మునిగిన టైటానిక్ షిప్ నుంచి వెలికి తీసిన తాళం చెవి, వేలంలో పలికిన ధర ఎంతో తెలుసా?

ఓల్డ్ ఈజ్ గోల్డ్… అని పెద్దలు ఊరికే అనలేదు సుమా..! ఎందుకంటే కొన్ని సార్లు పాత వస్తువులు తెచ్చి పెట్టే ధర అంతా ఇంతా కాదు. అది ఊహించనంత రేంజ్‌లో ఉంటుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఆ మాట కొస్తే పాత వస్తువులు బంగారం కన్నా ఎక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే అవి పలికే రేటు అలాంటిది మరి. ఇంతకీ ఇప్పుడీ పాత వస్తువుల గోల అంతా ఏంటి అంటారా..? ఏమీ లేదండీ… మీకు టైటానిక్ ఓడ గురించి తెలుసుగా..? మంచు కొండను ఢీకొట్టి మునిగి పోయింది, అందులో ఉన్న వారందరూ చనిపోయారు, దానిపై ఓ సినిమా కూడా వచ్చింది… అవును, ఆ షిప్పే.. దానికి సంబంధించిన ఓ చిన్నపాటి వస్తువును ఈ మధ్యే వేలం వేశారట. మరి దానికి ఎంత ధర వచ్చిందో తెలుసా..? అవును, మీరు ఊహిస్తుందే… మరి దాని కథా కమామీషుపై ఓ లుక్కేద్దామా..!

titanic-key

ఇంగ్లండ్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న టైటానిక్ షిప్‌లో సిడ్నీ సెడ్యునరీ అనే 23 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. అతను అదే ఓడలో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఓడ మునిగినప్పుడు అందులో చనిపోయిన 1500 మంది ప్రయాణికుల్లో సెడ్యునరీ కూడా ఉన్నాడట. ఈ క్రమంలో పడవ మునిగి అందరూ చనిపోయాక మృతదేహాలను వెలికితీసేటప్పుడు సెడ్యునరీ దేహాన్ని కూడా తీశారట. దాంతోపాటు అతని పరికరాలను, వస్తువులను అతని భార్యకు అప్పట్లోనే ఇచ్చారట. అయితే ఆ వస్తువుల్లో ఓ తాళం చెవి కూడా ఉందట. అది ఓడలో సెడ్యునరీ లాకర్‌కు చెందినది. దానిపై ‘Locker 14 F Deck’ అనే అక్షరాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ తాళం చెవిని ఈ మధ్యే వేలం వేశారు.

వెస్టర్న్ ఇంగ్లండ్‌లో సదరు తాళం చెవికి జరిగిన వేలాన్ని హెన్రీ ఆల్‌డ్రిడ్జ్, సన్ ఇన్ దెవిజెస్‌లు నిర్వహించారు. ఆ వేలంలో ఆ తాళం చెవి అక్షరాలా 1,04,00 లక్షల డాలర్ల ధర పలికింది. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.69 లక్షలు. వామ్మో..! అంత ధరా..! అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆ తాళం చెవి టైటానిక్ షిప్‌లో ఓ లాకర్‌కు సంబంధించింది. అందుకే అంత ధర పలికింది. ఇంకో విషయం తెలుసా..? గతంలోనూ ఆ షిప్ నుంచి వెలికి తీసిన పలు వస్తువులకు వేలం నిర్వహించారట. అవి కూడా ఇంతే స్థాయిలో పెద్ద మొత్తంలో ధర పలికాయట. అవును, మరి. ముందే చెప్పాం కదా… ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని..!

Comments

comments

Share this post

scroll to top