శరీరంలో పేరుకు పోయిన విష పదార్థాలను తొలగించుకోవాలన్నా, మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వాలన్నా, శరీరంలో వివిధ రకాల జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా మనం నిత్యం తగిన మోతాదులో నీటిని తాగడం ఎంతో అవసరం. నీటిని తాగకపోతే మనం అనేక అనారోగ్యాల బారిన పడుతామన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అసలు ఎంత బరువున్న వ్యక్తి రోజుకి ఎన్ని లీటర్ల నీటిని తాగితే మంచిదో ఇప్పుడు చూద్దాం.
- 45 కిలోలు బరువున్న వారు నిత్యం కనీసం 1.9 లీటర్ల నీటిని తాగాలి. అదే 50 కిలోల బరువున్న వారైతే 2.1 లీటర్ల వరకు నీటిని తాగాలి.
- 55 కిలోలు ఉన్నవారు 2.3 లీటర్లు, 60 కిలోలు ఉన్న వారు 2.5 లీటర్ల నీటిని తీసుకోవాలి.
- 65 కిలోలు ఉన్నవారు 2.7 లీటర్లు, 70 కిలోలు ఉన్న వారు 2.9 లీటర్ల నీటిని తాగాలి.
- 75 కిలోలు ఉన్నవారు 3.2 లీటర్లు, 80 కిలోలు ఉన్న వారు 3.5 లీటర్ల నీటిని తాగాలి.
- 85 కిలోలు ఉన్న వారు 3.7 లీటర్లను, 90 కిలోలు ఉన్న వారు 3.9 లీటర్ల నీటిని తాగాలి.
- 95 కిలోల బరువు ఉన్నవారు నిత్యం 4.1 లీటర్ల నీటిని తాగాలి. అదే 100 కిలోలు ఆ పైన బరువు ఉన్న వారు 4.3 నుంచి 5 లీటర్ల వరకు నీటిని తాగాలి.పైన చెప్పిన విధంగా ఆయా బరువులు ఉన్న వ్యక్తులు అందుకు తగిన విధంగా నీటిని తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు.