున చేస్తున్న సినిమా మీకు తెలుసు క‌దా. రాజు గారి గ‌ది 2 అని. అవును. మ‌రి దాని ట్రైల‌ర్ ఎప్పుడు వ‌స్తుందో, అప్పుడు స‌మంత ఎలాంటి కామెంట్లు చేస్తుందో చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top