జ‌య‌లలిత అపోలో హాస్పిట‌ల్ బిల్లు ఎంతైందో తెలుసా..?

చిన్న ద‌గ్గో, జ్వ‌ర‌మో వ‌చ్చి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వెళ్ల‌లేక ప్రైవేటు ఆస్ప‌త్రికి వెళ్తేనే అక్క‌డ డాక్ట‌ర్లు మ‌న‌కు ర‌క‌ర‌కాల టెస్టులు చేసి… చివ‌రికి ఏమీ లేద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన‌ట్టు ఏదో ఓ మాత్రో, టానిక్కో ఇచ్చి వైద్యం అయిపోయింది పొమ్మంటారు. ఈ క్ర‌మంలో మ‌న జేబుల‌కు చిల్లు ప‌డ‌డం గ్యారంటీ. అలాంటిది గుండె పోటు లాంటి ఏదైనా పెద్ద అనారోగ్య‌మో సంభ‌విస్తే ఇక దానికి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ఎంత ఖర్చ‌వుతుందో మ‌నం ఊహించ‌లేం. అలాంటి సంద‌ర్భాల్లో వ‌చ్చే బిల్లులు క‌ట్టాలంటే మ‌నం నిజంగానే ఆస్తులు అమ్ముకోవాల్సి వ‌స్తుంది. అయితే మొన్నా మ‌ధ్య చ‌నిపోయ‌న దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ట‌. ఆస్ప‌త్రిలో అన్ని రోజుల పాటు సుదీర్ఘంగా చికిత్స తీసుకున్నందుకు గాను ఆమె హాస్పిట‌ల్ బిల్లు ఉన్న‌ ఆస్తుల క‌న్నా ఎక్కువే అయ్యింద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..!

apollo
గ‌త సెప్టెంబ‌ర్ 22వ తేదీన తీవ్ర అనారోగ్యంతో జ‌య‌ల‌లిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి 75 రోజుల పాటు చికిత్స తీసుకున్న‌ప్ప‌టికీ చివ‌రికి అక‌స్మాత్తుగా వ‌చ్చిన గుండెపోట కార‌ణంగా మృతి చెందింది. అయితే ఆమె ఆస్ప‌త్రిలో  చేరిన ద‌గ్గ‌ర్నుంచీ చ‌నిపోయే వ‌ర‌కు హాస్పిట‌ల్‌లోని థర్డ్ ఫ్లోర్ లోని  గ‌దుల‌న్నీ ఖాళీ చేసి చివ‌రికి వాటి బిల్లు కూడా జ‌య‌ల‌లిత‌కే వేశార‌ట‌. దీంతోపాటు 75 రోజుల వ‌ర‌కు అత్యంత అధునాత‌న ప‌రిక‌రాల‌తో, నిపుణులైన వైద్య బృందంతో ఆమెకు వైద్యం అందించారు. దీనికి తోడు నిత్యం మందులు, ఐసీయూ ఖ‌ర్చు, ఇత‌ర అనేక ఖ‌ర్చులు ఉంటాయి క‌దా. అయితే అన్ని రోజుల‌కు గాను కేవ‌లం హాస్పిట‌ల్ రూంల అద్దెకే రూ.80 కోట్ల వ‌ర‌కు బిల్ అయ్యింద‌ట‌.

అదే కాకుండా ఇక మిగ‌తా వైద్యులకు, సిబ్బందికి, రోజూ ఐసీయూ, మందుల‌కు మ‌రో రూ.70 కోట్ల వ‌ర‌కు అయింద‌ని తెలిసింది. ఈ క్ర‌మంలో జ‌యల‌లిత హాస్పిట‌ల్  బిల్లు రూ.150 కోట్ల పైనే అయింద‌ని తెలిసింది. అయితే గ‌తంలో ఓసారి జ‌య‌లలిత త‌న ఆస్తుల వివ‌రాలు రూ.113 కోట్లు ఉన్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో ఇప్పుడైన బిల్లుతో ఆమె ఆస్తిని పోలిస్తే దాన్ని అమ్మినా ఇంకా ఆమె మ‌రో రూ.37 కోట్ల వ‌ర‌కు అపోలో ఆస్ప‌త్రికి బాకీ ప‌డ‌తారు. అయితే ఆ ఖ‌ర్చును మొత్తం ప్ర‌భుత్వమే భ‌రిస్తుంది కాబ‌ట్టి ఆమె ఒక వేళ బ‌తిక బ‌య‌టికి వ‌చ్చినా ఆస్పత్రి బిల్లుతో దిగులు చెందాల్సిన అవ‌స‌రం ఉండేది కాద‌ని విశ్లేష‌కుల మాట‌. ఏది ఏమైనా కార్పొరేట్ ఆస్పత్రులు అంటే అంతే మ‌రి..! వారికి సీఎం, పీఎం, ధ‌నికులు, పేద‌లు అని తేడా లేదు. బిల్లు ఎంతైనా ముక్కు పిండి వ‌సూలు చేస్తారు. అయితే పేద‌లైతే క‌ట్ట‌లేరు కానీ, ధ‌నికులైతే ఎలాగూ వాదించ‌కుండా బిల్లు క‌డ‌తారు. ఇక సీఎం, పీఎం, ఎంపీ, ఎమ్మెల్యే లాంటి ప్ర‌జా ప్ర‌తినిధులకైతే ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుందిగా..! ఎటొచ్చీ పేద‌, సామాన్య ప్ర‌జ‌ల ఆరోగ్యానికే దిక్కు లేదు..! అన్న‌ట్టు ఇంకో విష‌యం. జ‌య హాస్పిట‌ల్ బిల్లు రూ.150 కోట్ల వ‌ర‌కు అయింది క‌దా, నిజంగా అదే డబ్బుతో అయితే ప్ర‌తి జిల్లా కేంద్రంలోనూ రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.150 కోట్లతో చిన్న‌పాటి హాస్పిటల్స్‌ను 150 వ‌ర‌కు పెట్ట‌వ‌చ్చ‌ట‌. మ‌రి అంత బిల్లు పొందిన అపోలో యాజ‌మాన్యం ఏం చేస్తుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top