భారత క్రికెట్ ఆటగాళ్లు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా..?

నేటి తరుణంలో చదువు ఎంత ఆవశ్యకమో అందరికీ తెలిసిందే. ఏ రంగంలో రాణించాలన్నా, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నా విద్య అత్యంత కీలకమైంది. అయితే అసలు ఎలాంటి విద్యార్హతలు లేని వారితోపాటు సాధారణ స్థాయి స్కూల్, కాలేజ్ వరకు చదువుకున్న వారు కూడా నేడు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటి వారిలో మన భారత క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్లలో అసలు ఎవరు ఎంత వరకు చదువుకున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ccccccccc-660x315
  1. యువరాజ్ సింగ్: ఐసీసీ వరల్డ్ టీ20 కప్ 2007లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి భారత్‌కు మరపురాని విజయాన్ని అందించిన యువరాజ్ సింగ్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో కేవలం 12వ తరగతి (ఇంటర్) వరకు మాత్రమే చదువుకున్నాడు. అనంతరం క్రికెట్‌లో రాణించాడు.
  2. ఎంఎస్ ధోని: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్‌లోకి అడుగు పెట్టినప్పుడు అతను చదువుకుంది కేవలం 10వ తరగతి వరకు మాత్రమే. అనంతరం ఈ ఆటలో రాణిస్తూనే అతను 12వ తరగతి పూర్తి చేశాడు. ఇప్పుడు ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో బికామ్ డిగ్రీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
  3. గౌతం గంభీర్ : ప్రస్తుతం జట్టుకు దూరమైన ఇంకా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించని గౌతం గంభీర్ ఢిల్లీలో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న హిందూ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నాడు.
  4. విరాట్ కోహ్లి: భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి విశాల్ భారతి పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. అనంతరం సేవియర్ కాన్వెంట్‌లో తన చదువును కొనసాగించాడు. అక్కడే ఇతను 12వ తరగతి వరకు చదువుకున్నాడు. అయితే కోహ్లి చదువుల్లోనూ ప్రతిభను కనబరిచే వాడు.
  5. రవిచంద్రన్ అశ్విన్: పద్మ శేషాద్రి బాలభవన్‌లో అశ్విన్ తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అనంతరం ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఐటీ కోర్సులో బీటెక్ పూర్తి చేశాడు.
  6. సురేష్ రైనా: సురేష్ రైనా క్రికెట్‌లోకి రాకముందు హైస్కూల్ విద్యను పూర్తి చేశాడు.
  7. రోహిత్ శర్మ: అవర్ లేడీ ఆఫ్ వేలంకని, స్వామి వివేకానంద పాఠశాలల్లో రోహిత్ శర్మ ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించాడు. అనంతరం క్రికెట్‌లో రాణిస్తున్నాడు.
  8. శిఖర్ ధావన్: జాతీయ జట్టులోకి రాక ముందు శిఖర్ ధావన్ హైస్కూల్ విద్యను పూర్తి చేశాడు.
  9. ఉమేష్ యాదవ్: ఖాపర్‌ఖెడాలో ఉన్న శంకర్ రావు చౌహాన్ విద్యాలయలో ఉమేష్ యాదవ్ పాఠశాల విద్యను చదువుకున్నాడు.
  10. స్టువర్ట్ బిన్నీ: ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు రోజర్ బిన్నీ కుమారుడే స్టువర్ట్ బిన్నీ. ఇతను ది ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ ఇండియన్ హై స్కూల్‌లలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు.
అయితే పైన ఇచ్చిన క్రీడాకారుల్లో కేవలం ఒకరో, ఇద్దరో మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దాదాపు అధిక శాతం మంది హై స్కూల్ విద్యకే పరిమితమయ్యారు. అయినప్పటికీ వారు తమ ఎనలేని ప్రతిభతో దేశం మొత్తం గర్వించదగ్గ క్రీడాకారులుగా అందరి అభిమానాన్ని, ప్రశంసలను పొందుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top