అప్పుడు ఈమెను హాస్పిట‌ల్ లో చేర్పించ‌డానికి క్రేన్ వాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక నెల‌లోనే 120 కిలోల బ‌రువు త‌గ్గింది.!

దాదాపుగా 500 కిలోల బ‌రువుతో 25 ఏళ్లుగా ఎటూ వెళ్ల‌కుండా ఇంట్లోనే ఉండి, ఈ మ‌ధ్యే చికిత్స కోసం ఈజిప్టు భార‌త్‌కు వ‌చ్చిన ఈమ‌న్ అహ్మ‌ద్ గుర్తుంది క‌దా..! వ‌య‌స్సు 36 సంవ‌త్స‌రాలు అయినా 500 కిలోల బ‌రువుతో ప్ర‌పంచంలోనే అత్యంత అధిక బ‌రువు గ‌ల మ‌హిళగా ఈమ‌న్ పేరుగాంచింది. అయితే ఈమె గ‌త నెల ఫిబ్ర‌వ‌రి 12వ తేదీన ముంబైకి చేరుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆమెను ప్రత్యేక‌మైన క్రేన్ ద్వారా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె బరువును త‌గ్గించ‌డం కోసం ఓ హాస్పిట‌ల్‌కు చెందిన వైద్య బృందం కూడా ప‌నిచేస్తోంది. కాగా ఇప్పుడు ఈమ‌న్ ఎంత బరువు తగ్గిందో తెలుసా..? 120 కిలోలు త‌గ్గి 380కి చేరుకుంది. అది కూడా ఒక్క నెల‌లోనే..!

eman-ahmed

ఈమ‌న్‌కు వైద్యులు laparoscopic sleeve gastrectomy (LSG) స‌ర్జ‌రీ చేశారు. అనంత‌రం ఆమెకు కేవ‌లం ద్ర‌వాహారం మాత్ర‌మే ఇస్తూ వ‌చ్చారు. దీంతో ఆమె కేవ‌లం నెల‌లోనే 120 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గి 380 కిలోల‌కు చేరుకుంది. ఇక్క‌డి నుంచి ఆమె బ‌రువును 200 కిలోల‌కు తెచ్చేందుకు వైద్యులు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే అందుకు గాను మ‌రో 6 నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు. ఈ ఆరు నెల‌ల పాటు ఈమ‌న్‌కు ద్ర‌వాహారం మాత్ర‌మే ఇవ్వ‌నున్నారు.

eman2

ఇప్ప‌టికే ఈమ‌న్ టైప్ 2 డ‌యాబెటిస్, హైప‌ర్ టెన్ష‌న్‌, హైపో థైరాయిడిజం, శ్వాస కోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోంది. దీనికి తోడు ఆమెకు కుడి చేయి, కాలుకి ప‌క్ష‌వాతం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆమె అధిక బ‌రువు త‌గ్గ‌డం స‌వాల్‌గా మారింది. అయినా వైద్యులు క‌చ్చితంగా బ‌రువు తగ్గిస్తామ‌ని చెబుతున్నారు. అయితే అందుకు మ‌రి కొంత కాలం ప‌డుతుంద‌ని వారు అంటున్నారు. ఇక ఈమ‌న్ సాధార‌ణ బ‌రువుకు చేరుకునే వ‌ర‌కు వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top