రాత్రికే రాత్రే స్టార్ అయిన “ప్రియా ప్రకాష్”…ఒక సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ అడుగుతుందో తెలుసా.?

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. గ‌త కొద్ది రోజుల క్రితం నుంచి ఎక్క‌డ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో అయితే ఈమె గురించిన అనేక వార్త‌లు పుంఖాను పుంఖాలుగా వ‌స్తూనే ఉన్నాయి. కేవ‌లం ఒక కంటి చూపుతో ఈమె కుర్ర‌కారు మ‌దిని దోచేయ‌డ‌మే కాదు, అటు సినీ ప్రపంచాన్ని, మ‌రో వైపు కార్పొరేట్ కంపెనీల చూపును కూడా ప్రియా త‌న వైపుకు తిప్పుకుంది. దీంతో ఇప్పుడు ఈమెకు ఆఫ‌ర్లు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు, ప‌లు కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు కూడా ఈమెకు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

అయితే ప్రియా ప్ర‌కాష్‌కు వ‌స్తున్న ఆఫ‌ర్ల మాటేమోగానీ ఇప్పుడు ఈమె సినిమాల్లో న‌టించేందుకు ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా..? వింటే షాక‌వుతారు. అక్ష‌రాలా రూ.2 కోట్ల‌ను ఈమె డిమాండ్ చేస్తోంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. టాలీవుడ్ ఫేమ‌స్ హీరో నిఖిల్ త‌న కొత్త సినిమాలో ప్రియా ప్ర‌కాష్‌ను తీసుకునేందుకు ఆస‌క్తి చూపాడ‌ట‌. దీంతో ఈ అమ్మ‌డు అంత మొత్తాన్ని డిమాండ్ చేసింద‌ని టాక్ వినిపిస్తోంది.

ఇక ప్రియా ప్ర‌కాష్ నిఖిల్ సినిమాలో న‌టిస్తుందో లేదో తెలియ‌దు కానీ.. ఈమెకు ప్రింగిల్స్‌, వ‌న్‌ప్ల‌స్ అనే కంపెనీల నుంచి ఇప్ప‌టికే ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ట‌. ఈ కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌మ‌ని, త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేయ‌మ‌ని ఈ కంపెనీలు ప్రియాతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయ‌ట‌. ఏది ఏమైనా ప్రియా త‌న మొద‌టి సినిమా అయిన ఒరు అదార్ ల‌వ్ విడుద‌ల కాక‌ముందే ఈమె ఫేట్ ఎలా మారిపోయిందో చూశారా. సాధార‌ణంగా ఓ 10 సినిమాలు చేశాక‌, అవి మంచి స‌క్సెస్ అయితే గానీ ఏ హీరోయిన్‌కు కూడా అంత‌టి పేరు రాదు. కానీ ప్రియాకు మాత్రం త‌న మొద‌టి సినిమా విడుద‌ల కాక‌ముందే ఇంత‌టి పేరు, క్రేజ్ వ‌చ్చింది. నిజంగా ల‌క్ అంటే ఈమెదే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top